
ఆధునిక భారతదేశ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు
Modern India History Part - 1
Question No.1
1. ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారతదేశానికి వచ్చిన ఐరోపా వారి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి ?
ఎ) పోర్చుగీసు - బ్రిటిష్- డచ్ - డేన్స్ - ఫ్రెంచ్
బి) బ్రిటిష్ - పోర్చుగీసు - డచ్ - ఫ్రెంచ్ - డేన్స్
సి) పోర్చుగీసు - డచ్ - బ్రిటిష్ - ఫ్రెంచ్ - డేన్స్
డి) పోర్చుగీసు - డచ్ - బ్రిటిష్ - డేన్స్ - ఫ్రెంచ్
జవాబు : డి) పోర్చుగీసు - డచ్ - బ్రిటిష్ - డేన్స్ - ఫ్రెంచ్
Question No.2
2) యూరిపియన్స్ భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టడానికి ఏర్పడిన కారణాలను గుర్తించండి ?
1) యూరప్ వారు బైజంటీన్ అనే ప్రాంతం గుండా భూమార్గం ద్వారా ఆసియా దేశాలకు, భారతదేశానికి చేరుకునేవారు
2) 1453 లో జరిగిన 3వ క్రూసేడ్ యుద్దంలో ముస్లీం రాజైన టర్కీ పాలకుడు 2వ మహమ్మద్, క్రైస్తవ రాజ్యం అయినటువంటి బైజంటీన్ పాలకుడైన కాన్‌స్టాంటైన్ ను ఓడించి రాజధాని కాన్ స్టాంటినోపుల్ ను ఆక్రమించుకున్నాడు.
3) కాన్‌స్టాంటినోపుల్ ద్వారా ఉన్న భూమార్గానికి టర్కీ పాలకుడు 2వ మహమ్మద్ ప్రవేశం కల్పించనందున యూరోపియన్ దేశాల వారికి భారతదేశానికి రావడం కోసం సముద్రమార్గాన్ని కనుగోనే పరిస్థితి ఏర్పడినది.
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1, 2 మరియు 3 మాత్రమే
డి) 3 మాత్రమే
జవాబు : సి) 1, 2 మరియు 3 మాత్రమే
Question No.3
3. పోర్చుగీసు యాత్రికుడు వాస్కోడిగామా ఏ నౌకలో భారతదేశానికి వచ్చాడు ?
ఎ) శాన్ రాఫెల్
బి) శాన్ గాబ్రియెల్
సి) శాన్ బెర్రియో
డి) శాన ఫ్రాన్సిస్
జవాబు : బి) శాన్ గాబ్రియెల్
పోర్చుగీసు వారు పై నాలుగు నౌకలలో భారతదేశానికి చేరుకున్నారు. అందులో వాస్కోడిగామా శాన్ గాబ్రియెల్ నౌకలో ఉన్నాడు.
Question No.4
వాస్కోడిగాయా మొదటి సారిగా భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు ?
ఎ) కాలికట్ / కళ్లికోట
బి) సూరత్
సి) కొచ్చిన్
డి) గోవా
జవాబు : ఎ) కాలికట్ / కళ్లికోట
ఈ ప్రాంతం కేరళ తీరంలో ఉంటుంది.
Question No.5
5. కాలికట్ ప్రాంతాన్ని వాస్కోడిగామా చేరుకున్న తర్వాత ఇక్కడ స్వాగతం పలికిన రాజు ఎవరు ?
ఎ) జామోరిన్ / మను విక్రమ వర్మ / సముద్రిక
బి) ఇమ్మడి నరసింహరాయలు
సి) సికిందర్ లోడి
డి) మహ్మద్ బేగార
జవాబు : ఎ) జామోరిన్ / మను విక్రమ వర్మ / సముద్రిక
Question No.6
6. ఈ క్రిందివాటిలో వాస్కోడిగామాకు సంబంధించిన వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) వాస్కోడిగామా 20 మే 1498న భారతదేశంలోని మలాబార్ తీరంలోని కళ్లికోటలోని కప్పడ్ ప్రాంతాన్ని చేరుకున్న మొదటి యూరోపియన్‌గా గుర్తింపు సాధించాడు.
2) వాస్కోడిగామా రెండవసారి 1502 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు.
3) వాస్కోడిగామా 1524లో మలేరియా వ్యాదితో కొచ్చి ప్రాంతంలో మరణించినాడు.
4) మెగస్తనీస్ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు.
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3 మాత్రమే
జవాబు : డి) 1, 2 మరియు 3 మాత్రమే
Question No.7
7. భారతదేశానికి వలస వచ్చిన పోర్చుగీసు వారికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి ?
1) పోర్చుగీసు వారు భారతదేశం నుండి ప్రధానంగా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసుకునేవారు
2) వీరి యొక్క రాజధాని కొచ్చిన్ కాగా తర్వాత గోవాకు మార్చుకున్నారు
3) భారతదేశంలో వీరి మొదటి మరియు పశ్చిమ తీరంలోని స్థావరం కాలికట్
4) భారతదేశ తూర్పు తీరంలో వీరి మొదటి స్థావరం మచిలీపట్నం
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4 మాత్రమే
డి) 2, 3 మరియు 4 మాత్రమే
జవాబు : సి) 1, 2, 3 మరియు 4 మాత్రమే
Question No.8
8. భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాతగా ఈ క్రిందివారిలో ఏ పోర్చుగీసు గవర్నర్‌ను అభివర్ణిస్తారు ?
ఎ) ఫ్రాన్సిస్కో డి అల్మిడా
బి) అల్బు కర్క్
సి) నిడోడా కున్హా
డి) మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా
జవాబు : బి) అల్బు కర్క్
Question No.9
9. పోర్చుగీసు వారు భారతదేశంలో ఏర్పాటు చేసుకున్న మొదటి అధికార స్థావరం ఏది ?
ఎ) కొచ్చిన్
బి) గోవా
సి) మచిలీపట్నం
డి) కాలికట్
జవాబు : బి) గోవా
Question No.10
10. పోర్చుగీసు గవర్నర్ నికో డా కున్హా ఆక్రమించిన ప్రాంతాలు ఏవి ?
ఎ) బొంబాయి
బి) డయ్యూ మరియు డామన్
సి) బావ్‌నగర్
డి) సూరత్
జవాబు :బి) డయ్యూ మరియు డామన్
Also Read :
Question No.11
11. క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈ క్రింది ఏ పోర్చుగీసు గవర్నర్ కాలంలో భారతదేశానికి మత ప్రచారం కోసం వచ్చాడు ?
ఎ) ఫ్రాన్సిస్కో డి అల్మిడా
బి) నిడో డా కున్హా
సి) మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా
డి) అల్పు కర్క్
జవాబు : సి) మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా
Question No.12
12. పోర్చుగీసు వారి యొక్క అధికారం భారతదేశంలో తగ్గడానికి గల కారణాలు గుర్తించండి ?
1) 1612లో సూరత్ వద్ద గల స్వాలీ యుద్దం లో కెప్టెన్ తామస్ బెస్ట్ ఆధ్వర్యంలోని పోర్చుగీసు వారిని ఆంగ్లేయుల సైన్యం చేతిలో ఓటమి
2) 1622 లో ఆర్మజ్ వద్ద జరిగిన యుద్దంలో డచ్ వారి చేతిలో ఓడిపోయి గల్ఫ్ ఆఫ్ ఆర్ముజ్‌ను కోల్పొయారు.
3) 1662లో పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ బ్రిగాంజను బ్రిటీష్ రాకుమారుడు 2వ చార్లెస్ వివాహం చేసుకుని కట్నం కింద బాంబేను పొందడం
4) 1739లో మరాఠా పీశ్వా బాజీరావు -1 పోర్చుగీసు వారిని ఓడించి వారి నుండి బెస్పైన్, సాల్‌సెట్టి అనే వర్తక స్థావరాలు ఆక్రమించడం
ఎ) 1 మరియు 2
బి) 1, 2, 3 మరియు 4
సి) 2, 3 మరియు డి
డి) 1, 2 మరియు 3
జవాబు : బి) 1, 2, 3 మరియు 4
Question No.13
13) ఈ క్రిందివాటిలో పోర్చుగీసు వారికి సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి ?
1) పోర్చుగీసు వారు గోతిక్ కళను భారతదేశానికి పరిచయం చేశారు.
2) పోగాకు, ఆల్పోన్స్ మామిడి, జీడిమామిడి, మొక్కజొన్న, బంగాళాదుంప వంటి పంటలను భారతదేశానికి పరిచయం చేశారు.
3) ఆసియా మరియు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసారు.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు :డి) 1, 2 మరియు 3
Question No.14
14. 1605లో భారతదేశంలో వర్తక స్థావరాన్ని మచిలీపట్నంలో మొదటిసారి ఏర్పాటు చేసుకోవడానికి డచ్ / నెదర్లాండ్ దేశస్తులకు అనుమతి ఇచ్చిన రాజు ఎవరు ?
ఎ) జంషీద్ కుతుబ్‌షా
బి) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
సి) మహమ్మద్ కులీ కుతుబ్ షా
డి) మహమ్మద్ కుతుబ్ షా
జవాబు : సి) మహమ్మద్ కులీ కుతుబ్ షా
Question No.15
15. నెదర్లాండ్ దేశస్తులు కోరమాండల్ తీరం నుండి దేనిని ఎగుమతి చేసుకునేవారు ?
ఎ) నూలు వస్త్రాలు
బి) సూరేకారం
సి) నల్లమంధు
డి) నీలిమందు
జవాబు : బి) సూరేకారం
దీనికి పేల్చే పరికరాలలో వాడేవారు
Question No.16
16. నెదర్లాండ్ దేశస్తులు భారతదేశంలోని తమ స్థావరాలను అన్నింటిని అంగ్లేయులకు కోల్పొయి ఇండోనేషియాకి వెళ్లిపోవడానికి దారితీసిన కారణాలు ఏవి ?
ఎ) బటావియాన్ వర్తకం
బి) అంబయాన హత్యాకాండ
సి) బిదేరా యుద్దం
డి) బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్
జవాబు : సి) బిదేరా యుద్దం
Question No.17
17. 1616 లో నెదర్లాండ్ / డచ్ వారు ప్యాక్టరీని సూరత్‌లో ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిన రాజు ఎవరు ?
ఎ) అలంగీర్ / ఔరంగజేబు
బి) షాజహాన్
సి) జహంగీర్
డి) అక్భర్
జవాబు : సి) జహంగీర్
Question No.18
18. డెన్మార్క్ / డానిష్ దేశస్థులు మన దేశంలో ఏ సంవత్సరంలో డానిష్ ఈస్టిండియా కంపెనీనీ స్థాపించారు ?
ఎ) 1616
బి) 1623
సి) 1618
డి) 1620
జవాబు : ఎ) 1616
Question No.19
19. ఈ క్రిందివాటిలో సరైన అంశాలను గుర్తించండి ?
1) భారతదేశంలో వ్యాపారం కన్న క్రైస్తవ మత ప్రచారానికి డెన్మార్క్ దేశస్తులు అధిక ప్రాథాన్యత ఇచ్చినారు.
2) డెన్మార్క్ దేశస్తులుసేరంపూర్‌లో ఏర్పాటు చేసిన క్రైస్తవ మిషనరీ ద్వారానే రాజారామ్మోహన్ రాయ్ 1815 లో బ్రహ్మసభ లేదా ఆత్మీయ సభను స్థాపించారు ?
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2 రెండూ కావు
డి) 1 మరియు 2
జవాబు : డి) 1 మరియు 2
Question No.20
20. ఈ క్రిందివాటిలో ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) 1668లో ఔరంగజేబు అనుమతితో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీనీ సూరత్‌లో ప్రారంభించారు.
2) 1669 గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేశారు.
3) 1674లో బెంగాల్ పాలకుడైన షయిస్తఖాన్ అనుమతితో చంద్రనాగోర్‌లో వర్తక స్థావరం ఏర్పాటు చేశారు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
0 Comments