constitution of india in telugu : Fundamental Rights GK questions in Telugu Part - 2 || Gk Questions with Answers || Gk Questions in telugu

Indian Constitution : Fundamental Rights GK questions in Telugu Part -

ప్రాథమిక హక్కులు - 2 జికే క్వశ్చన్స్‌ : జికె ప్రశ్నలు - జవాబులు

Fundamental Rights GK questions in Telugu Part - 2 

Gk Questions in Telugu || Gk Questions and Answers || Gk questions in Telugu with Answers || Gk Bits in Telugu

    Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.


1. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను తాత్కాలికంగా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ?
ఎ) ఎ.డి.ఎం జబల్‌ పూర్‌ - శుక్లా కేసు 1976
బి) జగ్జీత్‌ సింగ్‌ - యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 1965
సి) ఎస్‌.ఆర్‌ బొమ్మై - యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 1994
డి) ఇస్మాయిల్‌ ఫరూకీ - యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 1994

జవాబు : ఎ) ఎ.ండి.ఎం జబల్‌ పూర్‌ - శుక్లా కేసు 1976

2) ఒక ప్రభుత్వ అధికారిని ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమని పిలుస్తారు ?
ఎ) హెబియస్‌ కార్పస్‌
బి) సెర్షియోరరీ
సి) మాండమస్‌
డి) కోవారంటో ‌

జవాబు : సి) మాండమస్

3) మాండమస్‌ రిట్‌ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయడానికి వీల్లేదు ?
ఎ) ప్రైవేటు వ్యక్తులు
బి) రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్‌లు
సి) విచక్షణతో కూడిన విధుల విషయంలో
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

4) మాండమస్‌ రిట్‌ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు ?
ఎ) కార్పోరేషన్‌
బి) ట్రైబ్యునళ్లు
సి) ప్రభుత్వ అధికారి
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

5) మాండమస్‌ రిట్‌కు సంబంధించి సరైంది ?
1) ఈ రిట్‌ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు.
2) దీన్ని జారీ చేయడమనేది కోర్టుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
3) ప్రభుత్వ అధికారులు వారు నిర్వర్తించే విధుల్లో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన వాటికి మాత్రమే ఈ రిట్‌ను జారీ చేస్తారు.
4) దీని స్వభాగం డైరెక్ట్స్‌ యాక్టివ్‌
ఎ) 1, 3, 4
బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3
డి) 1, 2, 4

జవాబు : బి) 1, 2, 3, 4

6) దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌ను ఏమంటారు ?
ఎ) ప్రొహిబిషన్‌
బి) సెర్షియోరరీ
సి) కోవారంటో
డి) మాండమస్‌

జవాబు : ఎ) ప్రొహిబిషన్‌

7) ప్రొహిబిషన్‌ రిట్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది ?
1) దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించుకుండా నియంత్రించడమే ఈ రిట్‌ ఉద్దేశ్యం
2) దీన్ని న్యాయసంస్థలపై జారీ చేస్తారు.
3) ఈ రిట్‌ స్వభావం ఇన్‌యాక్టివ్‌
4) ప్రొహిబిషన్‌ అంటే ప్రతి పేద / నిలుపుదల అని అర్థం
ఎ) 1, 2, 4
బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4
డి) 1, 3, 4

జవాబు : సి) 1, 2, 3, 4

8) సెర్షయోరరీ రిట్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది ?
1) దిగువ న్యాయస్థానం నిలిపివేసిన విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్కా న్యాయస్థానానికి లేదా పక్కా న్యాయస్థానానికి బదిలీ చేయమని జారీ చేసే ఆదేశం.
2) సెర్షియోరరీ అంటే ధృవీకరించడం అని అర్థం
3) దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించడమే ప్రధాన లక్ష్యం.
4) ఈ రిట్‌ను శాసన సంస్థలపై కూడా జారీ చేయవచ్చు.
ఎ) 1, 2, 3
బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4
డి) 1, 2, 4

జవాబు : ఎ) 1, 2, 3

9) సెర్షియోరరీ రిట్‌ను వేటిపై జారీ చేయడానికి వీల్లేదు ?
ఎ) న్యాయపరమైన సంస్థలు
బి) అర్థన్యాయ సంస్థలు
సి) ప్రైవేటు సంస్థలు
డి) పరిపాలనాపరమైన సంస్థలు

జవాబు : సి) ప్రైవేటు సంస్థలు

Also Read : Gk in Telugu

10) ఏ సంవత్సరం తర్వాత నుండి సెర్షియోరరీ రిట్‌ను అడ్మినిస్ట్రేటీవ్‌ అథారిటీస్‌పై జారీ చేస్తున్నారు ?
1) 1991
2) 1987
3) 1981
4) 1976

జవాబు : 1) 1991

11) న్యాయస్థానాలు, న్యాయస్థానాలపైనే జారీ చేసే రిట్స్‌ ఏది ?
ఎ) హెబియస్‌ కార్పస్‌, సెర్షియోరరీ
బి) మాండమస్‌, ప్రొహిబిషన్‌
సి) కోవారంటో, సెర్షియోరరీ
డి) ప్రొహిబిషన్‌, సెర్షియోరరీ

జవాబు : డి) ప్రొహిబిషన్‌, సెర్షియోరరీ

12) చట్టబద్దమైన అధికారం లేకుండా ఎవరైనా వ్యక్తి అధికారాన్ని చేలాయిస్తుంటే ‘ నీవు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నావు ’ అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం జారీ చేసే రిట్‌ను ఏమంటారు ?
ఎ) మాండమస్‌
బి) కోవారంటో
సి) ప్రొహిబిషన్‌
డి) హెబియస్‌ కార్పస్‌

జవాబు : బి) కోవారంటో


Also Read :

13) ఆస్తికి సంబంధించిన వివాదాల్లో యథాస్థితిని అమలు చేయడానికి న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారు ?
ఎ) ఇంజంక్షన్‌
బి) జురిస్‌ప్రుడెన్స్‌
సి) ప్రిమెంటీవ్‌
డి) ఫోర్బిడ్‌

జవాబు : ఎ) ఇంజంక్షన్‌

14) కింద పేర్కొన్న అంశాలలో సరైన దానిని గుర్తించండి ?
1) సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే రిట్స్‌ జారీ చేస్తుంది
2) హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే కాకుండా, ఇతర చట్టబధ్ద హక్కుల రక్షణకు కూడా రిట్స్‌ జారీ చేస్తుంది.
3) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు రిట్స్‌ జారీ చేస్తుంది.
4) రిట్స్‌కు సంబంధించిన పదాలన్నీ గ్రీకు భాషా పదాలే.
ఎ) 1, 2, 3, 4
బి) 1, 3, 4
సి) 1, 2, 3
డి) 1, 2, 4

జవాబు : 3) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు రిట్స్‌ జారీ చేస్తుంది.

15) ఆర్టికల్‌ 33 ప్రకారం ఎవరి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ భారత పార్లమెంటు చట్టాలను రూపొందించగలదు ?
1) ఆర్టికల్‌ 33(ఎ) ప్రకారం కేంద్ర బలగాల్లో పనిచేసేవారికి
2) ఆర్టికల్‌ 33(బి) ప్రకారం శాంతిభద్రతల రక్షణ కోసం వినియోగించే దళాలకు
3) ఆర్టికల్‌ 33(సి) ప్రకారం రహస్య గూఢచార సంస్థల్లో పనిచేసేవారికి
4) ఆర్టికల్‌ 33(డి) ప్రకారం రక్షణకు సంబంధించి కమ్యూనికేషన్‌ రంగంలో పనిచేసేవారికి
ఎ) 1, 2, 3
బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4
డి) 1, 2, 4

జవాబు : బి) 1, 2, 3, 4

16) ఈ క్రింది వానిలో భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది ఏది ?
ఎ) ది ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ యాక్ట్‌ 1951
బి) ది నేవీ ఫోర్స్‌ యాక్ట్‌ 1950
సి) ది పోలీస్‌ ఫోర్స్‌ యాక్ట్‌ 1966
డి) ది ఎయిర్‌ఫోర్స్‌ యాక్ట్‌ 1950

జవాబు : ఎ) ది ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ యాక్ట్‌ 1951

17) కిందివాటిలో భారత పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది ఏది ?
ఎ) నేషనల్‌ ఇన్వేస్టిగేషన్‌ ఏజేన్సీ యాక్ట్‌ 2008
బి) ది ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ యాక్ట్‌ 1950
సి) మోటారు వాహనాల చట్టం 1991
డి) పర్యావరణ పరిరక్షణ చట్టం 1986

జవాబు : సి) మోటారు వాహనాల చట్టం 1991

18) సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితుల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది ?
ఎ) ఆర్టికల్‌ 33
బి) ఆర్టికల్‌ 34
సి) ఆర్టికల్‌ 35
డి) ఆర్టికల్‌ 35(ఎ)

జవాబు : బి) ఆర్టికల్‌ 34

19) ప్రాథమిక హక్కులకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి ?
1) ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి కావు అంటే అపరిమితమైనవి కావు
2) ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణను కల్గి ఉంటాయి.
3) ప్రాథమిక హక్కులన్నీ సార్వత్రికమైనవి.
4) ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించగలదు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 1, 2, 4
డి) 1, 3, 4

జవాబు : సి) 1, 2, 4

Also Read : Latest Jobs in Telugu

20) ప్రాథమిక హక్కులకు సంబంధించి కిందివాటిలో సరైంది ?
ఎ) భారత్‌లో ఉండే విదేశీయులకు ఆర్టికల్‌ 15, 16, 19, 29, 30 లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వర్తించవు.
బి) ఆర్టికల్‌ 14, 15, 16, 20, 21 లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి (నెగెటివ్‌)
సి) ఆర్టికల్‌ 17, 23, 24 లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి (పాజిటివ్‌)
డి) ప్రాథమిక హక్కులన్నీ సాంప్రదాయకమైనవి.

జవాబు : ఎ) భారత్‌లో ఉండే విదేశీయులకు ఆర్టికల్‌ 15, 16, 19, 29, 30 లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వర్తించవు.

21) ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్రాలు రద్దవుతాయని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది ?
ఎ) ఆర్టికల్‌ 355
బి) ఆర్టికల్‌ 357
సి) ఆర్టికల్‌ 358
డి) ఆర్టికల్‌ 361

జవాబు : సి) ఆర్టికల్‌ 358

22) భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పటికీ ఆర్టికల్‌ 359 ప్రకారం ఏ ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కు రద్దు కాదు ?
ఎ) ఆర్టికల్‌ 20
బి) ఆర్టికల్‌ 21
సి) ఆర్టికల్‌ 22
డి) 1 మరియు 2

జవాబు : డి) 1 మరియు 2

23) కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది గుర్తించండి ?
ఎ) ఆర్టికల్‌ 358కి స్పూర్తినిచ్చిన దేశం జర్మనీ
బి) ఆర్టికల్‌ 359కి స్పూర్తినిచ్చిన దేశం జపాన్‌
సి) అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి 10 సవరణలను బిల్‌ ఆఫ్‌ రైట్స్‌గా పేర్కొంటారు
డి) అమెరికాలో బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ 1793, డిసెంబర్‌ 15 నుండి అమల్లోకి వచ్చింది.

జవాబు : డి) అమెరికాలో బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ 1793, డిసెంబర్‌ 15 నుండి అమల్లోకి వచ్చింది.


24) రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఒక చేతితో ఇచ్చి, మరొక చేతితో తీసుకుంది అని ఎవరు వ్యాఖ్యానించారు ?
ఎ) నార్మన్‌ డి.పామర్‌
బి) సోలీ జే.సోరాబ్జీ
సి) నానీపాల్కీవాలా
డి) అనంతశయనం అయ్యంగార్‌

జవాబు : ఎ) నార్మన్‌ డి.పామర్‌


 
Related Posts :

Post a Comment

0 Comments