About Ganga River in Telugu || గంగా నది || Indian Geography in Telugu || General Knowledge in Telugu

About Ganga River in Telugu ||  గంగా నది || Gk in Telugu

 గంగా నది 
Ganga River in Telugu || General Knowledge in Telugu


గంగానది :

భారతదేశం నదులకు పెట్టింది పేరు. భారతదేశంలో అధిక వ్యవసాయం నదుల యొక్క నీటిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని ప్రధాన నదులపై నిర్మించిన ప్రాజేక్టులు, రిజర్వాయర్‌లతో సాగు, త్రాగునీటితో పాటు విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. భారతదేశంలో అధిక శాతం నదులు తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. భారతదేశంలో అనేక నదులున్నాయి. వీటిలో ఎక్కువ నదులు నీటిపారుదల, జలవిద్యుత్‌ అవసరాల కొరకు వాడుతున్నారు. భారతదేశంలో గంగా నది, బ్రహ్మపుత్ర నది, గోదావరి నది, కృష్ణనది, కావేరి నది, పెన్నానది, సింధూనది, నర్మదానది, తపతి నది, సబర్మతి నదులున్నాయి. వీటిలో ముఖ్యమైన నది గంగా నది. గంగా నదిపై నిర్మించిన అనేక ప్రాజేక్టులు ప్రజల త్రాగునీటితో పాటు, వ్యవసాయ రంగానికి అవసరమైన సాగునీటిని అందిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజేక్టులపై చేపట్టిన జలవిద్యుత్‌ ప్రాజేక్టుల ద్వారా విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అనేక ప్రాజేక్టులు వర్షాకాలంలో నీటిని నిల్వ చేసి వాటిని వ్యవసాయ, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. 


    గంగానది భారతదేశంలో ప్రవహించే అన్ని నదుల్లోకెల్లా అతిపెద్ద నది. ఇది తూర్పు దిశకు ప్రవహించే నది.ఈ గంగానదిని బంగ్లాదేశ్‌ దేశంలో ‘పద్మ’ నది అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అన్ని నదులలకెల్లా పొడవైన నది. ఇది అలకనంద, భగీరథ నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. అలక్‌నంద నది దేవప్రయాగ వద్ద భగీరథతో కలిసిన తర్వాత గంగానదిగా పిలుస్తారు. హిమాలయాల పర్వతాల్లోని నందాదేవి త్రిశూల్‌, శిఖరాల వద్ద మంచు కరిగి అలకనంద నదిగా మారుతుంది. గంగోత్రి వద్ద భగీరథ నది ఏర్పడుతుంది. గంగానదికి రామ్‌గంగా, గండక్‌, కోసి, సోన్‌, దామోదర్‌ అనే ఉపనదులున్నాయి. ఈ గంగానది భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాంచల్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ మీదుగా మొత్తం 2525 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. భగీరథ నదిపై తెహ్రీ ప్రాజేక్టు నిర్మించడం జరిగింది. గంగానది పరక్క వద్ద బంగ్లాదేశ్‌లో ప్రవేశిస్తుంది. గంగానది యమున, సరస్వతి నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పరుస్తుంది. ఈ నదిని భారతదేశంలోని హిందువులు పవిత్రమైన నదిగా పూజిస్తారు. పురాతకాలం నుండి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగాజలాన్ని వినియో గిస్తారు. జనన మరణాల సమయాల్లో గంగా జలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనేది ప్రజల నమ్మకం. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధిలో ఉంచి పవిత్రంగా పూజిస్తారు. ప్రతి పండగ రోజున పుణ్యస్నానాలు చేసి గంగాదేవికి నమస్కరిస్తారు. గంగానది భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌లో కూడా ప్రవహిస్తుంది. గంగానది యొక్క మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు కాగా భారతదేశంలో 2415 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది దేశ వైశాల్యంలో 4వవంతు విస్తిర్ణంతో అతిఎక్కువ నదీపరివాహక ప్రాంతం కల్గిన నదిగా గుర్తింపు సాధించింది.గంగానది తీరాన జరిగే కుంభమేళలో లక్షలాది మంది ప్రజలు పుణ్యస్నానాలను ఆచరిస్తారు.  

    గంగా పరీవాహక ప్రాంతం ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కల్గిన వ్యవసాయ ప్రాంతాలలో ఒకటి. భారతదేశంలోని 11 రాష్ట్రాలలో 8,60,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న గంగా పరీవాహక ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల్గిన నదీ పరీవాహక ప్రాంతం. గంగా నది యొక్క 75 శాతం పరీవాహక ప్రాంతం భారతదేశంలోనే కలదు. గంగా నదీ నీటిపారుదల, త్రాగునీరు మరియు పారిశ్రామిక అవసరాల కోసం ఒక ముఖ్యమైన నీటివనరుగా పనిచేస్తుంది. అలాగే అనేక రకాల వృక్ష మరియు జంతు జాలానికి నిలయంగా ఉంది. గంగా, బ్రహ్మపుత్ర మరియు మేఘన లేదా సుందర్బన్‌ డెల్టా ఈ మూడు ముఖ్యమైన నదీవ్యవస్థల సంగమం ద్వారా ఏర్పడిన భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లోని ఒక ప్రాంతం. 

➺ గంగానదీ పరివాహక ప్రాంతం కల్గిన రాష్ట్రాలు :

  • ఉత్తరాఖండ్‌ 
  • హిమాచల్‌ ప్రదేశ్‌ 
  • హర్యానా 
  • ఉత్తరప్రదేశ్‌ 
  • మధ్యప్రదేశ్‌ 
  • రాజస్థాన్‌ 
  • ఛత్తీస్‌ఘడ్‌ 
  • జార్ఘండ్‌ 
  • బీహార్‌ 
  • పశ్చిమబెంగాల్‌ 
  • ఢిల్లీ 

➺ ఉపనదులు :

గంగానదికి ఎడమవైపు రామ్‌గంగా, గోమతి, ఘగ్ర, గండక్‌, కోసి ఉపనదులు ఉన్నాయి. కుడివైపున యమున, చంబల్‌, సోన్‌, బెట్వా, కెన్‌, దామోదర్‌, టాన్స్‌ ఉపనదులు ఉన్నాయి. గంగానదికి అతిపెద్ద ఉప నది యమునా నది. 

➺ పవిత్రత :

హిందువులు గంగానదిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఒక్కసారి గంగానదిలో స్నానం చేస్తే జన్మజన్మల ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. మరణించే ముందు గంగా జలం త్రాగితే స్వర్గప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. మరణించిన వారి యొక్క ఆస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దేశ నలుమూలల నుండి వారాణాసికి వస్తారు. గంగానది జలాన్ని ఇంట్లో ఉంచుకోవడం పవిత్రంగా భావిస్తారు. చాలామంది హిందువులు గంగానది వెంబడి నెలవై ఉన్న పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలకు వెళతారు. 

➺ గంగానదిపై నిర్మించిన ప్రాజేక్టులు :

తెహ్రీ డ్యాం దీనిని గంగానదికి ఉపనది అయిన భగీరథ నదిపై నిర్మించబడిరది. బన్‌సాగర్‌ డ్యామ్‌ నీటిపారుదల మరియు జలవిద్యుత్‌ ఉత్పత్తి కొరకు గంగానది ఉపనది అయిన సోన్‌ నదిపై నిర్మించారు. రామ్‌గంగా ప్రాజేక్టును గంగా నది ఉపనది అయిన రామ్‌గంగా నదిపై నిర్మించారు.


Related Posts 

1) India River System in Telugu

2) Godavari River in Telugu 

3) Krishna River in Telugu

4) Telangana River system in Telugu


Post a Comment

0 Comments