
భారతదేశం - రాజకీయ పార్టీలు
List of National Political Parties In India
భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉంది. ఒక నిర్ధిష్ట లక్ష్యాలను నెరవేరుస్తు భారత ఎన్నికల సంఘంతో గుర్తింపు పొందిన సంస్థను రాజకీయ పార్టీగా చెప్పవచ్చు. రాజకీయ పార్టీ భారత ఎన్నికల సంఘంచే గుర్తింపు పొందిన తర్వాత దానికి ప్రత్యేకించి పార్టీ గుర్తును కేటాయించడం జరుగుతుంది. 2023 సంవత్సరం నాటికి భారతదేశంలో ఆరు (6) భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు కలవు. ఇవే కాకుండా దాదాపు 56 కంటే ఎక్కువ రాష్ట్ర పార్టీలు, 3000 వరకు గుర్తింపు లేని పార్టీలు అమలులో ఉన్నాయి.
➺ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కింది అర్హతలు సాధించాలి.
ఒక రాజకీయ పార్టీ భారత జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కింది అర్హతలు సాధించాలి.
- భారతదేశంలోని 3 రాష్ట్రాల లోక్‌సభ స్థానాలలో కనీసం 2% సీట్లు సాధించాలి.
- భారతదేశంలోని లోక్‌సభ లేదా అసెంబ్లీ స్థానాలకు జరిగే సాధారణ ఎన్నికలలో 4 లోక్‌సభ స్థానాలతో పాటు కనీసం 6 శాతం ఓట్లను సాధించాలి.
- నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి.
భారతదేశంలో 2023 నాటికి 6 పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు సాధించాయి. చివరిసారిగా ఆమ్‌ఆద్మి పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభించింది. 10 ఏప్రిల్ 2023 నాటికి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) లు జాతీయ పార్టీ హోదాను కోల్పొయాయి.
➺ భారతదేశంలో జాతీయ పార్టీలు (2023) :
- భారతీయ జనతా పార్టీ (బిజేపి)
- భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి)
- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపి)
- బహుజన్ సమాజ్ పార్టీ
- నేషనల్ పీపుల్స్ పార్టీ
➺ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే కింది అర్హతలు సాధించాలి.
- రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను సాధించాలి
- రాష్ట్ర అసెంబ్లీలో కనీసం 2 సీట్లను గెలుచుకోవాలి.
- లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను సాధించడంతో పాటు కనీసం 1 సీటు సాధించాలి.
- జనతాదళ్ (సెక్యులర్) (కర్ణాటక)
- జనతా దళ్ (యునైటేడ్) (బీహార్ )
- ఏఐఏడీఎంకే (తమిళనాడు)
- ద్రవిడ మున్నేట్ర కజగం (తమిళనాడు)
- రాష్ట్రీయ జనతాధళ్ (బీహార్ )
- తెలుగుదేశం పార్టీ (ఆంధ్రప్రదేశ్)
- భారత్ రాష్ట్ర సమితి (తెలంగాణ)
- ఏఐఎంఐఎం
- ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ (పుదచ్చేరి)
- బిజు జనతా దళ్ (ఒడిశా)
- నాగా పీపుల్స్ ఫ్రంట్ (మణిపూర్, నాగాలాండ్)
- ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (అస్సాం)
- అసోం గణ పరిషద్ (అస్సాం)
- ఇండియాన్ యూనియన్ ముస్లీం లీగ్ (కేరళ)
- జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జమ్మూ కాశ్మీర్)
- శివసేన (మహారాష్ట్ర)
- శిరోమణి అకాలీ దళ్ (పంజాబ్)
- సమాద్ వాదీ పార్టీ (ఉత్తరప్రదేశ్)
- సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (సిక్కిం)
- సిక్కిం క్రాంతికారి మోర్చా (సిక్కిం)
- జార్ఖండ్ ముక్తి మోర్చా (జార్ఖండ్)
- మిజో నేషనల్ ఫ్రంట్ (మిజోరాం)
- నేషనలిస్టు డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ (నాగాలాండ్)
- రాష్ట్రీయ లోక్‌దళ్ (ఉత్తరప్రదేశ్)
0 Comments