
India History Gk Questions in Telugu || Gk Questions and Answers || Gk Bits in Telugu
Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
1. ఈ క్రింది వాటిలో చంద్రగుప్త మౌర్యుడు నందరాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఉన్న గ్రంథం ఏది ?
ఎ) కౌటిల్యుడి అర్థశాస్త్రం
బి) విశాఖదత్తుడి ముద్రారాక్షసం
సి) పతంజలి మహాభాష్యం
డి) మాడలీన్ స్లేడ్
జవాబు : బి) విశాఖదత్తుడి ముద్రారాక్షసం
2) మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) క్రీ.పూ 321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
2) ఈయన మొరియా తెగకు చెందినవాడు
3) జైన, బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియులు
4) పురాణాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడిది శూద్రవంశం
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 2, 3, 4
సి) 1, 2 మరియు 3
డి) 1 మరియు 4 మాత్రమే
జవాబు : బి) 1, 2, 3, 4
3) కింద ఇచ్చిన రచయితలు, గ్రంథాలను జతపరచండి ?
1) ప్లీనీ
2) ప్లూటార్క్
3) టాలమీ
4) మెగస్తనీస్
ఎ) ఇండికా
బి) ది లైన్స్
సి) నేచురల్ హిస్టరీ
డి) జాగ్రఫీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
జవాబు : బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) ఈ క్రిందివాటిలో అశోకుడి గురించి తెలుసుకోవడానికి ఆధారమైన స్వదేశీ గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి ?
1) విశాఖదత్తుడు
2) హేమచంద్ర
3) సోమదేవుడు
4) కల్హణుడు
ఎ) రాజతరంగిణి
బి) పరిశిష్ట పర్వన్
సి) ముద్రారాక్షసం
డి) కథాకవితాసాగరం
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
జవాబు : సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
5) కౌటిల్యుడి అర్థశాస్త్రానికి సంబంధించి సరైనవి గుర్తించండి ?
1) కౌటిల్యుడి చాణుక్యుడు, విష్ణుగుప్తుడు అని అంటారు,
2) సంస్కృతంలో రాసిన అర్థశాస్త్రం 1905 లో తంజావూర్ వద్ద దొరికింది. దీన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఆర్.శ్యామశాస్త్రి
3) అర్థశాస్త్రం అనే గ్రంథంలో 15 అధికరణలు, 180 ప్రకరణలు ఉన్నాయి.
4) మౌర్యులు కాలంలోని ధర్మస్త్రేయ అనే పౌర న్యాయస్థానం, కంఠక శోధన అనే క్రిమినల్ న్యాయస్థానాల గురించి దీనిలో ఉంది.
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2, 3 మరియు 4
సి) 1, 2 మరియు 4
డి) 1, 3 మరియు 4
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
6) ఇండికా గ్రంథానికి సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి ?
1) గ్రీకు దేశానికి చెందిన సెల్యూకస్ నికేటర్ రాయబారి అయిన మెగస్తనీస్ ఈ గ్రంథాన్ని రచించారు.
2) ప్రస్తుతం ఈ గ్రంథం అందుబాటులో లేదు.
3) ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి సైనిక వ్యవస్థ గురించి ఉంది.
4) మెగస్తనీస్ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు.
ఎ) 1, 2, 3 మరియు 4
బి) 1 మరియు 3
సి) 1, 3 మరియు 4
డి) 1, 2 మరియు 4
జవాబు : ఎ) 1, 2, 3 మరియు 4
7) జునాఘడ్ శాసనం ఎవరు వేయించారు ?
ఎ) అశోకుడు
బి) చంద్రగుప్త మౌర్యుడు
సి) రుద్రదమనుడు
డి) బిందుసారుడు
జవాబు : సి) రుద్రదమనుడు
8) చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్ నికేటర్‌తో జరిగిన యుద్దంతో సంబంధం లేనిది ?
ఎ) వీరి మధ్య క్రీ.పూ 305లో యుద్దం జరిగింది.
బి) వీరి మధ్య క్రీ.పూ 303లో సంధి జరిగింది.
సి) సెల్యూకస్ నికేటర్ రాయబారిగా మెగస్తనీస్ పాటలీపుత్రంలో చాలాకాలం ఉన్నారు.
డి) చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్‌కు 5000 ఏనుగులు ఇచ్చాడు
జవాబు : డి) చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్‌కు 5000 ఏనుగులు ఇచ్చాడు
9) సంగమ సాహిత్యం అంటే ఏమిటీ ?
ఎ) చోళ సాహిత్యం
బి) పాండ్య సాహిత్యం
సి) చేర సాహిత్యం
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
10) బిందుసారుడి గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) బిందుసారుడిని అమిత్రఘాత అంటారు
2) బిందుసారుడు అజీవక మతం ఆచరించాడు.
3) ఆయనకు సిరియా రాజు ఒకటో యాంటి యోకస్‌తో సంబంధాలు ఉన్నాయి.
4) సిరియా రాజు రాయబారి డైమోకస్ మౌర్యుల ఆస్థానంలో ఉండేవాడు.
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 2, 3 మరియు 4
సి) 2 మరియు 3
డి) ఏదీకాదు
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
11) బిందుసారుడి కాలంలో అతడి ఆస్థానంలో ఉన్న సిరియా రాయబారి ఎవరు ?
ఎ) స్ట్రాబో
బి) హెరిడోటస్
సి) డైమోకస్
డి) ప్లీనీ
జవాబు : సి) డైమోకస్
12) బిందుసారుడి కాలంలో తక్షశిల వద్ద జరిగిన తీరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన యువరాజు ఎవరు ?
ఎ) సుశిమా
బి) మహేంద్ర
సి) అశోకుడి
డి) బృమద్రదుడు
జవాబు : అశోకుడ
13) కిందివాటిలో అశోకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి ?
1) అశోకుడి పేరును శాసనాల్లో దేవానాంప్రియ, ప్రియదర్శి అని పేర్కొన్నారు.
2) ఈయన పేరుతో ఉన్న శాసనం కర్ణాటకలోని మస్కి వద్ద ఉన్నాయి.
3) టిబెట్ చరిత్రకారుడు తారానాథ్ ప్రకారం అశోకుడు ఒక వైశ్య స్త్రీకి జన్మించాడు.
4) అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం
ఎ) 1 మరియు 4
బి) 1, 2, 3 మరియు 4
సి) 2, 3 మరియు డి
డి) 1, 2 మరియు 3
జవాబు : బి) 1, 2, 3 మరియు
14) చార్లెమెన్, కాన్‌స్టాంటన్ గురించి తెలిసిన వారి కంటే అశోకుడి గురించి తెలిసిన వారే ఎక్కువ అని ఎవరు అన్నారు ?
ఎ) ప్లీనీ
బి) హెచ్.జి వెల్స్
సి) టాలమీ
డి) ప్లూటార్క్
జవాబు : సి) టాలమీ
15) కిందివాటిలో కళింగ యుద్దానికి సంబంధించి సరైనవి గుర్తించండి ?
1) కళింగ అంటే నేటి ఒడిశా ప్రాంతం
2) 13వ శిలాశాసనం ఈ యుద్ధం గురించి తెలుపుతుంది
3) అశోకుడు రాజైన ఎనిమిదేళ్లకు ఈ యుద్దం చేశాడు.
4) కళింగ యుద్దంలో మృతులు 1,00,000 మందికి కాగా బంధీలైనవారు 1,50,000 మంది.
ఎ) 1 మరియు 4
బి) 1, 2, 3 మరియు 4
సి) 2, 3 మరియు డి
డి) 1, 2 మరియు 3
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
16) అశోకుడి ధర్మ సుత్రాల్లో లేనిది ఏది ?
ఎ) తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి
బి) పెద్దలను గౌరవించాలి
సి) ఇతర మతాలను దూషించరాదు
డి) విగ్రహారాధన చేయవచ్చు
జవాబు : డి) విగ్రహారాధన చేయవచ్చు
17) ధర్మ ప్రచారం, శాసనాల్లోని అంశాలను వినిపించడానికి అశోకుడు ఎవరిని నియమించుకున్నాడు ?
ఎ) అమాత్యులు
బి) ధర్మాధ్యక్షులు
సి) ధర్మమహామాత్రులు
డి) పైవారందరూ
జవాబు : సి) ధర్మమహామాత్రులు
18) అశోకుడికి సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది ?
ఎ) కళింగ యుద్దం తర్వాత అశోకుడు బౌద్ధమతం స్వీకరించాడు.
బి) ఆయన బౌధ్ధమతాన్ని ఈజిప్టు, శ్రీలంక, గ్రీసు, సిరియా దేశాల్లో వ్యాప్తి చేశాడు.
సి) అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధమత సన్యాసి ఆచార్య నాగార్జునుడు
డి) అశోకుడి తరపున బౌద్ధమత ప్రచారం చేసిన వారు మహేంద్ర, సంఘమిత్ర
జవాబు : సి) అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధమత సన్యాసి ఆచార్య నాగార్జునుడు
19) అశోకుడి ఏ శాసనాలు సంగమ యుగం గురించి వివరిస్తాయి ?
ఎ) 2 మరియు 13
బి) 2 మరియు 14
సి) 1 మరియు 6
డి) 7 మరియు 8
జవాబు : ఎ) 2 మరియు 138
20) మౌర్యుల తర్వాత మగధలో స్థాపించిన రాజవంశం, స్థాపకుడు ?
ఎ) కాణ్వా - సుశర్మ
బి) శుంగ - పుష్యమిత్ర
సి) పుష్యభూతి - హర్షవర్ధన
డి) గుప్త - గుప్తుడు
జవాబు : బి) శుంగ - పుష్యమిత్
21) మగధలో గ్రామాల వర్గీకరణను జతపరచండి ?
1) సీత
2) ఆయుధేయ
3) పరిహారిక
4) కుప్య
ఎ) సైనికులను పంపించే గ్రామాలు
బి) రాజుకు, ప్రభుత్వానికి చెందిన భూములున్న గ్రామం
సి) పన్ను మినహాయింపు ఇచ్చిన గ్రామాలు
డి) ముడి పదార్థాలను సరఫరా చేసే గ్రామాలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
జవాబు : డి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
22) మగధ సామ్రాజ్య పరిపాలనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) మగధకు ప్రధాన రాజధాని పాటలీపుత్రం
2) పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిపాలించేవాడు.
3) మగధలో నాలుగు ప్రాదేశిక రాజధానులున్నాయి అవి తక్షశిల, తోసలి, సువర్ణగిరి, ఉజ్జయిని.
4) ప్రాదేశిక రాజధానులను పరిపాలించేవారు సామంతులు
ఎ) 1, 2 మరియు 3
బి) 4 మాత్రమే
సి) 2 మరియు 4
డి) 1 మరియు 4
జవాబు : బి) 4 మాత్రమే
23) అశోకుడి ఏ శిలాశాసనం బోస్రో ` ఫెడాన్ పద్దతిలో వ్రాసి ఉంది ?
ఎ) ఎర్రగుడి మైనర్ రాక్ ఈడిక్ట్
బి) లంపక రాక్ ఈడిక్ట్
సి) షాబజోగిరి రాక్ ఈడిక్ట్
డి) మాన్‌షేరా రాక్ ఈడిక్ట్
జవాబు : ఎ) ఎర్రగుడి మైనర్ రాక్ ఈడిక్ట్
24) మెగస్తనీస్ తన గ్రంథంలో తెలియజేసిన పెద్దరాచబాట ఏ ప్రాంతాలను కలుపుతుంది ?
ఎ) ఇండస్ - పాటలీపుత్రం
బి) పాటలీపుత్రం - ప్రయాగ
సి) ప్రయాగ - ఉజ్జయిని
డి) పాటలీపుత్రం - తక్షశీల
జవాబు : డి) పాటలీపుత్రం - తక్షశీల
25) మౌర్యుల కాలంలో రాజు గుత్తాధిపత్యం కింద లేని అంశం ఏది ?
ఎ) గనులు, అడవులు
బి) చేపల పరిశ్రమ
సి) మద్యం, జలరవాణా
డి) వధశాలలు, జూద గృహాలు
జవాబు : డి) వధశాలలు, జూద గృహాలు
0 Comments