
location, longitudes, latitudes, location in Telugu (India Geography) || Gk Questions and Answers in Telugu || General Knowledge Questions in Telugu
భూమి అక్షాంశాలు, రేశాంశాలు
ఈ అనంత విశ్వంలో జీవుల మనుగడ కల్గిన ఏకైక అద్భుత గ్రహం భూమి. భూమిని నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు పరిభ్రమిస్తుంది. ఇలా భూమి పరిభ్రమిస్తున్న సమయంలో భూమిపై ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. దిక్కులు, దృవాలు, ప్రకృతి వైపరిత్యాలు, ఉనికి, ఉష్ణోగ్రతలు, వర్షపాతం, భూకంపాలు, సునామీలు ఇలా అనేక మార్పులు సంభవిస్తాయి. భూమిపై ఎప్పటికప్పుడు ఏర్పడే వాతావరణ పరిస్థితిలతో పాటు భూమి ఏర్పడు అక్షాంశ, రేఖాంశాల గురించి పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు తెలుసుకోవడం ముఖ్యం. భూమిపై గల అక్షాంశాలు, రేశాంశాల గురించి బిట్స్ రూపంలో తెలుసుకుందాం..
1. కొలంబస్ ఏ దేశ వాస్తవ్యుడు ?
జవాబు : ఇటలీ
2. ఒకవేళ మీరు ఉత్తరం వైపున ముఖాముఖిగా నిలుచుంటే మీ యొక్క కుడివైపు ఏ దిక్కు ఉంటుంది ?
జవాబు : తూర్పు
3) భూమిపై గల 7 మహాసముద్రాలలో గడ్డకట్టిన మహా సముద్రం ఏది ?
జవాబు : అర్కిటిక్ మహాసముద్రం
Also Read : Gk Questions in Telugu
4) భూగోళంపై అక్షాంశాలను ఏ దిశ నుండి వ్రాస్తారు ?
జవాబు : పడమర దిక్కు నుండి తూర్పు దిక్కు వైపు
5) ఒకే రకమైన పొడవు కల్గి ఉండే భూరేఖలు ఏవి ?
జవాబు : రేఖాంశాలు
6) భూమిపై భారతదేశాన్ని రెండు సమానభాగాలుగా విడదీసే ఆక్షాంశం పేరు ఏమిటీ ?
జవాబు : కర్కటరేఖ
7) అక్షాంశాలన్నింటిలో పొడవైనది ఏది ?
జవాబు : భూమధ్యరేఖ
8) ధ్రువాలన్నింటిని మిళితం చేస్తు గీయబడే ఊహరేఖలను ఏమంటారు ?
జవాబు : రేఖాంశాలు అని పిలుస్తారు.
9) గ్లోబును రెండు సమానభాగాలుగా వీడదీసే అక్షాంశంను ఏమని పిలుస్తారు ?
జవాబు : భూమధ్య రేఖ
10) భూగ్లోబుపై ‘ 0 ’ డిగ్రీల రేఖాంశంను ఏమని పిలుస్తారు ?
జవాబు : గ్రీనిచ్ రేఖాంశాలు
11) భూగ్లోబుపై 180 డిగ్రీల రేఖాంశాలను ఏమని పిలుస్తారు ?
జవాబు : తూర్పు, పశ్చిమ రేఖాంశాలు
12) అక్షాంశాలన్నింటిలో ముఖ్యమైన అక్షాంశాలన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : కర్కటరేఖ, మకరరేఖ, భూమధ్య రేఖ
13) 180 డిగ్రీల రేశాంశాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : అంతర్జాతీయ దినరేఖ
14) ఒకవేశ నువ్వు ఉత్తర దిశకు ఎదురుగా నిలుచొని ఉంటే నీకు ఎడమ వైపు ఏ దిక్కు ఉంటుంది ?
జవాబు : పడమర దిశ
15) భూమి పడమర నుండి తూర్పుకు తిరగడాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : భూభ్రమణ దిశ
16) భూమి మధ్య నుండి దక్షిణ, ఉత్తర ధ్రవాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు ?
జవాబు : అక్షాలు అంటారు
17) భూమి యొక్క రంగు నీలం (బ్లూ కలర్) రంగులో ఉండడానికి గల కారణం ఏమిటీ ?
జవాబు : భూమిపై అత్యధిక శాతం నీరు ఉండటం వల్ల
18) 1492 సంవత్సరంలో యూరప్ ఖండం నుండి భారతదేశాన్ని చేరుకోవాలని ప్రయత్నించిన ఖగోళ శాస్త్రవేత్తం ఎవరు ?
జవాబు : కొలంబస్
0 Comments