JEE Main - 2024 Apply online, Notification, Exam Date in Telugu || జేఈఈ మెయిన్‌ - 2024 || Latest Admissions in Telugu

జేఈఈ  మెయిన్‌ - 2024

JEE Main 2024: Registration (Active), Notification, Exam Date, New Syllabus in Telugu  

జేఈఈ - మెయిన్‌ - 2024 జాతీయ స్థాయిలో దాదాపు 12 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీపడే కఠినమైన పరీక్ష. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి దాదాపు లక్షన్నర మంది వరకు పోటీపడే అవకాశం ఉంది. వీరంతా ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన సిలబస్‌ ప్రకారం ప్రిపరేషన్‌ కొనసాగించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం రెండు సెషన్‌లలో పరీక్షను నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ పరీక్షను 12 ఫిబ్రవరి 2024, రెండో సెషన్‌ పరీక్షను 1 నుండి 15 ఏప్రిల్‌ 2024 వరకు నిర్వహిస్తారు. 


➺ పరీక్ష పేరు :

  • జేఈఈ మెయిన్ - 2024


➺ JEE Main అర్హత :

  • ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మిడియట్‌ / తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించాలి. 
  • 2024 ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. 


➺ JEE Main  పరీక్షా విధానం : 

జేఈఈ-మెయిన్‌ను పేపర్‌-1, పేపర్‌-2ఎ, పేపర్‌-2బిలుగా నిర్వహిస్తారు. బీటెక్‌ అభ్యర్థులకు పేపర్‌-1, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులకు పేపర్‌-2ఎ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల అభ్యర్థులకు పేపర్‌-2బి పరీక్ష నిర్వహిస్తారు. 


➺ JEE Main  పరీక్షా పద్దతి  :

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటి) 


➺ JEE Main  వయస్సు :

  • గరిష్ట వయోపరిమితి లేదు


JEE MAIN - 2024 ముఖ్యమైన తేదీలు
మొదటి (జనవరి) సెషన్‌కు చివరి తేది 30 నవంబర్‌ 2023
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ పరీక్షకు మూడు రోజుల ముందు
మొదటి (జనవరి) సెషన్‌ పరీక్షలు 24 జనవరి - 01 ఫిబ్రవరి 2024 వరకు
మొదటి సెషన్‌ పరీక్షా ఫలితాలు 12 ఫిబ్రవరి 2024
రెండో సెషన్‌ ధరఖాస్తులు 02 ఫిబ్రవరి నుండి 02 మార్చి 2024 వరకు
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ పరీక్షకు మూడు రోజుల ముందు
రెండో సెషన్‌ పరీక్షలు 01 - 15 ఏప్రిల్‌ 2024
రెండో సెషన్‌ పరీక్షా ఫలితాలు 25 ఏప్రిల్‌ 2024

Post a Comment

0 Comments