మహాత్మగాంధీ జీవిత చరిత్ర
about mahatma gandhi in telugu 10 points || about mahatma gandhi in telugu || General Knowledge in Telugu
మహాత్మగాంధీ పూర్తి పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. బ్రిటీషు వారి పరిపాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి కృషి చేసిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు మహాత్మగాంధీని ‘మహాత్మ’ ‘జాతిపిత’ అని కీర్తిస్తారు. మహాత్మగాంధీ సత్యము, అహింస అనే సిద్దాంతాలను పాటిస్తాడు. భారతదేశంలో బ్రిటిషు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జాతీయవాద ఉద్యమానికి నాయకుడిగా నిలిచాడు.
➠ కుటుంబం :
మహాత్మగాంధీ 02 అక్టోబర్ 1869న గుజరాత్ రాష్ట్రంలో పోర్‌బందర్‌లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పేరు పుతలీబాయి. గాంధీజీకి 13 ఏండ్ల వయస్సులో కస్తూరిబాయి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ అనే నలుగురు కుమారులున్నారు.
➠ విద్యాభ్యాసం :
గాంధీజీ పోరుబందర్, రాజ్‌కోట్‌లలో విద్యనభ్యసించాడు. 19 సంవత్సరాల వయస్సులో న్యాయశాస్త్రం చదవడానికి 1988 సంవత్సరంలో ఇంగ్లండ్ వెళ్లాడు. గాంధీజి దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాల పాటు ఉన్నాడు. అక్కడ భారతీయులపై జరిగిన జాతి వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాంధీజి పాటించిన సత్యం మరియు అహింస పద్దతులు చాలామందిని ప్రభావితం చేసింది. 1983 సంవత్సరంలో న్యాయవాదిగా పనిచేయడానికి దక్షిణాఫ్రికా వెళ్లాడు. రైలులోని ఫస్ట్‌క్లాస్ అపార్ట్‌మెంట్ తెల్లవారి కోసం మాత్రమే రిజర్వ్ చేయబడినది. భారతీయులు, నల్లజాతీయులకు ప్రవేశం లేనందున గాంధీజీని రైలునుండి నెట్టివేయడం జరిగింది.
➠ స్వాతంత్రోద్యమం :
1914లో గాంధీజీ భారత్ తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారి చెరలో ఉంది. గాంధీజీ స్వరాజ్యం పేరుతో భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం ప్రారంభించాడు. గాంధీజీ తన జీవితాన్ని స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసి 1921 సంవత్సరంలో నేషనల్ కాంగ్రెస్ నాయకుడయ్యాడు. 1930 సంవత్సరంలో ఉప్పుపై పన్ను విధింపుకు వ్యతిరేకంగా గాంధీజీ 400 కిలోమీటర్ల దండిమార్చ్ నిర్వహించాడు. ప్రజల్లో స్వాంతంత్ర కాంక్షను పునరుద్దరించాడు. 1918లో బీహార్ మరియు గుజారాత్‌లోని చంపారన్ మరియు ఖేడా ఆందోళనలకు నాయకత్వం వహించాడు. బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం, శాసల్లోంఘన ఉద్యమం, స్వరాజ్ మరియు క్విట్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు.
➠ గాంధీ హత్య :
మహాత్మగాంధీని 1948 జనవరి 30 రోజున ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థన సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే చేసిన కాల్పులలో మరణించాడు. అతను మరణించే సమయంలో ‘హే రామ్’ అంటూ నేలకొరిగాడు. గాంధీ సమాధి ఢిల్లీలోని రాజ్‌ఘట్ వద్ద నిర్మించారు.
మహాత్మగాంధీ జీవిత చరిత్ర | |
---|---|
పూర్తి పేరు | మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ |
జననం | 02 అక్టోబర్ 1869 |
పుట్టిన స్థలం | పోర్‌బందర్, గుజరాత్ రాష్ట్రం |
తండ్రి పేరు | కరంచంద్ గాంధీ |
తల్లి పేరు | పుత్లిబాయి గాంధీ |
భార్య పేరు | కస్తూర్భాగాంధీ |
పిల్లలు | హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రాందాస్ గాంధీ, దేవదాస్ గాంధీ |
వృత్తి | న్యాయవాది, రాజకీయవేత్త, కార్యకర్త, రచయిత |
మరణం | 30 జనవరి 1948 |
మరణానికి కారణం | తుపాకీతో కాల్చి చంపడం |
0 Comments