
విద్యాలక్ష్మి పథకం
విద్యా ఋణాల కోసం పీఎం విద్యాలక్ష్మి పథకం
Vidya Lakshmi Scheme in Telugu || General Knowledge in Telugu || Gk in Telugu || India Schemes in Telugu
బ్యాంకుల నుండి లోన్ తీసుకోవాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. పైగా అందులో విద్యా ఋణం అయితే అనేక నిబంధనలు, పత్రాలు, పరిమితి ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. విద్యాఋణం కోసం ధరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఋణం మంజూరు అవుతుందో లేదో తెలియదు. ఇలాంటి సమస్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘‘విద్యా లక్ష్మి’’ పథకం చక్కటి మార్గం. విద్యాలక్ష్మి పథకం ద్వారా ధరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం 15 రోజుల్లోగా విద్యాఋణం పొందవచ్చు.
ఇంజనీరింగ్ చదవాలనేది మమత చిరకాల స్వప్నం. ఇంటర్మిడియట్‌లో మంచి మార్కులు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించినా కూడా తన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంజనీరింగ్‌లో సీటు సాధింలేదనే అభిప్రాయ పడిరది. ఇలా దేశంలో అనేక మంది విద్యార్థులు ఆర్థిక స్థితిగతుల కారణంగా పై చదువులు వెళ్లకుండా మద్యలోనే ఆపేస్తుంటారు. ఇలాంటి వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాలక్ష్మి పథకం ద్వారా బ్యాంక్ ఋణం పొందవచ్చు.
విద్యార్థులు సులువుగా, అతి తక్కువ వడ్డీరేటు, ఎలాంటి పూచీకత్తు లేకుండా, విద్యాఋణం అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘‘విద్యాలక్ష్మి’’ పోర్టల్‌ను ప్రారంభించింది. మాములుగా అయితే ఏ విద్యార్థి అయినా బ్యాంకు ఋణం పొందాలంటే నేరుగా బ్యాంక్‌కు వెళ్లాలి. కానీ విద్యాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఆన్‌లైన్‌లోనే ధరఖాస్తు సమర్పించాలి.
➻ ఆన్‌లైన్‌లో ధరఖాస్తు మూడు విధాలుగా ఉంటుంది.
1) రూ॥ 4లక్షల వరకు ఋణం
2) రూ॥ 4 లక్షల నుండి 7.5 లక్షల వరకు
3) రూ॥7.5 లక్షలకు పైగా ఋణం
వీటిపై వడ్డీరేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఋణం ఎలాంటి పూచీకత్తు లేకుండా విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవాలంటే కుటుంబ వార్షికాదాయం 4.50 లక్షల లోపు ఉండాలి.
➻ ఏయే ధృవపత్రాలు కావాలి ?
- విద్యార్హతకు సంబందించిన సర్టిఫికేట్‌లు
- చివరిసారిగా ఉత్తీర్ణత సాధించిన కోర్సు ధృవీకరణ పత్రం
- ప్రస్తుతం చదువుతున్న అకడమిక్ ఇయర్ యొక్క అడ్మిషన్ పత్రాలు
- ఆదాయ ధృవీకరణ పత్రము
- పైన తెలిపిన సర్టిఫికేట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
➻ ఎవరు అర్హులు ?
➻ ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవడం ఎలా ?
- ఒక విద్యార్థి ఒక ధరఖాస్తు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది.
- ఋణం మంజూరి యొక్క స్టేటస్ 15 రోజుల్లోగా తెలుస్తుంది.
- ఋణం మంజూరి విషయాన్ని కూడా ఆన్‌లైన్ తెలుపుతారు.
- ఋణాన్ని కూడా నేరుగా విద్యార్థి బ్యాంక్ అకౌంట్‌లోనే జమ చేస్తారు.
➻ ఏయే కోర్సులకు ఋణాలు మంజూరి చేస్తారు ?
- ఇంజనీరింగ్
- వృత్తి విద్యా కోర్సులు
- ఎంబీబీఎస్
- అర్కిటెక్చర్
- లా
- చార్టర్డ్ అకౌంటెన్సీ
- అండర్ గ్రాడ్యుయేట్
- పోస్టు గ్రాడ్యుయేట్
- విదేశాల్లో ఉన్నత విద్య
- మరియు ఇతర కోర్సులు
కెటగిరీ | విద్యాఋణాలు |
పేరు | విద్యాలక్ష్మి పథకం |
దేశం | ఇండియా వ్యాప్తంగా |
ఎవరి కోసం | విద్యార్థులు |
సంస్థ | బ్యాంకులు |
ఋణ పరిమితి | 7.5 లక్షలకు పైగా |
వార్షికాదాయం | 4.5 లక్షల లోపు |
చివరి తేది | లేదు |
ధరఖాస్తు | ఆన్‌లైన్ |
ఎంపిక | ఆన్‌లైన్ |
Website | Click Here |
0 Comments