Modern Indian History Gk Questions in Telugu Part - 2 || ఆధునిక భారతదేశ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు

ఆధునిక భారతదేశ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు

ఆధునిక భారతదేశ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు

Modern India History in Telugu Part - 2

   Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛; Question No.1
ఈ క్రిందివాటిలో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీకి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) ఈ కంపెనీని మర్చంట్‌ ఆఫ్‌ అడ్వేంచర్స్‌ లేదా జాన్‌ కంపనీ అని కూడా అంటారు
2) మొదట ఈ కంపెనీకి వ్యాపార హక్కుల అనుమతులు 15 సంవత్సరాలకే ఇచ్చినప్పటికి 1609 మే నెలలో రాణి ఎలిజిబెత్‌ -1 ఈ అనుమతులను అపరిమిత కాలానికి పొడగించారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కాదు

జవాబు : ఎ) 1 మాత్రమే

☛ Question No.2
బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ స్థాపించిన కాలంలో మొఘల్‌ చక్రవర్తిగా ఎవరు ఉన్నారు ?
ఎ) అక్భర్‌
బి) జహంగీర్‌
సి) షాజహాన్‌
డి) అలంగీర్‌ / ఔరంగజేబు

జవాబు : ఎ) అక్భర్‌

☛ Question No.3
భారతదేశంలో బ్రిటీష్‌ ఈస్టిండియా వ్యాపార అనుమతులకు సంబంధించిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1608లో సూరత్‌లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని విలియం హాకిన్స్‌ జహంగీర్‌ను కోరగా పోర్చుగీసు వారు అడ్డురావడం వల్ల వీరికి అనుమతి రాలేదు.
2) 1611లో గోల్కొండ సుల్తాన్‌ మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా అనుమతి ఇవ్వడంతో మచిలీపట్నం వద్ద కెప్టెన్‌ హిప్పన్‌ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు.
3) 1612 లో కెప్టెన్‌ బెస్ట్‌ ఆధ్వర్యంలోని డ్రాగన్‌, ఓసియాండర్‌ బ్రిటీష్‌ నౌకలు పోర్చుగీసు నౌకలను  ఓడించిన  తర్వాత జహంగీర్‌ సూరత్‌లో వీరికి ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : డి) 1, 2 మరియు 3

☛ Question No.4
భారతదేశంలో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపనీకి సంబంధించిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1615లో ఇంగ్లాండ్‌ రాజు జేమ్స్‌ 1 తరపున రాయబారిగా జహంగీర్‌ ఆస్థానానికి వచ్చిన సర్‌ థామస్‌రో ఆగ్రా, అహ్మదాబాద్‌, బ్రోచ్‌ లలో వర్తకస్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందాడు.
2) 1619 నాటికి ఆగ్రా, బరోడా, అహ్మదాబాద్‌, బ్రోచ్‌ వద్ద వర్తక ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారు.
3) 1621 సంవత్సరంలో తూర్పు తీరంలోని పులికాట్‌ వద్ద గల ఆర్మగం వద్ద ఒక వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : డి) 1, 2 మరియు 3

☛ Question No.5
బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ యొక్క మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) హరిహరపూర్‌ బాలసోర్‌ / బాలసోర్‌
బి) పులికాట్‌
సి) కలకత్తా
డి) కటక్‌

జవాబు : ఎ) హరిహరపూర్‌ బాలసోర్‌ / బాలసోర్‌


Also Read :

☛ Question No.6
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) ప్రస్తుత మద్రాసు పట్టణం ఉన్న ప్రాంతం అంతా 17వ శతాబ్దం ప్రారంభకాలంలో చంద్రగిరి రాజు అయిన 3వ వెంకటపతిరాయలు ఆదీనంలో ఉండేది
2) 1639 లో మచిలీపట్నం కౌన్సిల్‌ మరియు బ్రిటీష్‌ మర్చంట్‌ అయిన ఫ్రాన్సిస్‌ డే దామెర్ల సోదరుల మధ్యవర్తిత్వంతో 3వ వెంకటపతి రాయలు నుండి అనుమతి తీసుకొని ప్రస్తుతం మద్రాసు ఉన్న ప్రాంతాన్ని పొందాడు.
3) దామెర్ల వెంకటాద్రి తండ్రి చెన్నప్ప పేరుమీదుగానే మద్రాసును చెన్నపట్నం అని పిలిచేవారు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : డి) 1, 2 మరియు 3 మాత్రమే

☛ Question No.7
ఈ క్రింది వాటిలో భారతదేశంలో బ్రిటీష్‌ వారు నిర్మించిన మొదటి కోట ఏది ?
ఎ) సెయింట్‌ జార్జ్‌ కోట
బి) సెయింట్‌ డేవిడ్‌ కోట
సి) విలియం కోట
డి) ఏవీకావు

జవాబు : ఎ) సెయింట్‌ జార్జ్‌ కోట

☛ Question No.8
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1667 లో బ్రిటీష్‌ వారు బెంగాల్‌లో వ్యాపారం కోసం ఔరంగజేబు నుండి అనుమతి పొందారు
2) 1690 లో బెంగాల్‌లోని సుతనుటి అనే ప్రాంతం వద్ద బ్రిటీష్‌ స్థావరాన్ని నిర్మించుకొని ఆ తర్వాతి కాలంలో సుతనుటితో పాటు కాళీకటా, గోవిందాపూర్‌ అను మూడు గ్రామాలను కలిపి కలకత్తా నగరం నిర్మించాడు.
3) కలకత్తా నగరం చుట్టూ 1700 సంవత్సరంలో విలియం కోటను నిర్మించారు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3 ‌

జవాబు : డి) 1, 2 మరియు 3

☛ Question No.9
భారతదేశం నుండి ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా వర్తకం జరిపిన వస్తువు ఏది ?
ఎ) మిరియాలు
బి) పత్తి
సి) నీలిమందు
డి) నల్లమందు

జవాబు : సి) నీలిమందు

☛ Question No.10
ఎవరి గురించి తెలుపుతూ సర్‌ థామస్‌ రో దినచర్య అనే గ్రంథాన్ని రచించాడు ?
ఎ) జహంగీర్‌
బి) షాజహాన్‌
సి) ఔరంగజేబు
డి) బహదూర్‌ షా

జవాబు : బి) డయ్యూ మరియు డామన్‌

Post a Comment

0 Comments