
జమిలి ఎన్నికలంటే ఏమిటీ ?
జమిలి ఎన్నికల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
What is meant by Jamili Elections? Gk in Telugu || General Knowledge in Telugu || India Gk in Telugu
Jamili Elections in Telugu : ‘‘జమిలి’’ ఎన్నికలంటే దేశంలోని పార్లమెంట్ మరియు అన్ని రాష్ట్రాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఈ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల ఖర్చులతో పాటు అభివృద్ది కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించవచ్చు. ప్రస్తుతం ఉన్న పద్దతి ప్రకారం లోక్‌సభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే దేశంలోని మిగతా రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా విడతల వారీగా ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన, అభివృద్ది కార్యకలాపాలకు ఆటంకం కల్గుతుంది. ప్రజలకు పథకాల చేరువలో ఆలస్యం జరుగుతుంది. దీంతో దేశాభివృద్ది కుంటుపడుతుంది. ఈ ‘‘జమిలి’’ ఎన్నికల నిర్వహణపై గతంలో అనేకసార్లు కమిటీలు అధ్యయనం చేయడం జరిగింది.
➺ జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల లాభాలేంటి ?
ఈ జమిలి ఎన్నికలు అమలులోకి వస్తే రోజు ఒకేరోజు లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనవచ్చు. సాధారణంగా లోక్‌సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా దాదాపు 4వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ జమిలి ఎన్నికలు అమలులోకి వస్తే ఈ ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం తరచూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలు నిరంతరం ప్రచారం కార్యక్రమాల్లో తలమునకలై ఉంటాయి. అందువల్ల రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలీక ప్రయోజనాలు చేకూరే హామిలు ఇవ్వకుందా కేవలం ప్రజాకర్షక హామిలకు మాత్రమే పరిమితమవుతాయి. దీనివల్ల అభివృద్ది కార్యక్రమాలు కుంటుపడతాయి.
➺ ‘‘జమిలి’’ ఎన్నికలు అమలు కావలంటే ఏం చేయాలి ?
జమిలి ఎన్నికల పద్దతి అమలు కావాలంటే దేశంలోని సగం రాష్ట్రాల మద్దతు తప్పనిసరి అవుతుంది. దేశంలోని సగం రాష్ట్రాలు అసెంబ్లీలు ఈ జమిలి పద్దతిని ఆమోదిస్తు తీర్మాణాలు చేయాల్సి ఉంటుంది.అంతేకాకుండా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
➺ గతంలోనూ జమిలి ఎన్నికల నిర్వహణ :
‘ఒక దేశం ఒకేసారి ఎన్నికల’ విధానం కొత్తదేమి కాదు. గతంలో భారతదేశంలో దేశవ్యాప్తంగా ఒకే రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ జమిలి ఎన్నికల పద్దతి 1951`1967 మధ్య ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. 1968`69 లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడంతో ఈ పద్దతి అమలు ఆగిపోయింది.
0 Comments