
గవర్నర్ - అధికారాలు - విధులు Powers and Functions of Governor
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
గవర్నర్‌కు రాజ్యాంగంలో ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి. గవర్నర్ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అధిపతిగా, రాష్ట్రాధిపతిగా వ్యవహరిస్తాడు. గవర్నర్‌ను రాష్ట్ర ప్రథమ పౌరునిగా పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తాడు. సాధారణ పరిస్థితులలో రాష్ట్రాధిపతిగా, అత్యవసర పరిస్థితులలో రాజ్యాంగ అధినేతగా విధులు నిర్వహిస్తాడు.
భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటాడు. ఏకకాలంలో రెండు రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా బాద్యతలు నిర్వహిస్తాడు. రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ పేరుమీదుగా కొనసాగుతుంది. గవర్నర్‌లను రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్ యొక్క కాలపరిమితి సాధారణంగా 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో రికాల్ చేయవచ్చు. 35 సంవత్సరాలు నిండిన వారు గవర్నర్ పదవి చేపట్టే అర్హత సాధిస్తాడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్‌గా ఎన్నికైన వ్యక్తితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
గవర్నర్ - కార్యనిర్వహక అధికారాలు
- రాష్ట్ర పరిధిలోని ముఖ్యమంత్రికి మరియు మంత్రిమండలికి సలహలు ఇవ్వడం.
- నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిని నియామకం
- రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ నియామకం
- 1/6 వంతు సభ్యులను విధానపరిషత్‌కు నామినేట్ చేసే అధికారం ఉంటుంది.
- జిల్లా సెషన్ కోర్టు జడ్టీలను నియమించే అధికారం కలదు.
- రాష్ట్ర శాసన సభలో ఒక ఆంగ్లో-ఇండియన్ ను నామినేట్ చేయవచ్చు.
- రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నియామకం
- రాష్ట్ర అధికార భాష సంఘం, మైనార్టీ కమీషన్, మహిళా కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్, మానవహక్కుల కమీషన్ చైర్మన్‌లను, సభ్యుల నియామకం
- రాష్ట్ర విశ్వవిద్యాలయ చాన్స్‌లర్‌ల నియామకం
Also Read :
గవర్నర్ - శాసన అధికారాలు
- ఆస్తుల జాతీయీకరణ బిల్లు గవర్నర్ అనుమతి లేకుండా శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీలుండదు.
- రాష్ట్ర శాసన సభను గవర్నర్ సమావేశపరచవచ్చు లేదా దీర్ఘకాలం వాయిదా వేయవచ్చు, రద్దు చేయవచ్చు.
- రాష్ట్ర ఉభయసభలకు ప్రత్యేక సందేశాలు పంపవచ్చు
- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేయవచ్చు
- తన ఆమోదానికి వచ్చిన బిల్లులను ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పున:పరిశీలనకు పంపవచ్చు.
- తన ఆమోదానికై వచ్చే బిల్లును రాష్ట్రపతి అనుమతి కొరకు రిజర్వు చేయవచ్చు
- గవర్నర్ ముందస్తు అనుమతితోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు.
- రాష్ట్ర శాసనసభలు సమావేశంలో లేనప్పుడు గవర్నర్ ఆర్డిరెన్స్ రూపంలో ప్రత్యేక పరిపాలన ఆజ్ఞలను జారీ చేయవచ్చు.
- పబ్లిక్ సర్వీస్ కమీషన్, రాష్ట్ర ఆర్థిక సంఘము, కాగ్ సమర్పించిన నివేదికలను శాసనసభలో సమర్పించడము.
గవర్నర్ - న్యాయాధికారాలు
- గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలి సలహాతో న్యాయ లేదా క్షమాభిక్ష అధికారాలు వినియోగించవచ్చు
- గవర్నర్‌కు ఉరిశిక్షను రద్దుచేసే అధికారం ఉండదు.
- రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామయంలో రాష్ట్రపతి గవర్నర్ యొక్క సలహాలు తీసుకోవచ్చు.
- సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉండదు.
గవర్నర్ - ఆర్థిక అధికారాలు
- విధాన సభలో ద్రవ్య బిల్లును గవర్నర్ అనుమతితో ప్రవేశపెడతారు.
- రాష్ట్ర పబ్లిక్ నిధిని నిర్వహించడం.
- రాష్ట్ర ఆగంతుక నిధిని నిర్వహించడం
- గవర్నర్ అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించరాదు, తగ్గించరాదు, మార్పులు, చేర్పులు చేయరాదు.
గవర్నర్ - విచక్షణ అధికారాలు
- రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
- రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రత్యాన్మాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా ఏర్పాటు చేయకుండా శాసనసభను రద్దు చేయడం
- రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం శాసనసభను రద్దు చేయమని సలహా ఇచ్చినప్పుడు పాటించడం, పాటించకపోవడం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
0 Comments