PM Vishwakarma Scheme in Telugu || పీఎం విశ్వకర్మ పథకం || Gk in Telugu || General Knowledge in Telugu

PM Vishwakarma Scheme in Telugu

What is the Vishwakarma scheme?
PM Vishwakarma Scheme: Benefits and Eligibility
Gk in Telugu ||  General Knowledge in Telugu || India Gk in Telugu

  • పీఎం  విశ్వకర్మ పథకం ప్రారంభం 
  • 3 లక్షల వరకు రుణ సదుపాయం 

భారతదేశంలోని వెనుబడిన కులవృత్తుల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని కుల వృత్తులు చేసుకునే వారికి వ్యాపార అభివృద్ది కోసం  తక్కువ వడ్డీకి ఎలాంటి పూజీకత్తులేకుండా రుణ సాయం అందించేందుకు ‘‘పీఎం విశ్వకర్మ’’ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాంప్రదాయ కళాకారులతో  పాటు చేతివృత్తుల వారు, చేనేత కళాకారులు, స్వర్ణకారులు, ఇనుప పనిముట్లు తయారుదారులు, ఇస్త్రీ పనివారు, నాయీబ్రహ్మణులు వంటి మొదలైన వారి వృత్తిని మరింత అభివృద్ది చేసుకొని జీవనోపాధి పొందడం కోసం 3 లక్షల రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా కేంద్ర  ప్రభుత్వం రుణం మంజూరి చేస్తుంది. తొలివిడతలో ఒక్కొక్కరికి 18 నెలల వాయిదాలతో రూ॥1 లక్ష ను మలివిడతలో 30 నెలల వాయిదాలతో రూ॥2లక్షల రూపాయలను అందిస్తారు. తర్వాతి దశలో రూ॥3లక్షలు అందిస్తారు. లబ్దిదారులు 5% వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 8% వడ్డీని కేంద్ర  ప్రభుత్వం భరిస్తుంది. తొలుత లబ్దిదారులను గుర్తించి సర్టిఫికేట్‌తో పాటు గుర్తింపుకార్డు ఇస్తారు. ఇందులో ఎంపికైన లబ్దిదారులకు 5 నుండి 7 రోజుల్లో 40 గంటల పాటు ప్రాథమిక శిక్షణ ఇప్పిస్తారు. ఆసక్తి గలవారు మరింత నైపుణ్యం సాధించడం కోసం 15 రోజుల్లో 120 గంటల శిక్షణకు ధరఖాస్తు చేసుకోవచ్చు. వారికి శిక్షణతో పాటు ప్రతి రోజు 500 స్టైఫండ్‌ కూడా ఇస్తారు. అంతేకాకుండా రూ॥15000 ను టూల్‌ కిట్ల కోసం ఇన్సెంటీవ్‌గా అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసిన వారు వ్యాపారం  ప్రారంభించిన తర్వాత నెలకు 100 డిజిటల్‌ లావాదేవీల వరకూ ఒక్కో దానికి  రూపాయి బోనస్‌గా ఇస్తారు. మార్కెటింగ్‌ జాతీయ కమిటీ విశ్వకర్మల ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికేట్‌, బ్రాండిరగ్‌, ప్రచారం, ఈ కామర్స్‌ లింకేజీ, ఎగ్జిబిషన్లలో ప్రచారం, ఇతర మార్కెటింగ్‌ వ్యవహరాల్లో సహాయం చేస్తుంది.  

పీఎం విశ్వకర్మ పథకం కోసం ధరఖాస్తు చేయాలంటే చేతులు, టూల్‌ కిట్ల సాయంతో పనులు చేసుకునే మొత్తం 18 కులవృత్తుల వారు అర్హులు. అసంఘటిత రంగంలో స్వయంఉపాధికి ఎంచుకునే వారు ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. చేతివృత్తులు చేసుకునే 18 సంవత్సరాలు నిండిన ఎవరైన ధరఖాస్తు చేసుకోకునే అవకాశం ఉంది. 

పీఎం విశ్వకర్మ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలను కేటాయించింది.  ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల కుటుంబాలు లబ్దిపొందనున్నారు. 


➠  పథకం పేరు :

  • పీఎం విశ్వకర్మ (PM Vishwakarma) పథకం 

Also Read : India Scheme in Telugu


➠ PM Vishwakarma ఎవరు అర్హులు :

  • వడ్రంగులు 
  • పడవలు తయారు చేసేవారు 
  • కమ్మరి 
  • ఇనుప పరికరాలు తయారు చేసేవారు 
  • ఇంటి తాళాలు తయారీదారులు 
  • స్వర్ణకారులు 
  • కుమ్మరి (కుండలు తయారు చేసేవారు)
  • విగ్రహాల తయారీదారులు (మూర్తికార్‌, స్టోన్‌ కర్వర్‌, స్టోన్‌ బ్రేకర్‌)
  • చర్మకారులు (చెప్పులు తయారు చేసేవారు)
  • తాపీ మేస్త్రీలు 
  • బాస్కెట్‌/మ్యాట్‌/బ్రూమ్‌ మేకర్‌/నారతాళ్లు చేసేవారు 
  • సాంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు 
  • నాయీబ్రహ్మణులు, 
  • పూలదండలు తయారు చేసేవారు 
  • లోహ పనివారు 
  • రజకులు 
  • దర్జీలు 
  • చేప వలల  తయారీ దారులు 

➠ PM Vishwakarma కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • ఆధార్‌ కార్డు
  • అడ్రస్‌ ఫ్రూఫ్‌ 
  • మొబైల్‌ నెంబర్‌ 
  • కుల ధృవీకరణ పత్రము 
  • బ్యాంకు ఖాతా పాస్‌బుక్‌ 
  • పాస్‌సైజు ఫోటో 

➠ వయస్సు :

  • కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

Also Read : Gk Questions in Telugu 

➠ PM Vishwakarma ఎంత రుణం అందజేస్తారు ?

  • రూ॥3 లక్షల వరకు రుణం అందజేస్తారు. 

తొలి విడతలో రూ॥1 లక్ష, మలివిడతలో రూ॥2లక్షలు, తర్వాత దశలో రూ॥3 లక్షలు అందజేస్తారు.


➠ ఎంత సమయంలో రుణం చెల్లించాలి ?

  • 18 నెలల వాయిదాలతో రూ॥1లక్ష
  • 30 నెలల వాయిదాలతో రూ॥ 2 లక్షలు చెల్లించాలి  

➠ PM Vishwakarma వడ్డీశాతం ఎంత ఉంటుంది ?

  • 5 % వడ్డీ రేటు ఉంటుంది 

(మిగతా 8% వడ్డీని కేంద్రప్రభుత్వం భరిస్తుంది) 


➠ PM Vishwakarma శిక్షణ ఎలా ఉంటుంది ?

 5 నుండి 7 రోజుల్లో 40 గంటల పాటు ప్రాథమిక శిక్షణ ఇప్పిస్తారు. ఆసక్తి గలవారు మరింత నైపుణ్యం సాధించడం కోసం 15 రోజుల్లో 120 గంటల శిక్షణకు ధరఖాస్తు చేసుకోవచ్చు. వారికి శిక్షణతో పాటు ప్రతి రోజు 500 స్టైఫండ్‌ కూడా ఇస్తారు. అంతేకాకుండా రూ॥15000ను టూల్‌ కిట్ల కోసం ఇన్సెంటీవ్‌గా అందజేస్తారు.


Also Read : Gk in Telugu 


➠ PM Vishwakarma ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


కెటగిరి కేంద్ర పథకం
పేరు పీఎం విశ్వకర్మ పథకం
దేశం ఇండియా‌ ‌
ప్రాంతం దేశ వ్యాప్తంగా
ఎవరు అర్హులు చేతివృత్తుల వారు
లబ్ది రుణసాయం
రుణ మొత్తం 3 లక్షల వరకు
వయస్సు కనీసం 18 సంవత్సరాలు
వడ్డీ శాతం 5 %
కాలపరిమితి 18 నెలలు / 30 నెలలు
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
1) PM Vishwakarma అంటే ఏమిటీ ?

జవాబు : దేశంలోని చేతివృత్తుల అభివృద్ది కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పీఎం విశ్వకర్మ

2) PM Vishwakarmaకు ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు ?

జవాబు : 18 సంవత్సరాలు నిండిన 18 కులవృత్తులకు చెందిన లబ్దిదారులు ధరఖాస్తు చేసుకోవచ్చు.

3) PM Vishwakarma ద్వారా ఎంతవరకు ఋణం అందజేస్తారు ?

జవాబు :తిరిగి చెల్లించే విధంగా 5% వడ్డీ రేటుతో 3 లక్షల వరకు ఋణ సదుపాయం ఉంటుంది. ‌

4) PM Vishwakarma ఎప్పటినుండి అమలులోకి వచ్చింది ?

జవాబు : దేశ ప్రధాన నరేంద్రమోడీ చేతులమీదగా 17 సెప్టెంబర్‌ 2023 రోజున ప్రారంభించారు.

5) పీఎం విశ్వకర్మకు తీసుకున్న ఋణంలో ఏమైనా సబ్సిడీ ఉంటుందా ?

జవాబు : లేదు, తీసుకున్న ఋణాన్ని 5% వడ్డీ రేటుతో సులభవాయిదాల పద్దతిలో తిరిగి చెల్లించాలి.

Post a Comment

0 Comments