About Narendra Modi in telugu || నరేంద్రమోడీ || Indian Gk in Telugu || Biography in Telugu

నరేంద్రమోడీ

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.  

నరేంద్రమోడీ గుజరాత్‌ రాష్ట్రంలో ఉత్తర ప్రాంతంలో గల మెహసానా జిల్లా, వాద్‌నగర్‌లోని ఒక చిన్న పట్టణం నుండి జీవితం ప్రారంభించారు. నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్‌ 1950 రోజున దామోదరదాస్‌ మోడీ - హీరాబా మోడీ దంపతులకు జన్మించారు. నరేంద్రమోడీ తండ్రి దామోదరదాస్‌ మోడీ రైల్వేస్టేషన్‌లో టీస్టాల్‌ ఏర్పాటు చేసుకొని జీవనం సాగించేవాడు. మోడీ సెంకడరీ విద్యను వాద్‌నగర్‌లో పూర్తి చేశారు. నరేంద్రమోడీకి జశోదామెన్‌తో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు విడిపోయారు. 

నరేంద్రమోడీ తన ఎనిమిది సంవత్సరాల వయస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ జాయిన్  అయ్యారు. మరియు దాని శిక్షణ సమావేశాలకు హజరయ్యారు .1985లో బిజేపిలో చేరారు.మోడీ 1975లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 

నరేంద్రమోడీ భారతదేశం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వారిలో ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొదటి వ్యక్తి. 2001 నుండి 2014 సంవత్సరం వరకు భారతీయ జనతాపార్టీ తరపున గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నరేంద్రమోడీ 2014 నుండి 2019 సంవత్సరం వరకు మొదటి పర్యాయం భారతీయ జనతా పార్టీ తరపున భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. 30 మే 2019 రోజున మళ్లీ రెండోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

02 అక్టోబర్‌ 2014 రోజున జాతిపిత మహాత్మగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘‘స్వచ్ఛభారత్‌’’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం పరిధిలోగాని, ప్రభావంలో గాని చరిత్రలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. 


Also Read :

Post a Comment

0 Comments