
NABARD Assistant Manager Grade A Recruitment 2023 – Apply Online for 150 Posts
- నాబార్డ్ గ్రేడ్ ‘ఎ’ అసిస్టేంట్ మేనేజర్ జాబ్స్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో ఖాళీగా ఉన్న గ్రేడ్ ‘ఎ’ 150 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో డిగ్రీతో గ్రేడ్ ‘ఎ’ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ప్రారంభంలోనే 1 లక్ష జీతం పొందవచ్చు. మొత్తం గ్రేడ్ ‘ఎ’ 150 అసిస్టేంట్ పోస్టుల విడుదల చేయగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.
Also Read : Gk Questions in Telugu
నాబార్డ్‌లో ఖాళీగా ఉన్న గ్రేడ్ ‘ఎ’ 150 అసిస్టెంట్ పోస్టుల కొరకు అర్హులైన అభ్యర్థులు 23 సెప్టెంబర్ 2023 లోగా ధరఖాస్తు చేసుకోవాలి. నాబార్డ్‌లో ఖాళీగా ఉన్న గ్రేడ్ ‘ఎ’ 150 అసిస్టెంట్ పోస్టులను విడుదల చేయగా ఇందులో జనరల్, కంప్యూటర్ /ఇన్మర్మేషన్ టెక్నాలజీ/, ఫైనాన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేషన్, ఫారెస్ట్రీ, ఆహార తయారీ, గణాంకాలు, కమ్యూనికేషన్ వంటి విభాగాలున్నాయి. 02 సెప్టెంబర్ 2023 నుండి అర్హత కల్గిన అభ్యర్థులు ఆన్‌లైన్ ధరఖాస్తులను స్వీకరిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 23 సెప్టెంబర్‌లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ధరఖాస్తులు చెల్లించేటప్పుడు జనరల్ అభ్యర్థులకు రూ॥800/-, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు అయితే రూ॥150/- ఫీజు చెల్లించాలి. నాబార్డ్‌లో ఖాళీగా ఉన్న గ్రేడ్ ‘ఎ’ 150 అసిస్టెంట్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధిత విభాగాల వారీగా సంబందిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాలి. అసిస్టెంట్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉండాలి. రిజిర్వేషన్‌లను బట్టీ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను సీబీటి ద్వారా 16 అక్టోబర్ 2023 రోజున నిర్వహిస్తారు.
నాబార్డ్‌లో గ్రేడ్ ‘ఎ’ 150 అసిస్టెంట్ పోస్టుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్, మేయిన్స్, ఇంటర్యూలు 3 అంచెలలో ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌లో 200 మార్కులు, మెయిన్స్‌లో 200 మార్కులు, ఇంటర్యూలో 50 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్, మేయిన్స్ పద్దతిలో నిర్వహించే పరీక్షలో రిజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కంప్యూటర్, క్వాంటిటేటీవ్ అప్టిట్యూట్, ఆర్థిక సమస్యలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు. నాబార్డ్ గ్రేడ్ ‘ఎ’ 150 అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక అభ్యర్థులు బేసిక్ పే 44,500/- జీతం పొందుతారు. అసిస్టెంట్ మేనేజర్‌కి బెసిక్ పే నెలవారీగా 1 లక్ష రూపాయలు పొందవచ్చు.
➠ NABARD Grade A మొత్తం పోస్టుల సంఖ్య :
మొత్తం 150 గ్రేడ్ ‘ఎ’ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో
- జనరల్ (77)
- కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (40)
- ఫైనాన్స్ (15)
- కంపెనీ సెక్రటరీ (03)
- సీవిల్ ఇంజనీరింగ్ (03)
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (03)
- జియో ఇన్ఫర్మాటిక్స్ (02)
- ఫారెస్ట్రీ (02)
- ఫుడ్ ప్రాసెసింగ్ (02)
- స్టాటిస్టిక్స్ (02)
- మాస్ కమ్యూనికేషన్స్ (01)
➠ NABARD Grade A విద్యార్హత :
జనరల్ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులైతే 55శాతం ఉండాలి. లేదా ఎంబీఏ/పీజీడీఎంలో 55 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులైతే 50 శాతం సాధించాలి.
మిగిలిన పోస్టులకు సంబందిత డిగ్రీలో 60%తో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులైతే 55% ఉండాలి.
➠ NABARD Grade A వయోపరిమితి :
01 సెప్టెంబర్ 2023 నాటికి 21 నుండి 22 సంవత్సరాల మద్యలో ఉండాలి.
(02 సెప్టెంబర్ 1993 నుండి 01 సెప్టెంబర్ 2002 మధ్య జన్మించిన వారు)
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.
➠ NABARD Grade A ఎంపిక విధానం :
- ప్రిలిమ్స్
- మేయిన్స్
- ఇంటర్యూలు
➠ NABARD Grade A పరీక్ష ఫీజు :
- 800/-జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- 150/- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
➠ NABARD Grade A ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
Also Read : Gk in Telugu
➠ NABARD Assistant Manager పరీక్షా విధానం :
మొత్తం 3 స్టేజ్‌లలో ఎంపిక చేయడం జరుగుతుంది.
స్టేజ్ -1 ప్రిలిమ్స్
అన్ని పోస్టులకు అబ్జెక్టివ్ విధానంలో కంప్యూటబేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఆన్‌లైన్ పద్దతితో పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది.2 గంటలలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలేల్జ్, డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్‌నెస్, గ్రామీణ భారతం, అర్థిక, సాంఘిక అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో పోస్టుకు 25 మందికి చొప్పున స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
స్టేజ్ -2 మెయిన్స్
మెయిన్స్ పరీక్షను అబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1
జనరల్ ఇంగ్లీష్ నుండి డిస్క్రీప్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లోనే కీబోర్డు ఉపయోగించి సమాధానాలు రాయాలి.మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 1.5 గంటలు ఉంటుంది. అభ్యర్థికి ఆంగ్లంలో రాత, విశ్లేషణ నైపుణ్యాలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలిస్తారు. దీనికోసం ఎస్సే, కాంప్రహేన్షన్, రిపోర్టు, పారాగ్రాప్, లెటర్ రైటింగ్‌ల్లో ప్రశ్నలడుగుతారు. పేపర్-1 జనరల్ ఇంగ్లీష్ అభ్యర్థులందరికి ఉమ్మడిగా ఉంటుంది.
పేపర్-2
అబ్జెక్టివ్, డిస్క్రీప్టివ్ రెండు విధాలుగానూ ఉంటుంది. జనరల్ పోస్టుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రామీణ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఆర్థిక, సాంఘిక అంశాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్దిలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు 100 మార్కులు ఉంటాయి. ఇందులో 30 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 50 మార్కులు ఉంటాయి. కొన్ని ఒక మార్కు మరికొన్ని రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షను 30 నిమిషాలలో నిర్వహిస్తారు. డిస్క్రీప్టివ్ 6 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 50 మార్కులకు 90 నిమిషాల్లో నిర్వహిస్తారు. నాలుగు ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. కీబోర్డు ఉపయోగించి, ఇంగ్లీష్ లేదా హిందీలో రాయాలి.రెండు ప్రశ్నలకు ఒక్కో దానికి 15 చొప్పున 30 మార్కులు, మరో రెండు ప్రశ్నలకు ఒక్కో దానికి 10 చొప్పున 20 మార్కులు కేటాయించారు. స్పెషలిస్టు పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత విభాగంలో పేపర్-2 ప్రశ్నపత్రం ఉంటుంది. అబ్జెక్టివ్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానినికీ పావు శాతం మార్కులు తగ్గిస్తారు. మెయిన్స్ అనంతరం సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్ -3
స్టేజ్ -3 లో సాధించిన మార్కుల ఆధారంగా స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. మెరిట్ ప్రకారం ఒక్కొ పోస్టుకు ముగ్గురిని చొప్పున ఇంటర్యూకు ఎంపికచేస్తారు. దీనికి 50 మార్కులుంటాయి.
Also Read : Scholarships in Telugu
➠ NABARD Assistant Manager ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్స్ :
తెలంగాణలో
- హైదరాబాద్/రంగారెడ్డి
- కరీంనగర్
- వరంగల్
- ఖమ్మం
ఆంధ్రప్రదేశ్‌లో
- చీరాల
- శ్రీకాకుళం
- గుంటూర్
- కడప
- కర్నూల్
- నెల్లూర్
- రాజమండ్రి
- విజయవాడ
- విశాఖపట్నం
- తిరుపతి
- కాకినాడ
- విజయనగరం
ముఖ్యమైన తేదీలు | |
---|---|
నోటిఫికేషన్ విడుదల | సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది | 02 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది | 23 సెప్టెంబర్ 2023 |
ప్రిలిమ్స్ పరీక్ష | 16 అక్టోబర్ 2023 |
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | నాబార్డ్ |
పోస్టు పేరు | గ్రేడ్ ‘ఏ’ అసిస్టేంట్ మేనేజర్ |
దేశం | ఇండియా |
మొత్తం ఉద్యోగాలు | 150 |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | కంప్యూటబేస్‌డ్ ఎగ్జామ్ |
ఎంపిక ప్రక్రియ | ప్రిలిమ్స్, మేయిన్స్ ఇంటర్యూ |
విద్యార్హత | ఏదేని డిగ్రీ / సంబందిత సబ్జెక్టులో ఉత్తీర్ణత |
వయోపరిమితి | 21 నుండి 30 సంవత్సరాలు |
ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభం | 02 సెప్టెంబర్ 2023 |
ఆన్‌లైన్ ధరఖాస్తు ముగింపు | 23 సెప్టెంబర్ 2023 |
ప్రిలిమ్స్ పరీక్ష | 16 అక్టోబర్ 2023 |
Notification కొరకు | https://www.nabard.org/ |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | https://www.nabard.org/ |
0 Comments