List of Revolutions in India in Telugu || భారతదేశంలో ముఖ్యమైన విప్లవాలు || Indian History in Telugu || Gk in Telugu

List of Revolutions in India in Telugu

భారతదేశంలో ముఖ్యమైన విప్లవాలు (Revolutions)
Important Revolutions in India and their Fathers

List of Revolutions in India : భారతదేశంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో వరి, పత్తి, పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో 60 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత కల్గిన వ్యవసాయ రంగంలో అనేక విప్లవాలు జరిగాయి. డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌, హరిత విప్లవం, వర్గీస్‌ కురియన్‌ నేతృత్వంలోని శ్వేత విప్లవం వరకు భారతదేశ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించాయి. విప్లవాలు గురించి అనేక పోటీపరీక్షలలో అడగడం జరిగింది. పోటీపరీక్షల కొరకు సాధన చేసే అభ్యర్థులు దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.భారతదేశంలో వ్యవసాయ మరియు ఇతర రంగాల  అభివృద్ది కొరకు ప్రవేశపెట్టబడిన విప్లవాలు(రెవెల్యూషన్స్‌) గురించి కింద తెలుసుకుందాము.


Also Read : Gk Questions in Telugu


వ్యవసాయ రంగంలో ముఖ్యమైన విప్లవాలు 

➺ హరిత విప్లవం 

హరిత విప్లవం అనేది వ్యవసాయ రంగంలో సాంకేతికత, పరిశోధనలను అభివృద్ది చెందడానికి ఉద్దేశించబడిరది. సాంకేతికత, నూతన పరిశోధన పద్దతులను ఉపయోగించి ఆహార ధాన్యాలలో అభివృద్ది సాధించడం దీని ప్రధాన లక్ష్యం. హరిత విప్లవ పితామహుడిగా నార్మన్‌ బోర్లాగ్‌ను పిలుస్తారు. 


➺ నల్ల విప్లవం (Black Revolution)

నల్ల విప్లవం అనేది పెట్రోలియం ఉత్పత్తికి సంబంధించినది. భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తిని పెంచడానికి , ఇథనాల్‌ ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్లడానికి మరియు బయోడీజిల్‌ ఉత్పత్తి చేపట్టడానికి ఉద్దేశించబడినది. 


➺ పింక్‌ విప్లవం (Pink Revolution)

పింక్‌ విప్లవం అనేది మాంసంకు సంబంధించినది. ఇది భారతదేశంలో విసృతంగా మాంసం ఎగుమతి మరియు ఉత్పత్తి పెంచే ఉద్దేశ్యంలో చేపట్టబడిరది. ఇది కోళ్ల పరిశ్రమ, మాంసం పరిశ్రమ అభివృద్దిని సూచిస్తుంది. 


➺ బూడిద విప్లవం (Gray Revolution) 

గ్రే విప్లవం అనేది ఎరువులకు సంబంధించినది. హరిత విప్లవంలో ఉన్న లోపాలను గుర్తించి విజయం సాధించడం కోసం దీనిని ప్రారంభించారు. 


Also Read : Gk in Telugu 


➺ పసుపు విప్లవం (Yellow Revolution)

ఇది నూనె గింజలకు సంబంధించినది. దేశంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి దీనిని ప్రారంభించారు. 


➺ శ్వేత విప్లవం (White Revolution)

ఇది పాలకు సంబంధించిన విప్లవం. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడాన్ని సూచిస్తుంది. శ్వేత విప్లవం పితామహునిగా వర్గిస్‌ కురియన్‌ను పిలుస్తారు. ఇతనిని మిల్క్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అంటారు. 


➺ నీలి విప్లవం (Blue Revolution) 

ఇది చేపల పెంపకం కొరకు ఉద్దేశించబడినది. భారతదేశంలో చేపల పెంపకాన్ని అభివృద్ది చేయడంతో పాటు అనువైన వాతావరణాన్ని సృష్టించడం కోసం ఏర్పాటు చేయబడినది. 


➺ గ్రీన్‌ విప్లవం (Green Revolution)

టమాటో, ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు పండ్లు ఉత్పత్తిని పెంచడం కోసం దీనిని ప్రారంభించారు. 


➺ రౌండ్‌ విప్లవం (Round Revolution)

భారతదేశంలో బంగాళదుంపు ఉత్పత్తిని పెంచడం అనేది దీని ప్రధాన లక్ష్యం. 


➺ వెండి విప్లవం (Silver Revolution) 

భారతదేశంలో గుడ్ల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల చేయడం కోసం ప్రవేశపెట్టింది. 


Also Read : Latest Jobs in Telugu 


➺ గోధుమ విప్లవం Brown Revolution)

తోలు, సాంప్రదాయేతర వస్తువులు, కోకో ఉత్పత్తిలో అభివృద్ది సాధించకోసం బ్రౌన్‌ విప్లవం ప్రారంభించబడినది. 


➺ గోల్డెన్‌ ఫైబర్‌ విప్లవం (Golden Fiber Revolution)

ఇది భారతదేశంలో జనపనార (జ్యూట్‌) ఉత్పత్తిని పెంచడం కోసం ప్రవేశపెట్టబడినది. 


➺ స్వర్ణ విప్లవం (Gold Revolution)

పండ్లు, హర్టికల్చర్‌ ఉత్పత్తులు, తేనె ఉత్పత్తిని పెంచడం దీని ప్రాధాన లక్ష్యం. 


➺ ఎర్ర  విప్లవం (Red Revolution)

మాంసం మరియు టమోటా ఉత్పత్తి అభివృద్దిని ఇది సూచిస్తుంది. 


➺ సతత హరిత విప్లవం (Evergreen Revolution)

ఇది భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ది సాధించడం కోసం ప్రవేశపెట్టబడిరది.ఎం.ఎస్‌ స్వామినాథన్‌ సతత హరిత విప్లవ పితామహునిగా పేరుగాంచారు.  


➺ సిల్వర్‌ ఫైబర్‌ విప్లవం (Silver Fiber Revolution)

ఇది పత్తి ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల కోసం ప్రారంభించబడినది. 

 

విప్లవం (రెవెల్యూషన్‌) పేరు ఉత్పతులు / అభివృద్ది లక్ష్యం
హరిత విప్లవం ఆహార ధాన్యాలు
నల్ల విప్లవం పెట్రోలియం
నీలి విప్లవం చేపలు
బూడిద విప్లవం హరిత విప్లవం విజయం కోసం
పసుపు నూనె గింజలు
శ్వేత విప్లవం పాలు
నీలి విప్లవం చేపలు
ఆకుపచ్చ విప్లవం కూరగాయలు / పండ్లు
రౌండ్‌ విప్లవం బంగాళదుంప
వెండి విప్లవం గుడ్లు / పౌల్ట్రీ
గోధుమ విప్లవం తోలు / కోకో / సాంపదాయేతర
గోల్డేన్‌ ఫైబర్‌ జనపనార (జ్యూట్‌)
స్వర్ణ విప్లవం హర్టికల్చర్‌ / తేనే
ఎర్ర విప్లవం మాంసం, టామోటా
సతత హరిత విప్లవం వ్యవసాయ సమగ్ర అభివృద్ది

Post a Comment

0 Comments