
జలపాతం అంటే ఒక నది యొక్క నీరు నిటారుగా కిందికి దిగడం. ఈ జలపాతం నిటారుగా ఉన్న పర్వతాలలో ఒక నది పై భాగంలో ఏర్పడుతుంది. ప్రకృతి ఏర్పరచిన అందాలలో జలపాతాలు ముందువరుసలో ఉంటాయి. ప్రకృతి సృష్టించిన అందాలలో జలపాతాలకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని పదుల, వందల అడుగుల ఎత్తు నుండి కిందికి జారే జలధారలు మనసును పరవశింపజేస్తాయి. మాములు జలపాతాలే మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తే మరి అతిపెద్ద జలపాతాలు ఇంకెంత సంబ్రమశ్చార్యాలకు గురిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని ప్రఖ్యాతి పొందిన జలపాతాల గురించి తెలుసుకుందాం..
➺ ప్రపంచంలోని టాప్ 20 జలపాతాలు :
- ఇగ్వాజు జలపాతం, అర్జెంటీనా, బ్రెజిల్
- విక్టోరియా జలపాతం, జాంబియా మరియు జింబాబ్వే
- ప్లిట్విస్ లేక్ జలపాతం, క్రొయేషియా
- నయాగరా జలపాతం, అమెరికా, కెనడా
- ఏంజెల్ ఫాల్స్, వెనిజులా
- తుగేలా జలపాతం, దక్షిణాఫ్రికా
- గుల్‌ఫాస్, ఐస్‌లాండ్
- యోస్మైట్ ఫాల్స్, అమెరికా
- దూద్‌సాగర్ జలపాతం, ఇండియా
- కైటెర్ జలపాతం, గయానా
- రూబీ జలపాతం, అమెరికా
- సదర్లాండ్ జలపాతం, న్యూజిలాండ్
- జోగ్ జలపాతం, ఇండియా
- కుయాంగ్ సి జలపాతం, లావోస్
- ఫాల్ క్రిక్ జలపాతం, అమెరికా
- హోయాంగ్‌హో జలపాతం, చైనా
- బ్లూనైలు జలపాతం, ఇథియోపియా
- థీలోసు జలపాతం, థాయిలాండ్
- క్రిమ్‌లా జలపాతం, ఆస్ట్రియా
- బాన్‌జియాక్ జలపాతం, వియత్నాం
0 Comments