Prime Minister Scholarship Scheme (PMSS) in Telugu || Scholarships in Telugu

Prime Minister Scholarship Scheme (PMSS) in Telugu

Prime Minister Scholarship Scheme (PMSS)
 ప్రైమ్‌ మినిస్టర్‌ స్కాలర్‌షిప్‌ స్కీం 

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌ సెక్రటేరియట్‌ ఆధ్వర్యంలో అందించే ప్రైమ్‌ మినిస్టర్‌ స్కాలర్‌షిప్‌ స్కీం అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రైమ్‌ మినిస్టర్‌ స్కాలర్‌షిప్‌ స్కీం మాజీ సైనికులు / మాజీ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది పిల్లలకు, వితంతువులకు ప్రవేశపెట్టారు. వీరు ప్రొఫెషనల్‌ లేదా టెక్నికల్‌ డిగ్రీ కోర్సులు చేసేందుకు ప్రోత్సహిస్తూ ప్రైమ్‌ మినిస్టర్‌ స్కాలర్‌షిప్‌ స్కీం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌ను దేశవ్యాప్తంగా 5500 మందికి అందిస్తారు. ఇందులో బాలురకు 2750, అలాగే బాలికలకు 2750 స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ప్రకారం సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. బాలురకు అయితే నెలకు 2500 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు. బాలికలకు అయితే నెలకు 3000 చొప్పున 36,000 రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందజేస్తారు. అభ్యర్థులు వారి అకడమిక్‌ ఇయర్‌ చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక మాజీ సైనిక / కోస్ట్‌గార్డ్‌ ఉద్యోగికి సంబంధించి ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ స్కీం వర్తిస్తుంది. అబ్బాయిలకు 25 ఏళ్లు వచ్చేవరకు, అమ్మాయిలకు వివాహమయ్యేవరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. వితంతువులకు వారు మరల వివాహం చేసుకునేవరకు ఎటువంటి వయోపరిమితి ఉండదు. 

స్కాలర్‌షిప్‌ పేరు 

  • ప్రైమ్‌ మినిస్టర్‌ స్కాలర్‌షిప్‌ స్కీం 

➸ Prime Minister Scholarship Scheme (PMSS) విద్యార్హతలు : 

  • కనీసం ఇంటర్‌ / తత్సమాన కోర్సు ఉత్తీర్ణత 
  • ఇంటర్‌ / డిప్లొమా / డిగ్రీ స్థాయిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి 
  • బీఈ, బీటెక్‌, బీడీఎస్‌, ఎంబీబీఎస్‌, బీఈడీ, బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశం పొంది ఉండాలి. 
  • ఏఐసీటీఈ/మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా / యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో ప్రవేశం కల్గి  ఉండాలి 
  • బీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ+బీఈడీ వంటి ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రొఫెషనల్‌ స్టడీకి, బీఈ+ఎంఈ, బీబీఏ+ఎంబీఏ  వంటి పూర్తి టెక్నికల్‌ / ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మొదటి డిగ్రీకి  మాత్రమే స్కాలర్‌షిప్‌ ఇస్తారు. 
  • లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందినవారు. 
  • పారామిలిటరీ ఉద్యోగుల పిల్లలు అనర్హులు 
  • పూర్తి అర్హతలు నోటిఫికేషన్‌లో చూడవచ్చు. 

➸ Prime Minister Scholarship Scheme (PMSS) మొత్తం :

  • నెలకు 2500 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు (బాలురు) 
  • నెలకు 3000 చొప్పున 36,000 రూపాయలు (బాలికలు) 

➸ Prime Minister Scholarship Scheme (PMSS) ఎంపిక విధానం :

  • ప్రతిభ ఆధారంగా 

➸ Prime Minister Scholarship Scheme (PMSS) ఎవరు అర్హులు:

  • మాజీ సైనికులు / మాజీ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది పిల్లలకు, వితంతువులకు 

➸ మొత్తం ఎన్ని స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి :

  • దేశవ్యాప్తంగా 5000 ఉన్నాయి. 

 ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➸ Prime Minister Scholarship Scheme (PMSS) ధరఖాస్తుకు చివరి తేది :

  • 30 నవంబర్‌ 2023


కెటగిరి స్కాలర్‌షిప్‌
పేరు ప్రైమ్‌ మినిస్టర్‌ స్కాలర్‌షిప్‌ స్కీం
సంస్థ కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌ సెక్రటేరియట్‌ ‌
విద్యార్హత ప్రొఫెషనల్‌ లేదా టెక్నికల్‌ డిగ్రీ కోర్సులు
ఎవరు అర్హులు మాజీ సైనికులు / మాజీ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది పిల్లలకు, వితంతువులకు
స్కాలర్‌షిప్‌ మొత్తం 36,000 వరకు
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
పూర్తి సమాచారం కోసం https://ksb.gov.in/
Last Date 30-11-2023

Post a Comment

0 Comments