
TS TET 2023 నోటిఫికేషన్ విడుదల, డౌన్‌లోడ్ PDF, దరఖాస్తు తేదీలు, అర్హత ప్రమాణాలు మరియు పూర్తి వివరాలు తెలుగులో..TS TET Notification 2023 Released || Jobs in Telugu | Latest Jobs in Telugu || Admissions in Telugu
TS TET - 2023 : తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ / డీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయులు కావాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ నిరుద్యోగులు ఎంతగానో వేచిచూస్తున్న ఎదురుచూస్తున్న TS TET - 2023 తాజాగా విడుదలైంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అర్హత పరీక్ష TS TET - 2023 ను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 01 అగస్టు 2023 రోజున విడుదల చేసింది. అగస్టు 2వ తేది నుండి ప్రారంభమయ్యే TS TET - 2023 ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రక్రియ కోసం అర్హులైన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
TS TET - 2023 పరీక్షను రెండు విభాగాలలో నిర్వహిస్తారు. పేపర్-1 మరియు పేపర్-2 రెండు విభాగాలలో నిర్వహిస్తారు. సంబందిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అగస్టు 16, 2023 లోగా ఆన్‌లైన్‌లో రూ॥ 400లు ఫీజులు చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 09 సెప్టెంబర్ 2023 నుండి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 15 సెప్టెంబర్ 2023 రోజున నిర్వహించే TS TET - 2023 పరీక్షను పేపర్ -1 మరియు పేపర్ -2 రెండు విభాగాలలో నిర్వహిస్తారు. ఇందులో పేపర్ -1 పరీక్షను 15 సెప్టెంబర్ 2023 రోజున ఉదయం 9.30 నుండి 12.00 గంటల(రెండున్నర గంటలు) వరకు, పేపర్ -2 పరీక్షను 15 సెప్టెంబర్ 2023 రోజున మధ్యాహ్నం 2.30 నుండి 5.00 గంటల వరకు రెండున్నర గంటల పాటు నిర్వహిస్తారు. అర్హతలను బట్టి అభ్యర్థులు రెండు పేపర్లను వ్రాయవచ్చు. టిఎస్ టెట్-2023 పరీక్ష యొక్క ఫలితాలను 27 సెప్టెంబర్ 2023 రోజున ప్రకటిస్తారు.
TS TET - 2023 పరీక్ష మల్టిపుల్ ఆప్షన్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్-1 లో 150 ప్రశ్నలు, పేపర్-2 లో 150 ప్రశ్నలుంటారు.టిఎస్ టెట్-2023 లో ఉత్తీర్ణత సాధించాలంటే అర్హత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు (రిజర్వేషన్‌లను బట్టి ఇది మారుతుంది) పొందాల్సి ఉంటుంది. టిఎస్ టెట్ - 2023 పరీక్షను తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో నిర్వహిస్తుంది. అభ్యర్థులు అనుకూలతను బట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఎంచుకునే అవకాశం ఉంది. టిఎస్ టెట్ - 2023 యొక్క పరీక్ష పేపర్ ఇంగ్లీష్/తెలుగు భాషలో ఉంటుంది. టిఎస్ టెట్-2023 పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారి ఎలిజిబిలిటీ జీవితాంతం ఉంటుంది. గతంలో టెట్ వ్రాసిన అభ్యర్థులు తమ మార్కులు మెరుగుపరుచుకోవడానికి మళ్లీ వ్రాసుకోవచ్చు.
అర్హత పరీక్ష పేరు |
---|
- TS TET - 2023
Paper-1 (1 నుండి 5వ తరగతి) కోసం కనీస అర్హతలు: |
---|
- కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ / సీనియర్ సెకండరీ (లేదా దాని సమానమైనది). అయితే ఎస్సీ/ఎస్టీ/బిసి/వికలాంగ అభ్యర్థుల విషయంలో కనీస మార్కులు 45% ఉండాలి. మరియు 2-సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / 4-సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / 2-సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత.
- కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత (ఎస్సీ/ఎస్టీ/బిసి/వికలాంగ అభ్యర్థుల విషయంలో కనీస మార్కులు 45% ఉండాలి) మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బిఈడీ) / బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (స్పెషల్)లో ఉత్తీర్ణత సాధించాలి.
(OR)
Paper - 2 (6 నుండి 8వ తరగతి వరకు) |
---|
- బీఏ / బి.ఎస్సీ / బికామ్ లో కనీసం 50% మార్కులతో. (ఎస్సీ/ఎస్టీ/బిసి/వికలాంగ అభ్యర్థుల విషయంలో, కనీస మార్కులు 45% ఉండాలి.) మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడి) కోర్సు / బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడి -స్పెషల్ ఎడ్యుకేషన్) లో ఉత్తీర్ణత.
- 4 సంవత్సరాల బి.ఏ.ఈడీ / బిఎస్సీ.ఈడీ లో కనీసం 50 మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/బిసి/వికలాంగ అభ్యర్థుల విషయంలో, కనీస మార్కులు 45% ఉండాలి.) ఉతీర్ణత
- ఐచ్ఛిక సబ్జెక్టులలో ఒకటిగా సంబంధిత భాషతో గ్రాడ్యుయేషన్ లేదా ఓరియంటల్ లాంగ్వేజ్ బ్యాచిలర్ (లేదా దాని సమానమైనది) లేదా సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత భాషలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్/బీఈడీ మెథడాలజీలలో ఒకటిగా సంబంధిత భాష , భాషా ఉపాధ్యాయులకు సంబంధించి.
- బీ.ఈ /బిటెక్ ఉత్తీర్ణత / బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) లేదా బీఈడీ (ప్రత్యెక విద్య) లో 50 శాతం మార్కులు సాధించాలి.(ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్థుల విషయంలో, కనీస మార్కులు 45% ఉండాలి.) సాధించాలి
(OR)
(OR)
(OR)
TS TET-2023 ధరఖాస్తు విధానం |
---|
- ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి
TS TET-2023 ధరఖాస్తు ఫీజు |
---|
- రూ॥400/- (ఒకే పేపర్ లేదా రెండు పేపర్లకు)
TS TET-2023 ముఖ్యమైన తేదీలు |
---|
- ధరఖాస్తులు ప్రారంభ తేది. 02-08-2023
- ధరఖాస్తులు చివరి తేది.16-08-2023
- హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ తేది.09-09-2023
- (పేపర్-1 మరియు పేపర్-2) పరీక్ష తేది.15-09-2023
- పరీక్షా ఫలితాలు తేది.27-09-2023
TS TET-2023 అర్హత మార్కులు |
---|
- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు అభ్యర్థులు అయితే కనీసం 40 శాతం మార్కులు సాధించాలి
- బిసి అభ్యర్థులు అయితే కనీసం 50 శాతం మార్కులు సాధించాలి
- జనరల్ అభ్యర్థులు అయితే కనీసం 60 శాతం మార్కులు సాధించాలి
TS TET-2023 Paper-1 సబ్జెక్టులు |
---|
- చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాలజీ
- లాంగ్వేజ్ -1
- లాంగ్వేజ్ -2 (English)
- మాథమెటిక్స్
- ఎన్విరాన్‌మెంట్ సైన్స్
TS TET-2023 Paper-2 సబ్జెక్టులు |
---|
- చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాలజీ
- లాంగ్వేజ్ -1
- లాంగ్వేజ్ -2 (English)
- మాథమెటిక్స్
- మాథ్య్ అండ్ సైన్స్ / సోషల్ స్టడీస్
TS TET-2023 Paper -1 (రెండున్నర గంటలు)
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాలజీ | 30 | 30 |
లాంగ్వేజ్ -1 | 30 | 30 |
లాంగ్వేజ్-2 (ఇంగ్లీష్) | 30 | 30 |
మాథమెటిక్స్ | 30 | 30 |
ఎన్విరాన్‌మెంట్ సైన్స్ | 30 | 30 |
మొత్తం | 150 | 150 |
TS TET-2023 Paper -2 (రెండున్నర గంటలు)
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాలజీ | 30 | 30 |
లాంగ్వేజ్ -1 | 30 | 30 |
లాంగ్వేజ్-2 (ఇంగ్లీష్) | 30 | 30 |
మాథమెటిక్స్ | 30 | 30 |
మాథ్య్ అండ్ సైన్స్ / సోషల్ స్టడీస్ | 60 | 60 |
మొత్తం | 150 | 150 |
కెటగిరి | అర్హత పరీక్ష |
నిర్వహించు సంస్థ | తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ |
పేరు | TS TET - 2023 |
రాష్ట్రం | తెలంగాణ |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | Offline |
ఎంపిక ప్రక్రియ | పరీక్ష ద్వారా |
విద్యార్హత | సంబందిత కోర్సులో ఉత్తీర్ణత |
వయోపరిమితి | 18 సంవత్సరాలు నిండి ఉండాలి. |
ఫీజు | 400 |
ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం | 02 అగస్టు 2023 |
ధరఖాస్తు చివరి తేది | 16 అగస్టు 2023 |
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ | 09 సెప్టెంబర్ 2023 |
పరీక్ష | 15 సెప్టెంబర్ 2023 |
ఫలితాలు | 27 సెప్టెంబర్ 2023 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Clck Here |
Ans : TS TET -2023 వివరణాత్మక నోటిఫికేషన్ 01 అగస్టు 2023 రోజున విడుదల చేయబడినది
Ans : 02 అగస్టు 2023 నుండి 16 అగస్టు 2023 వరకు ఉంటుంది.
Ans : TS TET -2023 కు కనీసం 18 సంవత్సరాలుండాలి. గరిష్ట వయస్సు పేర్కొనబడలేదు.
Ans : అవును, అర్హతలను బట్టి రెండు పేపర్లకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
Ans : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది.
0 Comments