Solar system in Telugu planets, order and formation || సోలార్ సిస్టమ్ : గ్రహాలు మరియు ఉపగ్రహాలు || General Science in Telugu

సోలార్ సిస్టమ్ : గ్రహాలు మరియు ఉపగ్రహాలు

 సమస్త జీవరాశికి ప్రాణధారమై, నిత్య ఉషోదయంతో అందరనీ నిద్రలేపే సూర్యుడు ఒక నక్షత్రం. ఈ సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు వంటి అనే ఖగోళ స్వరూపాలు విస్తరించి ఉంటాయి. సూర్యుడితో కలిపి అదంతా అనంత విశ్వంలో ఒక కుటుంబంగా పిలుస్తారు. సూర్యకుటుంబంలో భాగమే భూమి గ్రహం. సూర్యుడు కేంద్రస్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ధూళిరేణువులను కలిపి సౌరకుంటుంబం అంటారు. 

➺ సూర్యుడు :

సూర్యుడు ఒక కేంద్ర స్థాయిలో ఉండే పెద్ద నక్షత్రం. స్వయంప్రకాశవంతమైన నక్షత్రం. సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుని యొక్క వయస్సు చెప్పాలంటే దాదాపు 550 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. సూర్యున్ని భూమితో పోల్చినప్పుడు భూమి పరిమాణం కంటే స్యూర్యుడు దాదాపు 13 లక్షల రెట్లు ఎక్కువగా ఉంటాడు. సూర్యుడు తన చుట్టు తాను పరిభ్రమించడానికి 25 రోజుల సమయం పడుతుంది. సూర్యుడు పాలపుంత కేంద్రకం చుట్టూ ఒకసారి తిరగడానికి దాదాపు 25 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. దీనికి ‘కాస్మిక్‌ సంవత్సరం’గా పిలుస్తారు. భూమికి సూర్యునికి మధ్య దూరం 14.95 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. 

➺ గ్రహాలు రకాలు 

భూమి యొక్క కక్ష్యను ఆధారంగా చేసుకొని గ్రహాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 

1) నిమ్నత గ్రహాలు 

  • బుధుడు
  • శుక్రుడు 

ఈ గ్రహాలు భూమి యొక్క కక్ష్యకు లోపల, సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. 


2) ఉన్నత గ్రహాలు 

  • అంగారకుడు
  • బృహస్పతి 
  • శని, 
  • ఇంద్రుడు 

భౌతిక రసాయన ధర్మాలనుగుణంగా గ్రహాలను రెండు విధాలుగా పేర్కొనవచ్చు. 

1) అంతర / భౌమ / టెరెస్ట్రియల్‌ గ్రహాలు 

ఇవి పరిమాణంలో చిన్నవిగా, శిలా నిర్మితాలు, అధిక సాంధ్రత, ఉష్టోగ్రతలతో ఉంటాయి. 

ఉదా ॥ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు 


2) బాహ్య / జోవియస్‌ గ్రహాలు 

ఇవి హైడ్రోజన్‌ లాంటి అనేక వాయువులు ధ్రవీభవించడంతో ఏర్పడ్డాయి. తక్కువ సాంద్రత, ఉష్ణోగ్రలతో ఉంటాయి. 

ఉదా ॥ బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు 

పరిమాణాన్ని బట్టి అవరోహణ క్రమంలో గ్రహాలు 

  • బృహస్పతి 
  • శని 
  • యురేనస్‌ 
  • నెప్ల్యూన్‌ 
  • భూమి 
  • శుక్రుడు 
  • అంగారకుడు 
  • బుధుడు 

సౌరకుటుంబంలో తూర్పు నుండి పడమరకు (ఎడమ నుండి కుడికి సవ్యదిశలో భ్రమణం చేసే గ్రహాలు)

  • శుక్రుడు, వరుణుడు 
గ్రాహలను కనుగొన్నవారు 
  • శని - గెలిలియో 
  • వరుణుడు - విలియం హెర్షెల్‌ 
  • ఇంద్రుడు - జోహాన్‌ గల్‌, ఆడమ్స్‌లి వెర్రియర్‌ 
  • ప్లూటో - క్లయిడ్‌ టామ్‌ బాగ్‌, పెర్సివాల్‌ లోవెల్‌ 

సౌర కుటుంబంలో బుధ గ్రహం నుండి నెప్ట్యూన్‌ వైపు వెళ్లే కొద్ది గ్రహాల కక్ష్య పరిమాణాలు పెరుడుతూ వాటి కోణీయ వేగాలు తగ్గుతాయి. 

➺ సూర్యుని నుంచి దూరాన్ని బట్టి చూస్తే గ్రహాల వరుస క్రమం 

  • బుధుడు (మెర్యూరి)
  • శుక్రుడు (వీనస్‌)
  • భూమి (ఎర్త్‌)
  • అంగారకుడు / కుజుడు (మార్స్‌)
  • బృహస్పతి / గురుడు (జుపిటర్‌)
  • శని (సాటర్న్‌) 
  • వరుణుడు (యురేనస్‌)
  • ఇంద్రుడు (నెప్ట్యూన్‌) 

Post a Comment

0 Comments