
రక్తం / నెత్తురు
మానవులు మరియు ఇతర జంతువులలో కణజాలాలకు అవసరమైన పోషకాలను మరియు ఆక్సీజన్ సరఫరా చేసే ధ్రవ పదార్థాన్ని రక్తం అంటారు. దైనందిన జీవక్రీయలో భాగంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కణజాలాల నుండి తీసుకుంటుంది. జీవుల మనుగడకు రక్తం అత్యవసరం.
రక్తం గురించి అధ్యయం చేసే శాస్త్రాన్ని "హెమటాలజీ" అంటారు. ఒక మనిషి యొక్క శరీరంలో సుమారు 4-5 లీటర్ల రక్తం ప్రసరిస్తుంది.
రక్తంలో రక్తకణాల మధ్య ఉండే పలుచని ద్రవాన్ని ప్లాస్మా అంటారు. ఇది మానవ శరీరంలోని మొత్తం రక్తంలో 55 శాతం ఉంటుంది. ఇది లేత పసుపుపచ్చ రంగులో ఉంటుంది. ప్లాస్మాలో 90 నుండి 92 శాతం నీరు ఉంటుంది. మిగతాలో నిరేంద్రియ లవణాలు, కార్భోనెట్‌లు, బైకార్బోనెట్‌లు, ఫాస్పెట్‌లు, కాల్షియం, ప్రొటీన్లు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, నత్రజనీలు ఉంటాయి.
➺ రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి.
- ఎర్ర రక్తకణాలు
- తెల్ల రక్తకణాలు
- రక్తఫలకీకలు (ప్లేట్‌లేట్స్)
➠ ఎర్ర రక్తకణాలు :
ఎర్ర రక్తకణాలను ఎరిథ్రోసైట్ అని కూడా అంటారు. ఎర్ర రక్తకణాలు గుండ్రగా / ద్విపుటాకారంలో ఉంటాయి. వీటికి కేంద్రకం ఉండదు. క్షీరదాల్లో మాత్రమే కేంద్రకం ఉంటుంది. ఎర్రరక్తకణాలలో హిమోగ్లోబిన్ ఉంటుంది. అందువల్లనే రక్తం ఎరుపురంగులో ఉంటుంది. ఎర్ర రక్తకణాలు శరీరంలోని ఆక్సీజన్, కార్భన్ డై ఆక్సైడ్ ప్రసరణలో కీలక పాత్రపోషిస్తాయి. ఇవి మానవ శరీర ఎముక మజ్జ నుండి ఉద్భవిస్తాయి. ఈ విధానాన్ని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఇవి 120 రోజుల పాటు జీవించి ఉంటాయి. మగవారిలో అయితే ఒక క్యూబిక్ మిల్లీ మీటర్‌కు 5 నుండి 5.5 మిలియన్‌లు, ఆడవారికైతే 4.5 నుండి 5 మిలియన్‌లు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు పిండ దశలో కాలేయం, ప్లీహం ఎముక మజ్జలో ఏర్పడతాయి. శిశువు జన్మించినప్పుడు జీవితకాలం ఎముక మజ్జలో ఏర్పడతాయి. 120 రోజుల తర్వాత ఎర్రరక్తకణాలు కాలేయం, ప్లీహంలో విచ్చన్నమవుతాయి కాబట్టి ప్లీహాన్ని ఎర్ర రక్తకణాల స్మశాన వాటిగా అంటారు. అలాగే రక్తాన్ని నిల్వ చేసుకుంటుంది కాబట్టి బ్లడ్ బ్యాంక్ అంటారు.
Also Read :
➠ తెల్ల రక్తకణాలు :
తెల్ల రక్తకణాలను ల్యూకోసైట్ అని కూడా పిలుస్తారు. వీటికి నిర్ణీత రూపం ఉండదు. ఇవి శరీరానికి వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని రక్షకభటులుగా పిలుస్తారు. ఇవి శరీరంలో క్యూబిక్ మిల్లీ మీటర్‌కు 5000 నుండి 10000 వరకు ఉంటాయి. ఇవి ఎముక మజ్జలో ఉద్భవిస్తాయి.
వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు
- కణికాయుత కణాలు
- కణికారహిత కణాలు
కణికాయుత తెల్లరక్తకణాలు
➣ ఎసిడోఫిల్స్
వీటిని ఇయోసినోఫిల్స్ అని కూడా పిలుస్తారు. పరాన్నజీవుల సంక్రమణ, అలర్జీ ఉన్నప్పుడు శరీరంలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి గాయాలు మానడానికి, సూక్ష్మజీవులు స్రవించిన విషపదార్థాలను నాశనం చేయడానికి సహకరిస్తాయి. ఇవి 2 నుండి 4 శాతం ఉంటాయి.
➣ బేసోఫిల్స్
ఇవి 0.5 నుండి 2 శాతం వరకు ఉంటాయి. ఇవి హెపారిన్‌ను స్రవిస్తాయి. రక్తనాణాల్లో రక్తం గడ్డకట్టడానికి ఇవి ఉపయోగపడతాయి.
➣ న్యూట్రోఫిల్స్
తెల్లరక్తకణాల్లో ఇవి 62 శాతం వరకు ఉంటాయి. ఇవి కణభక్షణలుగా పనిచేస్తాయి. బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులను వాటిలోకి తీసుకొని చంపేస్తాయి. ఇవి హనికర బ్యాక్టీరియా నుండి రక్షణ కల్పిస్తాయి.
కణికారహిత కణాలు
➣ లింఫోసైట్‌లు
ఇవి అతిచిన్న కణాలు. ఇవి 30 శాతం వరకు ఉంటాయి. ఇవి శరీరానికి హని కల్గించే సూక్ష్మజీవులను యాంటీజెన్‌లుగా గుర్తించి వాటిని తటస్థం / నిర్వీర్యం చేయడానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.
➣ మోనోసైట్స్
అతిపెద్ద కణాలుగా ఉండే ఇవి 5 శాతం వరకు ఉంటాయి. కణభక్షణగా వ్యవహరిస్తాయి. వీటిని మాక్రోఫెజ్‌లు, స్కావెంజర్ కణాలుగా పేర్కొంటారు. ఇవి చనిపోయిన / దెబ్బతిన్న కణాలను తీసివేసి శరీర పారిశుద్య కార్మికులుగా పనిచేస్తాయి.
➺ రక్త ఫలకీకలు (ప్లేట్‌లేట్స్)
మానవుడితో సహా క్షీరదాలన్నింటిలోనూ రక్త ఫలకీకలు ఉంటాయి. ఇవి పూర్తిగా కణాలు కావు. వీటికి కేంద్రకం ఉండదు. వీటి యొక్క జీవిత కాలం 7 నుండి 10 రోజులు ఉంటుంది. ఇవి రక్త గడ్డకట్టడంలో ముఖ్య భూమికను పోషిస్తాయి. రక్తనాళాలు తెగినప్పుడు రక్తఫలకీకలు స్రవించిన రసాయనం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడి రక్తం కారడం తగ్గిపోతుంది.
0 Comments