
బాలికల విద్యకు ఆర్థిక భరోసా
విద్యార్థినులకు ఏడాదికి రూ.50 వేలు..
చదువులో ప్రతిభ కనబర్చినప్పటికి పేదరికంతో ఉన్నత చదువులు చదవలేక ఇబ్బందులు పడుతూ అనేక మంది అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారు. ఇటువంటి విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఆర్థిక భరోసా కల్పిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం అర్హులైన విద్యార్థినులకు 50 వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందిస్తుంది. డిప్లొమా, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ మొత్తం స్కాలర్‌షిప్‌లు 10000 ఉన్నాయి ఇందులో
- డిప్లొమా (5000)
- ఇంజనీరింగ్ (5000)
తెలంగాణకు
- డిప్లొమా (206)
- ఇంజనీరింగ్ (424)
ఆంధ్రప్రదేశ్‌కు
- డిప్లొమా (318)
- ఇంజనీరింగ్ (566)
Also Read :
➺ అర్హతలు
- బాలిక విద్యార్థినులు మాత్రమే
- ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో డిప్లొమా లేదా బిటెక్ కోర్సులు చదువుండాలి
- ఆయా కోర్సులో ఫస్ట్ ఇయర్ లేదా లెటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్‌లో చేరి ఉండాలి
- ఒక కుటుంబం నుండి ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ధరఖాస్తు చేసుకోవచ్చు
- కుటుంబ వార్షికాదాయం 8 లక్షలకు మించరాదు
➺ స్కాలర్‌షిప్ అందించు విధానం :
ఎంపికైన విద్యార్థినులకు ప్రతి సంవత్సరం 50 వేల రూపాయలు అందిస్తారు. డిప్లొమా వారికి మూడు సంవత్సరాలు, ఇంజనీరింగ్ వారికి నాలుగు సంవత్సరాలు అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్ రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
➺ ఎంపిక విధానం :
- డిప్లొమా అభ్యర్థులైతే 10వ తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఇంజనీరింగ్ విద్యార్థినులకైతే ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తుకు చివరి తేది :
- 31 డిసెంబర్ 2023
0 Comments