
సీటెట్ (CTET) - 2024CTET - 2024 || Latest Jobs in Telugu
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్‌ఈ) సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి - 2024 ఏడాదికి సంబంధించి సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 23 నవంబర్ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్షా కేంద్రాలు కలవు.
➺ ఎంట్రన్స్ టెస్టు పేరు :
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి - 2024
➺ CTET 2024 అర్హత :
పేపర్ - 1
50 శాతం మార్కులతో 12వ తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యూకేషన్‌లో 2 సంవత్సరాల డిప్లొమా (డీఈఎల్‌ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ లో ఉత్తీర్ణత సాధించాలి.
Also Read :
పేపర్ - 2
కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమమెంటరీ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఇన్ ఎడ్యూకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) / బీఎస్సీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
➺ CTET 2024 పరీక్షా విధానం :
పరీక్ష మొత్తం రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 నుండి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం, పేపర్-2 ఆరు నుండి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోరు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కల్గి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణలోకి తీసుకుంటారు.
➺ CTET 2024 పరీక్షా కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్ లో
- గుంటూరు
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
తెలంగాణలో
- హైదరాబాద్
- వరంగల్
➺ CTET 2024 పరీక్ష పద్దతి :
- సీబీటి (కంప్యూటర్ బేస్‌డ్ టెస్టు)
➺ CTET 2024 ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది.27 నవంబర్ 2023
- పరీక్షా తేది.01 జనవరి 2024
మరింత సమాచారం కోసం
0 Comments