
తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు, సేవల ద్రవ్య విలువను రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) అంటారు. ప్రస్తుత ధరలు, స్థిరమైన ధరలలోనూ ఉత్పత్తి విలువను అంచనా వేస్తారు. ప్రస్తుత ధరలు అంటే ఏ సంవత్సరం కోసం ఉత్పత్తి విలువను అంచనా వేస్తున్నామో అదే ఏడాదిలో ఉండే ధరలు, ప్రస్తుత ధరల్లో అంచనా వేసినప్పుడు దానిని నామమాతప్రు ఆదాయం అంటారు. ఒక స్థిరమైన ధరలు అంటే గతంలోని ఒక సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని అప్పటి ధరల ఆధారంగా ఉత్పత్తి విలువను అంచనా వేస్తారు. ఆధార సంవత్సరం ధరల ఆధారంగా అంచనా వేసినప్పుడు దానిని వాస్తవిక ఆదాయం అంటారు.
➠ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి
ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 2022-23లో రూ॥13.27 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 15.6 శాతం వృద్దిని నమోదు చేసింది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి విలువ ప్రస్తుత ధరల ప్రకారం 2014-15 లో 4.1 శాతం ఉండగా 2022-23 నాటికి 4.9 శాతానికి పెరిగింది.
ఇక స్థిరమైన (2011-12) ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి విలువ 2022-23లో 7,26,670 కోట్లుగా ఉంది. స్థిరమైన ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 2022-23లో 7.4 శాతం వృద్దిని నమోదు చేసింది.
➠ స్థిరమైన ధరల్లో స్థూల నికర దేశీయోత్పత్తి
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదల (ఉత్పత్తి ప్రక్రియలో యంత్రాలు కోల్పోయే విలువ) విలువను తీసివేస్తే వచ్చేది రాష్ట్ర నికర దేశీయోత్పత్తి స్థిరమైన ధరల్లో తెలంగాణ రాష్ట్ర నికర దేశీయోత్పత్తి 2014-15 లో రూ॥3,74,897 కోట్లు ఉండగా 2022-23 నాటికి 6,45,163 కోట్లకు చేరింది.
➠ తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ?
రాష్ట్ర నికర దేశీయోత్పత్తిని రాష్ట్ర ప్రజల సంఖ్యతో భాగిస్తే వచ్చేది రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం అంటారు. ప్రస్తుత ధరల్లో 2014-15 లో రూ॥1,24,104 ఉండగా ముందస్తు అంచనాల ప్రకారం 2022-23లో రూ॥3,17,115కు చేరుకుంది. ప్రస్తుత ధరల్లో దేశ ప్రజల తలసరి ఆదాయం కంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 2014-15లో 1.43 రెట్లు ఉండగా 2022-23 సంవత్సరంలో 1,86కు చేరుకుంది.
ప్రస్తుల ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ ప్రజల తలసరి ఆదాయంలో వచ్చిన పెరుగుదల దేశ ప్రజల తలసరి ఆదాయంలో వచ్చిన పెరుగుదలతో పోలిస్తే వృద్దిని నమోదు చేసింది.
స్థిరమైన (2011-12) ప్రకారం ధరల్లో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 2014-15 లో రూ॥1,01,424 ఉండగా , 2022-23 నాటికి 1,69,784కు చేరుకుంది.
Related Post :
1) Telangana Socio Economic Survey
0 Comments