What is Digital Marketing in Telugu || డిజిటల్‌ మార్కెటింగ్‌ అంటే ఏమిటీ ? || Gk in Telugu

What is Digital Marketing in Telugu || డిజిటల్‌ మార్కెటింగ్‌ అంటే ఏమిటీ ? || Gk in Telugu

 డిజిటల్‌ మార్కెటింగ్‌ 

వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి చేసే ప్రతి మార్కెటింగ్‌ను "డిజిటల్‌ మార్కెటింగ్‌" అంటారు. 

డిజిటల్‌ మార్కెట్‌ను రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. 

  • ఆఫ్‌లైన్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ 
  • ఆన్‌లైన్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ 


ఆఫ్‌లైన్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ 

➺ రెడియో :

రెడియో మనం వినే వ్యాపార ప్రకటనలు, దాని ద్వారా చేసే ప్రచారాన్ని ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌ అంటారు.

 

➺ టివి :

మనం ప్రతి రోజు ఇంట్లో చూసే టివిలో సీరియల్‌, సినిమా, క్రికెట్‌ వంటి కార్యక్రమాలలో వచ్చే ప్రకటనలను ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌గా చెప్పవచ్చు. టివిలో వచ్చే ప్రకటనల తొందరగా ప్రజల్లోకి వెళుతుంటాయి. అందుకే అధిక శాతం వ్యాపార ప్రకటనలు మనం టివిలోనే చూస్తాము. 


➺ ఎల్‌ఈడీ డిజిటల్‌ బోర్డు :

వీటిని షాపింగ్‌ మాల్స్‌, సినిమాహాల్స్‌, జనసందోహ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలలో ఎల్‌ఈడీ డిజిటల్‌ బోర్టులను ఏర్పాటు చేసి వాటిని ద్వారా మార్కెటింగ్‌ చేస్తుంటారు. ఇటువంటి మార్కెటింగ్‌ విదేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. 


➺ ప్రోడక్ట్‌ డెమో సీడీలు :

గేమింగ్‌, సాప్ట్‌వేర్‌లకు సంబంధించిన సీడీలను రన్‌ చేసే సమయంలో వాటి ముందు కంపెనీకి సంబంధించిన యాడ్స్‌ వస్తుంటాయి. 


➺ మార్కెటింగ్‌ పరికరాలు :

వ్యాపార సముదాయాలు వారి యొక్క వస్తువులను ప్రచారం చేయడానికి వారి యొక్క దుకాణాల ఆవరణలో వివిధ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల ద్వారా యాడ్స్‌ వేస్తుంటారు. వీటిని ఆఫ్‌లైన్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌గా చెప్పవచ్చు. 


➺ ఫోన్‌ మార్కెటింగ్‌ :

వివిధ కంపెనీలకు చెందిన వారు మనకు ఫోన్‌ చేసి వారి యొక్క వ్యాపారం గురించి వివరించడం జరుగుతుంది. దీనిని ఫోన్‌ మార్కెటింగ్‌ 

➺ ఎస్‌ఎంఎస్‌ మార్కెటింగ్‌ :

ఇటువంటి మార్కెటింగ్‌లో ఫోన్‌ మెస్సెజ్‌ల ద్వారా  మార్కెటింగ్‌ చేస్తూంటారు. 


ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ 

ఇంటర్నేట్‌ను ఉపయోగించి వివిధ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల ద్వారా చేసే మార్కెటింగ్‌ను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అంటారు. 


➺ సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో) :

మనం ఒక వస్తువు / విషయం గురించి సెర్చ్‌ ఇంజన్‌లో వెతికినప్పుడు కొన్ని వేల సెర్చ్‌ రిజల్ట్స్‌ కనిపిస్తుంటాయి. ఇలా కొన్ని వేల సెర్చ్‌ రిజల్ట్స్‌లో ఒక కంపెనీ / సంస్థ / ఇతర యొక్క వెబ్‌సైట్‌ గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో మొదటి పేజీలో రావడానికి వివిధ పద్దతులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో కంపెనీ / సంస్థ / ఇతర వెబ్‌సైట్‌ మొదటి పేజీలో రావడానికి ఉపయోగించే పద్దతిని సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ అని పిలుస్తారు. 


➺ డిజిటల్‌ ప్రకటనలు :

వివిధ వెబ్‌సైట్‌లలో వివిధ కంపెనీల యొక్క యాడ్స్‌ రన్‌ అవుతుంటాయి. వీటిని డిజిటల్‌ ప్రకటనలు అంటారు. 


➺ సోషల్‌మీడియా మార్కెటింగ్‌ :

వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా (ఫేస్‌బుక్‌, ఎక్స్‌, లింక్‌డ్‌ఇన్‌, ఇస్టాగ్రాం మొ॥) మార్కెటింగ్‌ చేసే దానిని సోషల్‌మీడియా మార్కెటింగ్‌ అంటారు. 

➺ ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌ 
➺ స్మార్ట్‌ఫోన్‌ మార్కెటింగ్‌ 
➺ కంటెంట్‌ మార్కెటింగ్‌ 
➺ అఫిలియేట్‌ మార్కెటింగ్‌ 



Post a Comment

0 Comments