
ఆలిండియా సైనిక్స్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్
నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలిండియా సైనిక్స్ స్కూల్ ఎంట్రన్స్ టెస్టు - 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 33 పాఠశాలలో 6వ మరియు 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్స్ స్కూల్‌లలో భోదన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఇందులో చదువు పూర్తి చేసిన విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ వంటి వాటిల్లో చేరేందుకు ప్రాధాన్యత ఉంటుంది.
➺ సీట్లు వివరాలు :
కలికిరి సైనిక్ స్కూల్
- 6వ తరగతి - 95 సీట్లు (బాలికలకు 10)
- 9వ తరగతి - 10 సీట్లు (బాలురు మాత్రమే)
కోరుకొండ సైనిక్ స్కూల్
- 6వ తరగతి - 68 సీట్లు (బాలికలకు 10)
- 9వ తరగతి - 18 సీట్లు (బాలికలకు 4)
ఎస్‌పీఎస్ఆర్ నెల్లూర్‌లోని అదాని వరల్డ్ స్కూల్ నిర్వహిస్తున్న సైనిక్ పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయి.
➺ అర్హతలు :
6వ తరగతి ఎంట్రన్స్ టెస్టు
- 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు
- 31 మార్చి 2024 నాటికి 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సు ఉండాలి
- 01 ఏప్రిల్ 2012 నుండి 31 మార్చి 2014 మధ్య జన్మించినవారై ఉండాలి
9వ తరగతి ఎంట్రన్స్ టెస్టు
- 8వ తరగతి చదువుతుండాలి
- 31 మార్చి 2024 నాటికి 13 నుండి 15 సంవత్సరాలు వయస్సు ఉండాలి
- 01 ఏప్రిల్ 2009 నుండి 31 మార్చి 2011 మధ్య జన్మించిన వారై ఉండాలి
Also Read :
➺ పరీక్షా ఫీజు :
- రూ॥650/- (జనరల్ / డిఫెన్స్ ఉద్యోగుల, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు / ఓబీసీ )
- రూ॥500/- (ఎస్సీ / ఎస్టీ )
➺ పరీక్షాల కేంద్రాలు :
తెలంగాణలో
- హైదరాబాద్
- కరీంనగర్
ఆంధ్రప్రదేశ్‌లో
- అనంతపురం
- గుంటూర్
- కడప
- కర్నూలు
- నెల్లూర్
- ఒంగోలు
- రాజమహేంద్రవరం
- శ్రీకాకుళం
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
- విజయనగరం
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ముగింపు - 16 డిసెంబర్ 2023
- ఆన్‌లైన్‌లో మార్పులు - 18 నుండి 20 డిసెంబర్ 2023
- ఎంట్రన్స్ టెస్టు తేది - 21 జనవరి 2024
0 Comments