Interesting Facts About the Sun in Telugu || Gk in Telugu || General Knowlege in Telugu

 సూర్యుని గురించి ఆసక్తికర విషయాలు .. !
Facts about the sun's age, size and history
Geography in Telugu || Gk in Telugu 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

పాలపుంతలోని సూర్యుడు, 8 గ్రహాలు, గ్రహ శకలాలు తోకచుక్కలు, ఆస్ట్రరాయిడ్స్‌ అన్నిటీని కలిపి సౌరకుటుంబం అని పిలుస్తారు. ఈ సౌర వ్యవస్థ ఏర్పడిందని  భావించే నెబ్యులా 5-5.6 బిలియన్‌ సంవత్సరాల క్రితం విచ్చన్నం కావడం ప్రారంభించింది. గ్రహాలు సుమారు 4.6 బిలియన్‌ సంవత్సరాల క్రితం ఉద్భవించాలని అంచనా. 

సౌర వ్యవస్థలో సూర్యుడు, 8 గ్రహాలు, 63 చంద్రులు, గ్రహశకలాలు, తోకచుక్కలు వంటి మిలియన్ల చిన్న వస్తువులు భారీ మొత్తంలో ధూళి, దుమ్ము, వాయివులు ఉన్నాయి. సూర్యుడుకి సుమారు 5 బిలియన్ల వయస్సుంటుంది. సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8.2 నిమిషాలు.

➺ సూర్యుని ఉపరితలాన్ని మూడు మండలాలుగా విభజించవచ్చు :

  • కాంతి మండలం 
  • వరుణావరణం 
  • కరోనా 

కాంతిమండలం 

సూర్యునిలో కనిపించే ప్రకాశవంతమైన మండలం, ఈ మండలంలోని ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సీయస్‌ వరకు ఉంటుంది. ఈ మండలంలోనే సూర్యాంకాలు (సూర్యునిపై కనిపించే నల్లటి మచ్చలు) ఉంటాయి. 



Also Read :


వరుణావరణం 

సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో కనిపించేది వరుణావరణం. ఈ మండలం ఉష్ణోగ్రత సుమారు 32,400 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుంది. 

కరోనా 

ఇది సూర్య గ్రహణ సమయంలో మాత్రమే కనపించే మండలం. దీని ఉష్ణోగ్రత 27,00,000 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుంది. సూర్యుని కేంద్రంలో ఉష్ణోగ్రత 15 మిలియన్ల 0కె ఉంటుంది. సూర్యునిలో అత్యంత వేడిగా ఉండే మండలం ఇదే. 

➺ సూర్యుని గురించి మరిన్ని విషయాలు :

  • సూర్యుని లోపల అత్యంత వేడిగా ఉండే ప్రాంతం కేంద్రం 
  • సూర్యుని ఆత్మభ్రమణ కాలం 25 రోజుల 9 గంటల 7 నిమిషాలు ఉంటుంది. 
  • సూర్యుని పరిభ్రమణ కాలం 250 మిలియన్‌ సంవత్సరాలు 
  • సూర్యునికి భూమికి మధ్య గల సరాసరి దూరం 149.5 మిలియన్‌ కి.మీ 
  • సూర్యుని కేంద్రంలో అణువుల ఉద్గారం భారీ స్థాయిలో సంభవిస్తే సౌరజ్వాలలు అని, తక్కువ స్థాయిలో సంభవిస్తే సౌర పవనాలు అని అంటారు. ఈ సౌర పవనాలు భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు ధృవాల వద్ద ఏర్పడే రంగు చారలను అరోరాలు అంటారు. 
  • ఉత్తరార్థగోళంలోని అరోరాలను అరోరా బొరియాలిస్‌ అని పిలుస్తారు 
  • దక్షిణార్థగోళంలోని అరోరాలను అరోరా ఆస్ట్రాలిన్‌ అని పిలుస్తారు 
  • సూర్యుని సౌర జ్వాలలు నుండి భూమిని కాపాడుతున్న పొర అయస్కాంత ఆవరణం. ఇది భూమికి 64000 కి.మీ ఎత్తులో ఉంటుంది. దీనికి గల మరో పేరు వ్యాన్‌ అలెన్‌ వికిరణ రేఖలు. 
  • సమానమైన సూర్యకాంతి గల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోహెల్స్‌ అంటారు. 

➺ ఖగోళ ప్రమాణాలు :

ఖగోళ దూరాలను కొలవడానికి ఈ క్రింది ప్రమాణాలను ఉపయోగిస్తారు. 

➠ ఆస్ట్రనామికల్‌ యూనిట్‌ 

సూర్యునికి - భూమికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రనామికల్‌ యూనిట్‌ అంటారు. గ్రహాల మధ్య, సూర్యునికి, గ్రహాలకు మధ్య ఉన్న దూరాలను లెక్కించడానికి దీనిని ఉపయోగిస్తారు. 1 ఆస్ట్రనామికల్‌ యూనిట్‌ = 149.5 మిలియన్‌ కి.మీ.

➠ కాంతి సంవత్సరం 

కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. (కాంతి సెకనుకి 3 లక్షల కి.మీ దూరం ప్రయాణిస్తుంది.)

➠ పార్సెక్‌ 

కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరాలను లెక్కించడం కోసం పార్సెక్‌ కొలమానాన్ని వాడతారు. 



Post a Comment

0 Comments