
AAI Recruitment 2023 Notification
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో జాబ్స్
- 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు సువర్ణవకాశం
- 13 లక్షల వార్షిక జీతం
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది పౌర విమానయాన రంగంలో ప్రాధాన్యమైన సంస్థ. ఇది గ్రౌండ్, ఎయిర్ ట్రాఫిక్‌లకు సంబంధించి మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణ వంటి సేవలను అందిస్తుంది.
➼ మొత్తం పోస్టులు :
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ మొత్తం 496 పోస్టులు భర్తీ చేయనుండి ఇందులో
- ఎస్సీ (75)
- ఎస్టీ (33)
- ఓబీసీ (140)
- ఈడబ్ల్యూఎస్ (49)
- ఓపెన్ కెటగిరీ (199)
➼ విద్యార్హతలు :
- బీఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) / బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
- ఇంగ్లీష్‌లో చదవడం, రాయడం రావాలి.
- 10, 12వ తరగతిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
➼ వయస్సు :
- నవంబర్ 30, 2023 నాటికి గరిష్ఠ వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి.
(ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.)
➼ ఎంపిక విధానం :
- జూనియర్ ఎగ్జీక్యూటీవ్ పోస్టులకు వ్రాత పరీక్ష, మానసిక ధృడత్వం పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
➼ పరీక్షా విధానం :
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలుంటాయి. దీనిని రెండు గంటలలో పూర్తి చేయాలి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం నాలుగు సబ్జెక్టుంటాయి.
- ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ (35 మార్కులు)
- జనరల్ ఇంటెలిజెన్స్ / రీజనింగ్ (40 మార్కులు)
- క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ (40 మార్కులు)
- జనరల్ అవేర్‌నెస్ (35 మార్కులు)
ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్టు ద్వారా నిర్వహిస్తారు.
వ్రాత పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారికి వాయిస్ టెస్టు, సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్టులు నిర్వహిస్తారు.
➼ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➼ జీతభత్యాలు :
- 40,000 నుండి 1,40,000 ఉంటుంది.
➼ ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తులకు చివరి తేది.30 నవంబర్ 2023
- పరీక్ష తేది.జనవరి 2024
Online Apply
0 Comments