Indian Coast Guard jobs in Telugu || Apply Online for 350 Navik and Yantrik in Telugu || Latest Jobs in Telugu

Indian Coast Guard job in Telugu

Indian Coast Guard Recruitment 2023, 350 Posts, Apply Online, Eligibility
Jobs in Telugu || Latest Jobs in Telugu || India Jobs in Telugu

  • 10వ తరగతిలో కేంద్ర కొలువు
  • ఇండియన్‌ కోస్ట్‌గార్డులో నావిక్‌, యాంత్రిక్‌ ఉద్యోగాలు 
  • 350 నావిక్‌, యాంత్రిక్‌ పోస్టుల భర్తీ 

Indian Coast Guard Jobs  in Telugu : ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో ఖాళీగా ఉన్న 350 నావిక్‌ యాంత్రిక్‌ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నావిక్‌, యాంత్రిక్‌ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

ఇండియన్‌ కోస్ట్‌ గార్డులోని నావిక్‌, యాంత్రిక్‌ పోస్టుల భర్తీ కొరకు 08 సెప్టెంబర్‌ 2023 నుండి ధరఖాస్తు చేసుకోవచ్చు. 22 సెప్టెంబర్‌ 2023లోగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో రూ॥300/- చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలి. వ్రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టు ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. నావిక్‌, యాంత్రిక్‌ ఉద్యోగం సాధించిన వారికి బేసిక్‌ పే రూ॥21,700 నుండి 29,200 వరకు జీతభత్యాలు పొందవచ్చు.

మొత్తం 350 నావిక్‌, యాంత్రిక్‌ పోస్టులుండగా ఇందులో నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) 260, నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌) 30, యాంత్రిక్‌ (మెకానికల్‌) 25, యాంత్రిక్‌ (ఎలక్ట్రికల్‌) 20, యాంత్రిక్‌(ఎలక్ట్రానిక్‌) 15 పోస్టులున్నాయి. ఇందులో పోస్టును బట్టీ 10వ తరగతి, ఇంటర్‌, ఎలక్ట్రికల్‌ / మెకానికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌), డిప్లామా, ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 18 నుండి 22 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు జనరల్‌ అభ్యర్థులు అయితే 300/-, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు ఫీజు ఉండదు. అభ్యర్థుల ఆన్‌లైన్‌ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి. 

➠ మొత్తం పోస్టుల సంఖ్య :

దేశవ్యాప్తంగా మొత్తం 350 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 

  • నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌ (30)
  • నావిక్‌ జనరల్‌ డ్యూటీ (260)
  • యాంత్రిక్‌ మెకానికల్‌ (25)
  • యాంత్రిక్‌ ఎలక్ట్రికల్‌ (20)
  • యాంత్రిక్‌ ఎలక్ట్రానిక్స్‌ (15)

➠ అర్హత :

  • నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌ 

10వ తరగతిలో ఉత్తీర్ణ సాధించాలి. 

  • నావిక్‌ జనరల్‌ డ్యూటీ 

ఇంటర్మిడియట్‌లో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణత సాధించాలి. 

  • యాంత్రిక్‌ 

ఈ పోస్టులకు ఎలక్ట్రికల్‌ / మెకానికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌) విభాగాల్లో ఎందులోనైనా 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తి చేయాలి. 

➠ వయోపరిమితి :

  • 18 నుండి 22 సంవత్సరాల మద్యలో ఉండాలి.

(01 మే 2002 నుండి 30 ఏప్రిల్‌ 2006 మధ్య జన్మించిన వారు)

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

➠ పరీక్ష ఫీజు :

  • 300/- జనరల్‌ / ఓబిసి అభ్యర్థులకు 
  • ఫీజు లేదు -  ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు 

➠ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ లో ధరఖాస్తు చేసుకోవాలి.

➠ పరీక్షా విధానం :

మొత్తం 3 స్టేజ్‌లలో ఎంపిక చేయడం జరుగుతుంది. 

స్టేజ్‌ -1

అన్ని పోస్టులకు అబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటబేస్డ్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్దతితో పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. 45 నిమిషాలలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలకు 60 మార్కులుంటాయి. 

స్టేజ్‌ -2

ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో 7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్స్‌ తీయాలి. 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ ఉండాలి. 

స్టేజ్‌ -3

స్టేజ్‌-1, స్టేజ్‌-2 లలో చూపిన మెరిట్‌ ఆధారంగా స్టేజ్‌-3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన తర్వాత సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తర్వాత శిక్షణకు తీసుకుంటారు. 

Also Read : Gk in Telugu

➠ పరీక్షా కేంద్రాలు :

తెలంగాణలో 
  • హైదరాబాద్‌, 
  • నిజామాబాద్‌
  • వరంగల్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో 

  • విజయవాడ
  • విశాఖపట్నం 
  • గుంటూర్‌ 
  • తిరుపతి
  • కాకినాడ 

➠ జీతభత్యాలు :

  • నావిక్‌ పోస్టులకు బేసిక్‌ పే రూ॥21,700 ఉంటుంది. 
  • యాంత్రిక్‌ పోస్టులకు బేసిక్‌ పే రూ॥29,200 ఉంటుంది. 

➠ ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష
  • అసెస్‌మెంట్‌ /అడాప్టబిలిటీ, 
  • ఫిజికల్‌ ఫిటినెస్‌ టెస్టు, 
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ 
  • మెడికల్‌ ఎగ్జామినేషన్‌ 
  • Also Read : Latest Jobs in Telugu

ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్‌ విడుదల సెప్టెంబర్‌ 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభ తేది 08 సెప్టెంబర్‌ 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు చివరి తేది 22 సెప్టెంబర్‌ 2023
స్టేజ్‌ 1 పరీక్ష డిసెంబర్‌ 2023
స్టేజ్‌ 2 జనవరి 2024
స్టేజ్‌ 3 ఏప్రిల్‌ / మే 2024


కెటగిరి‌ జాబ్స్
నిర్వహించు సంస్థ ఇండియన్‌ కోస్ట్‌గార్డు
పోస్టు పేరు నావిక్‌, యాంత్రిక్‌
దేశం ఇండియా
మొత్తం ఉద్యోగాలు 350
ఎక్కడ దేశవ్యాప్తంగా
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్
పరీక్ష విధానం కంప్యూటబేస్‌డ్‌ ఎగ్జామ్‌
ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టు
విద్యార్హత 10వ తరగతి, ఇంటర్‌, ఎలక్ట్రికల్‌ / మెకానికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌), డిప్లామా, ఇంజనీరింగ్‌
వయోపరిమితి 18 నుండి 22 సంవత్సరాలు
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ప్రారంభం 08 సెప్టెంబర్‌ 2023
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ముగింపు 22 సెప్టెంబర్‌ 2023
ప్రిలిమ్స్‌ పరీక్ష నవంబర్‌ 2023
Notification కొరకు Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తుల కొరకు Click Here

Post a Comment

0 Comments