Chandrayaan-3 Gk Questions in telugu with answers || Gk Questions with Answers || Gk bits in Telugu

Chandrayaan-3 Gk Questions in Telugu

GK Quiz on Chandrayaan 3 – Latest General Knowledge Question on India’s Moon Mission || Gk questions in Telugu || Gk bits with Answers || Gk Questions with Answers 
చంద్రయాన్‌ - 3 గురించి ముఖ్యమైన ప్రశ్నలు 


చంద్రునిపై అన్వేషణ, పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన మరో ప్రతిష్టాత్మక మిషన్‌ Chandrayaan-3. గతంలో చంద్రయన్‌ -2 పరీక్ష విఫలం కావడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్‌-3 రూపకల్పన చేశారు. ఈ Chandrayaan-3 ప్రయోగాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.  Chandrayaan-3 నింగిలోకి పంపించడంతో ఈ ఘనత సాధించిన నాల్గవ దేశం(అమెరికా, చైనా, రష్యా) గా భారత్‌ నిలవనుంది. ఇస్రోచైర్మన్‌ సోమ్‌నాథ్‌ నేతృత్వంలోని బృందం ఈ మిషన్‌లో  పాలుపంచుకుంది.


1. చంద్రయాన్‌ -3 మిషన్‌ ఏ తేదీన ప్రయోగించారు ?

జవాబు : 14 జూలై 2023, మధ్యాహ్నం 2.35 గంటలకు 


2. చంద్రయాన్‌ -3 మిషన్‌లోని రోవర్‌ను ఏమని పిలుస్తారు ? 

జవాబు : ప్రజ్ఞాన్‌ 


3) చంద్రయాన్‌ -3 లోని ల్యాండర్‌ మరియు రోవర్‌ యొక్క మిషన్‌ జీవితకాలం ఎంత  ? 

జవాబు : 14 భూమి రోజులు


4) చంద్రయాన్‌ -3 ప్రయోగం కోసం ఉపయోగించిన లాంఛర్‌ పేరు ఏమిటీ ? 

జవాబు : జీఎస్‌ఎల్‌వి ఎంకే-3


5) చంద్రయాన్‌ -3 లక్ష్యం ఏమిటీ  ? 

జవాబు : చంద్రుని దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత నీటి జాడ కనుగొనడం 


6) చంద్రయాన్‌ -3 మిషన్‌ కొరకు అయిన ఖర్చు ఎంత  ? 

జవాబు : సుమారు 960 కోట్ల రూపాయలు (74 మిలియన్‌ డాలర్లు) 


7) చంద్రయాన్‌ -3 ఎన్ని కిలోల బరువు ఉంటుంది ? 

జవాబు : సుమారు 3,900


8) ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ యొక్క రూపం ఎలా ఉంటుంది ?

జవాబు : పైన సిలిండర్‌తో పాటు సోలార్‌ప్యానెల్‌ బాక్స్‌లాంటి నిర్మాణం ఉంటుంది.


9) చంద్రయాన్‌ -3 మిషన్‌ నిర్వహించిన డైరెక్టర్‌ ఎవరు ? 

జవాబు : రీతు కరిధాల్‌ 


10) చంద్రయాన్‌ -3 యొక్క ల్యాండర్‌ చంద్రునిపై ఏ దిశలో ల్యాండ్‌ అవుతుంది ? 

జవాబు : చంద్రుని యొక్క దక్షిణ ధృవంపై ల్యాండ్‌ అవుతుంది. 


Also Read : Gk Questions in Telugu


11) చంద్రునిపై విజయవంతంగా ల్యాండర్‌ను దించిన దేశాలలో భారత్‌ ఎన్నవ దేశం ? 

జవాబు : 4వ దేశం 

(అమెరికా, రష్యా, చైనా) 


12) చంద్రయాన్‌ -3 లో ల్యాండర్‌ మరియు రోవర్‌ మోసుకెళ్లే శాస్త్రీయ పరికరాలు ఏమిటీ ? 

జవాబు : ఉపరితల, వాతవరణ, వాటర్‌ సైన్స్‌ విజ్ఞాన సాధనాలు 


13) 14 జూలై 2023 రోజున ప్రయోగించిన చంద్రయాన్‌ -3 చంద్రునిపై ఏ రోజున ల్యాండింగ్  అయింది ? 

జవాబు : 23 అగస్టు 2023


14) చంద్రయాన్‌ -3 చంద్రునిపై ల్యాండ్‌ అయిన రోజు 23 అగస్టు ను ఏ దినోత్సవంగా జరుపుకుంటారు ? 

జవాబు : జాతీయ అంతరిక్ష దినోత్సవం 


15) చంద్రయాన్‌ -3 ల్యాండింగ్ స్పాట్‌ను ఏమని పిలుస్తారు  ? 

జవాబు : శివశక్తి పాయింట్‌ 


16) చంద్రయాన్‌ -3 లో ఏ రసాయన మూలకం కనుగొన్నారు ? 

జవాబు : సల్ఫర్‌ 


17) చంద్రయాన్‌ -2 లో లేని టెక్నాలజీని  చంద్రయాన్‌ -3 లో వాడటం జరిగింది. అది ఏమిటీ  ? 

జవాబు : లేజర్‌ డాప్లర్‌ వెలోసిమీటర్‌ (ఎల్‌డివి) 


18) చంద్రయాన్‌ -3 లో ఉన్నది చంద్రయాన్‌ -2 లో లేనిది ఏమిటీ  ? 

జవాబు : ఆర్బిటర్‌ 


19) చంద్రయాన్‌ -2 ఆర్భిటర్‌ చంద్రయాన్‌ -3 ని ఏమని స్వాగతం పలికింది ? 
జవాబు : వెల్‌కమ్‌ బడ్డీ 

20) చంద్రయాన్‌ -3 ని ప్రయోగించిన ప్రదేశం ఎక్కడ ఉంది  ? 
జవాబు : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం


21) చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేందుకు ఎన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను వాడటం జరిగింది ? 
జవాబు : 7  

22) చంద్రయాన్‌ -3లో ఉపయోగించిన ‘‘అల్టీమీటర్‌’’ ఏ పని చేస్తుంది ?
జవాబు : ఎత్తును నిర్ణయిస్తుంది 

23) ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ ఎన్ని కిలోలు ఉంటుంది ?
జవాబు : 2,145 కిలోలు 

24) ప్రపంచంలో చంద్రుని దక్షిణ ధృవంపై చేరిన మొట్టమొదటి దేశం ఏది ?
జవాబు : భారత్‌ 

25) భూమి నుండి చంద్రునికి ఎంత దూరం ఉంటుంది ? 
జవాబు : సుమారు 3,84,400 కిలోమీటర్లు

26) చంద్రయాన్‌ -3ని తయారు చేసిన అంతరిక్ష పరిశోధన కేంద్రం పేరు ఏమిటీ  ?
జవాబు : సతీష్‌దావన్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ 

27) ప్రస్తుతం (2023) ఇస్రో చైర్మన్‌ ఎవరు ? 
జవాబు : ఎస్‌. సోమ్‌నాథ్‌

28) చంద్రయాన్‌ -2 ఏ దశలో ఫేయిల్‌ అయ్యింది  ? 
జవాబు : చంద్రునిపై ల్యాండిరగ్‌ అయ్యే సమయంలో 

29) చంద్రయాన్‌ -3 లో వాడిన 7 సాంకేతిక పరిజ్ఞానాల పేర్లు ఏమిటీ ?
  • అల్టీమీటర్స్‌
  • వెలోసీ మీటర్స్‌ 
  • ఇనర్షియల్‌ మెజర్‌మెంట్‌ 
  • ప్రొపల్షన్‌ సిస్టమ్‌ 
  • నెవిగేషన్‌ గైడెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ 
  • హాజర్డ్స్‌ డిటెక్షన్‌ మరియు అవాయిడెన్స్‌
  • ల్యాండిరగ్‌ లెగ్‌ మెకానిజం 

30) గతంలో చంద్రునిపైకి భూమి పంపించిన మిషన్‌ పేరు ఏమిటీ ?
జవాబు : చంద్రయాన్‌ -2



Post a Comment

0 Comments