Sardar Sarvayi Papanna in Telugu || సర్దార్‌ సర్వాయి పాపన్న || Telangana Gk in Telugu || Telangana History in Telugu

Sardar Sarvayi Papanna in Telugu || సర్దార్‌ సర్వాయి పాపన్న

 సర్దార్‌ సర్వాయి పాపన్న 
 Sardar Sarvayi Papanna

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

సర్దార్‌ సర్వాయి పాపన్న తెలంగాణ రాష్ట్రం, వరంగల్‌ (ప్రస్తుతం జనగామ జిల్లా) జిల్లా రఘునాథపల్లి మండలం, ఖిలాషాపూర్‌ గ్రామంలో జన్మించాడు. తన తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్‌. తెలంగాణలో మొఘలుల అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు. సర్వాయి పాపన్న ఔరంగజేబు కాలంలో జీవించాడు. వెనుబడిన, అణగారిన వర్గాల పేదల అభివృద్ది కోసం ఎంతో కృషి చేసాడు. 


Also Read :


    సర్వాయి పాపన్న మొగలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకొని వరంగల్‌ జిల్లాలో ఖిలాషాపూర్‌ కోటను నిర్మించి, దానిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. మొగలుల అరాచకాలను, అణచివేతలను గమనించి గొప్ప సైన్యాన్ని తయారు చేసి గెరిల్లా పద్దతుల్లో శిక్షణ ఇప్పించాడు. 

సర్వాయి పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి, కొలనుపాక, వరంగల్‌ జిల్లాలోని తాటికొండ, చేర్యాల, కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌, హుజురాబాద్‌లోని కోటలను నియంత్రించాడు. తన పరిపాలనలో రాజ్యాన్ని విస్తరించడానికి సర్వాయిపేటలో తన మొదటి కోటను నిర్మించాడు. తాటికొండ, వేములకొండ, షాపురంలలో కూడా కోటలను కట్టించాడు. తాటికొండలో ప్రస్తుతం ఉన్న చెక్‌డ్యాం పాపన్న పరిపాలనలో నిర్మించబడడం, ఒక పాలకుడిగా తన ఆదీనంలో ఉన్న ప్రాంతం యొక్క అభివృద్ది పట్ల ఆయనకు గల దూరదృష్టికి అద్దంపడుతుంది. 

సుబేదార్లు, జమీందార్లు, భూస్వాములపై గెరిల్లా దాడులు చేసి యుద్దానికి మరియు సైన్యానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చుకునేవాడు. పాపన్న యొక్క ప్రజాధరణకు సంబంధించిన వార్తలు ఔరంగజేబుకు చేరడంతో పాపన్నను అణచివేయమని రుస్తుమ్‌ దిల్‌ఖాన్‌కు ఆదేశాలు జారీ చేశాడు. రుస్తుమ్‌ దిల్‌ఖాన్‌ మొదటగా ఖాసీంఖాన్‌ను పంపించి పాపన్నతో పోరాటం చేసి షాపురం కోటను ఆక్రమించుకున్నాడు. పాపన్న ఖాసీంఖాన్‌ను ఓడించి చంపేశాడు. దీంతో రుస్తుం దిల్‌ఖాన్‌ స్వయంగా యుద్దానికి వచ్చాడు. ఈ యుద్దంగా దాదాపు 3 నెలలపాటు కొనసాగింది. చివరికి రుస్తుం దిల్‌ఖాన్‌ యుద్దం నుండి పారిపోయాడు. కాని పాపన్న తన స్నేహితుడు, అనుమాయుడైన సర్వన్నను కోల్పొయాడు. 

1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కను సుబేదారు అయిన కంబక్షఖాన్‌ దక్కన్‌పై నియంత్రణ కోల్పొవడం ప్రారంభమైంది. ఈ బలహీనమైన పరిపాలనను పాపన్న గమనించి వరంగల్‌ కోటపై 01 ఏప్రిల్‌ 1708 రోజున దాడిచేసి కోటను ఆక్రమించుకున్నాడు. తాటికొండ వద్ద, ఖిలాషాపురం వద్ద చాలాకాలం యుద్దం కొనసాగింది. అక్కడి నుండి పాపన్న తప్పించుకున్నాడు. 1712లో సర్వాయి పాపన్నను వెతికిపట్టుకొని శిరచ్ఛేదం చేసి చంపేశారు. దీంతో సర్వాయి పాపన్న ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించి వీరమరణం పొందాడు. 

Post a Comment

0 Comments