
సైన్ అండ్ టెక్నాలజీ జీకే ప్రశ్నలు - జవాబులు
Gk MCQ Questions and Answers in Telugu
Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
📚 Question No.1
1) హోమి జహంగీర్ బాబాను భారత అణు సాంకేతికత పితామహుడుగా పిలుస్తారు
2) భారతదేశంలో అణుశక్తి సాంకేతికత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ఏర్పాటుతో ప్రారంభమైంది
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 రెండూ కావు
జవాబు : ఎ) 1 మరియు 2
📚 Question No.2
ఈ క్రింది వాటిలో అణుశక్తి సాంకేతికత సంబంధించిన ప్రయోగశాలలు, అవి ఉన్న ప్రాంతాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్
2) ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్
3) రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ
4) వెరియబుల్ ఎనర్జీ సైక్టోట్రాన్ సెంటర్
5) అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్
ఎ) కోల్‌కతా
బి) ముంబాయి
సి) హైదరాబాద్
డి) కల్పకం (తమిళనాడు)
ఇ) ఇందౌర్
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
బి) 1-బి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-సి
సి) 1-డి, 2-బి, 3-ఇ, 4-సి, 5-ఎ
డి) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-బి, 5-డి
జవాబు : బి) 1-బి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-సి
📚 Question No.3
అణు సాంకేతికత ప్రయోగశాలల గురించి కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌ను ఇతర అణు సాంకేతికత ప్రయోగశాలలకు అమ్మలాంటిది అంటారు.
2) బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ .. యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌లో పాలుపంచుకుంటుంది
3) కల్పకంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ సెంటర్ .. యురేనియం తవ్వకాలు శుద్దిపై పనిచేస్తుంది
4) హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ సంస్థ యురేనియం, థోరియం నిల్వల్ని గుర్తిస్తుంది
ఎ) 1 మరియు 2
బి) 2, 3 మరియు 4
సి) 1, 3 మరియు 4
డి) 1, 2 మరియు 4
జవాబు : డి) 1, 2 మరియు 4
📚 Question No.4
ఈ క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ?
1) హెవీ.వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయం - ముంబాయి
2) మొదటి హెవీ వాటర్ ప్లాంట్ - నంగల్ (పంజాబ్)
3) న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - దిల్లీ
4) బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ - హైదరబాద్
5) న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - బెంగళూరు
ఎ) 1 మరియు 2
బి) 2, 3, మరియు 5
సి) 1, 3 మరియు 5
డి) 1, 2 మరియు 4
జవాబు : ఎ) 1 మరియు 2
📚 Question No.5
ఈ క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ?
1) న్యూక్లియర్ ఫ్యూయల్, రియాక్టర్ కోర్‌కు సంబంధించిన పరికాలను అందిస్తుంది
2) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌కు సంబంధించిన స్టెయిన్ లెస్ స్టీల్ కోర్ పరికరాలను అందిస్తుంది
3) సహజ ఎన్‌రిచ్డ్ యురేనియం ఇంధనాన్ని అందిస్తుంది
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
📚 Question No.6
ముంబాయిలోని న్యూక్లియర్ కార్పోరేషన్ సంస్థ విధులకు సంబంధించి కిందవాటిలో సరికానివి ఏవి ?
1) న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజైన్, నిర్మాణం
2) న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అణువిద్యుత్ ఉత్పత్తి జరపడం
3) అణువిద్యుత్తును ఉపయోగించి పరిశ్రమలను నడిపించడం
4) బొగ్గును మండిరచి అణువిద్యుత్‌ను తయారు చేయడం
ఎ) 1 మరియు 2
బి) 3 మరియు 4
సి) 1 మరియు 3
డి) 2 మరియు 4
జవాబు : బి) 3 మరియు 4
📚 Question No.7
అణు సాంకేతికత పరిశోధనాశాలలు, అవి ఉన్న ప్రదేశాలను జతపర్చండి ?
1) హెవీవాటర్ బోర్డు
2) న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
3) బోర్డ్ ఆప్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ
4) న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్
5) యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఎ) హైదరాబాద్
బి) జాదుగూడ (రaార్ఖండ్)
సి) నంగల్ (పంజాబ్)
డి) ముంబాయి
ఇ) ముంబాయి
ఎ) 1-బి, 2-డి, 3-సి, 4-ఇ, 5-ఎ
బి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ, 5-ఇ
సి) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-సి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-బి
జవాబు : డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-బి
Also Read :
📚 Question No.8
హర్యానా బహదూర్‌గర్హ్‌లో ఉన్న గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్ సంస్థ ఈ క్రింది విధులు నిర్వహిస్తుంది ?
1) అణుశక్తి సాంకేతికతపై శిక్షణ
2) ప్రపంచ అణుశక్తిగా భాగస్వామ్యాన్ని పెంచడం
3) అణుశక్తిపై సెమినార్‌లు, వర్క్‌షాప్‌లను నిర్వహించడం
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1, 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : సి) 1, 2 మరియు 3
📚 Question No.9
అణుశక్తి సాంకేతికతను వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ?
1) గామా కిరణాలను ఉపయోగించి ఉత్పరివర్తన ప్రజననం ద్వారామేలైన వంగడాలను రూపొందించడం
2) మొక్కలు ఎరువులను ఏ విధంగా శోషించుకుంటున్నాయో గుర్తించడం
3) అయోనైజింగ్ రేడియేషన్‌ను ఉపయోగించి స్టెరైల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్ ద్వారా కీటకాలను నియంత్రించడం
ఎ) 1 మరియు 3
బి) 2 మరియు 3
సి) 1 మరియు 2
డి) 1 2 మరియు 3
జవాబు : డి) 1 2 మరియు 3
📚 Question No.10
అణుశక్తి సాంకేతికతను వినియోగం గురించి కింది వ్యాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి ?
1) గామా కిరణాలను ఉపయోగించి ఉపయోగించి ఆహార పదార్థాలను సూక్ష్మజీవరహితం చేయడం
2) రేడియేషన్ ఉపయోగించి నీటిని శుభ్రపరచడం
3) పరిశ్రమలు పరిశోధనల్లో రేడియోధార్మికత ఐసోటోపులను ట్రెసర్‌లుగా వాడటం
4) అణుశక్తిని ఉపయోగించి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం
ఎ) 2 మరియు 4
బి) 1 మరియు 3
సి) 1, 2 మరియు 3
డి) 2, 3 మరియు 4
జవాబు : ఎ) 2 మరియు 4
📚 Question No.11
ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి ?
1) అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు
2) రేడియో ఐసోటోపులను వ్యాది నిర్ధారణలో వాడుతున్నారు.
3) అణు సాంకేతికతలను క్యాన్సర్ చికిత్సకు వాడుతున్నారు.
4) అణు సాంకేతికత ద్వారా విడుదలయ్యే గామా కిరణాలను ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, వస్తువులను సూక్ష్మ జీవరహితం చేయడానికి వాడుతున్నారు.
5) అణుశక్తిని కార్లు, బస్సులు లాంటి వాటిని నడపడానికి వాడుతున్నారు.
ఎ) 1, 2, 3 మరియు 5
బి) 1, 2, 3 మరియు 4
సి) 2, 3, 4 మరియు 5
డి) 3, 4 మరియు 5
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
📚 Question No.12
ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి ?
1) అణువిద్యుత్ శక్తిని ఉపయోగించి జలాంతర్గాములు, విమాన వాహక నౌకలను నడుపుతున్నారు
2) అణువిద్యుత్ శక్తిని ఉపయోగించి ఉప్పునీటిని మంచినీటికి మారుస్తున్నారు.
3) స్పేస్ ప్రోబ్‌లలో న్యూక్లియర్ రియాక్టర్‌లను వాడుతున్నారు.
4) అణు సాంకేతికత అన్ని విధాల హానికరం, దీన్ని మానవ అవసరాల కోసం వాడుకోవడం కుదరదు
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1 మరియు 4
జవాబు : బి) 1, 2 మరియు 3
📚 Question No.13
ఐసోటోపులకు సంబంధించి కిందవాక్యాలను పరిశీలించి, సరైన దానిని గుర్తించండి ?
ఎ) ఐసోటోపులకు ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది కానీ వేర్వేరు పరమాణు భారాలంటాయి
బి) ఐసోటోపుల్లో ఒకే సంఖ్యల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్‌లు ఉంటాయి. కానీ వేర్వేరు సంఖ్యల్లో న్యూట్రాన్లుంటాయి
సి) సహజంగా ఉండే కొన్ని ఐసోటోపులకు రేడియో ధార్మికత ఉంటుంది
డి) రేడియోధార్మిక ఐసోటోపులకు మానవుడు తయారు చేయవచ్చు
ఇ) రేడియోధార్మిక ఐసోటోపులను వివిధ ప్రయోజనాలకు వాడుతున్నారు.
ఎ) ఎ, బి, సి, డి
బి) ఎ, సి, డి, ఇ
సి) ఎ, బి, సి, డి, ఇ
డి) బి, సి, డి, ఇ
జవాబు : సి) ఎ, బి, సి, డి, ఇ
📚 Question No.14
ఈ క్రింది జతలను సరైన క్రమంలో అమర్చండి ?
1) రేడియో కార్బన్
2) రేడియో క్లోరైడ్
3) యురేనియం -238
4) రేడియో అయోడీన్
5) రేడియో సోడియం
ఎ) రక్తనాళాల్లో అడ్డంకులు గుర్తించడానికి
బి) శిలాజ వయసును గుర్తించడానికి
సి) నీటి వయస్సును గుర్తించడానికి
డి) కణతులు గుర్తించడానికి
ఇ) భూమి / శిలల వయస్సును గుర్తించడానికి
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ, 5-ఇ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి, 5-ఇ,
డి) 1-బి, 2-సి, 3-ఇ, 4-డి, 5-1
జవాబు :డి) 1-బి, 2-సి, 3-ఇ, 4-డి, 5-1
0 Comments