President of India Powers and Responsibilities in Telugu || రాష్ట్రపతి అధికారాలు - విధులు || Indian Polity Gk in Telugu || General Knowledge in Telugu

రాష్ట్రపతి అధికారాలు - విధులు

 Powers and Functions of the President - Indian Polity Notes
రాష్ట్రపతి అధికారాలు, విధులు, ఎన్నిక, అర్హతలు 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

భారత రాష్ట్రపతి 

రాష్ట్రపతి భారతదేశం యొక్క రాజ్యాంగానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. భారతదేశ ప్రథమ పౌరుడు. భారత గణతంత్ర రాజ్యాధినేత. త్రివిధ దళాలకు అత్యున్నత కమాండర్‌గా వ్యవహరిస్తాడు. రాష్ట్రపతి యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే ప్రమాణస్వీకారం చేయబడతారు. 

➺ రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే అర్హతలేంటి ? 

  • భారతదేశ పౌరుడై ఉండాలి 
  • 35 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి ఉండాలి 
  • లోక్‌సభకు ఎన్నికయ్యే అన్ని అర్హతలు ఉండాలి. 
  • పార్లమెంట్‌ నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి
  • కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో లాభం చేకూర్చే పనుల్లో ఉండరాదు. 
  • ఎంపి/ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వారు తమ పదవికి రాజీనామా చేయకుండానే రాష్ట్రపతికి పోటీ చేయవచ్చు. ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నుకోబడితే వారి యొక్క ఎంపి/ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తులు ముందుగా వారియొక్క ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 

➺ రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది ? 

రాష్ట్రపతిని పరోక్ష పద్దతిలో ఎన్నిక చేస్తారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ప్రకారం ఓటు బదలాయింపు పద్దతి ద్వారా ఎన్నిక చేయబడతారు. రాష్ట్రపతిని ప్రత్యేకంగా రూపొందించిన ‘‘ఎలక్ట్రోరల్‌ కాలేజీ’’ ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్‌ కాలేజీలో లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యులు, వివిధ రాష్ట్రాలలోని విధానసభలకు ఎన్నికైన సభ్యులు, ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభలలో ఎన్నికైన సభ్యులు ఉంటారు. 

➺ రాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది ? 

రాష్ట్రపతిని సాధారణంగా తొలగించే అధికారం ఉండదు. కొన్ని షరతులకు లోబడి రాష్ట్రపతిగా కొనసాగుతున్న వ్యక్తి రాజ్యాంగాన్ని అతిక్రమించాడని వచ్చిన ఆరోపణలపై మహాభియోగ తీర్మాణం ఆమోదించినట్లయితే రాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు. మహాభియోగ తీర్మాణంపై జరిగే ఓటింగ్‌లో ఉభయ సభల్లోని ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు. 

➺ రాష్ట్రపతి ద్వారా నియమించబడే వ్యక్తులు మరియు సంస్థలు 

  • ప్రధానమంత్రిని, అతని సలహాపై ఇతర మంత్రుల నియామకం 
  • రాష్ట్రాల గవర్నర్లు 
  • కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ 
  • యూపిఎస్సీ చైర్మన్‌ మరియు సభ్యులు 
  • అటార్నీ జనరల్‌ 
  • ప్రధాన ఎన్నికల కమీషనర్‌ మరియు సభ్యులు 
  • సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు 
  • జాతీయ అధికార భాషాసంఘ చైర్మన్‌, సభ్యులు 
  • జాతీయ ఓబీసీ కమీషన్‌ చైర్మన్‌, సభ్యులు 
  • జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ అధ్యక్షులు, సభ్యులు 
  • జాతీయ మైనార్టీ కమీషన్‌ చైర్మన్‌, సభ్యులు 
  • కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌ కమీషనర్లు 
  • కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినంట్‌ గవర్నర్లు, పాలకులు 

పై నియామకాలను రాష్ట్రపతి మంత్రిమండల సలహామేరకు నియమిస్తాడు. 


Also Read :


రాష్ట్రపతి - శాసనాధికారాలు 

  • రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగంగా వ్యవహరిస్తాడు
  • పార్లమెంట్‌ ఉభసభలను సమావేశ పర్చడం, వాయిదా వేయడం 
  • లోక్‌సభను రద్దు చేయడం 
  • రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం 
  • రాజ్యసభకు 12 మందిని నామినేట్‌ చేయడం 
  • పార్లమెంట్‌ ఉభయసభలలో ప్రసంగించడం 
  • లోక్‌సభలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వడం 
  • రాష్ట్ర గవర్నర్‌లు పంపించిన బిల్లును ఆమోదించడం, పరీశిలించడం, తిరస్కరించడం 
  • పార్లమెంట్‌ సమావేశంలో లేనప్పుడు పరిపాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌లను జారీ చేస్తాడు. ఈ ఆర్డినెన్స్‌లను పార్లమెంట్‌ తిరిగి సమావేశం అయిన తర్వాత 6వారాల లోపు ఆమోదించాలి. పార్లమెంట్‌ ఆమోదించిన తర్వాతనే అట్టి ఆర్డినెన్స్‌ చట్టంగా మారుతుంది. 

రాష్ట్రపతి - న్యాయాధికారాలు 

ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించడానికి, వాటి అమలును వాయిదా వేయడానికి లేదా శిక్షల స్వభావాన్ని మార్చడానికి అధికారం ఉండును. ఈ విషయంలో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. 

రాష్ట్రపతి - సైనికాధికారాలు 

  • రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడిగా, త్రివిధ దళాధిపతిగా వ్యవహరిస్తాడు. 
  • యుద్ద ప్రకటన, విరమించుట, శాంతిసంధులు కుదుర్చుకోనుటకు అధికారం ఉండును. 
  • త్రివిధదళాల ప్రధానాధికారులను, ఇతర అధికారుల నియామకం 

అత్యవసర అధికారాలు 

భారత రాజ్యాంగం మూడు రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల కాలంలో ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 

➺ జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధించవచ్చు ? 

  • విదేశీ దండయాత్రలు, యుద్దం, సాయుధ తిరుగుబాటులు 
  • భారతదేశ సార్వభౌమత్వానికి లేదా దేశంలో ఏదో ఒక ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లిందని భావించనప్పుడు 
  • రాష్ట్రపతి సాధారణ ప్రకటన ద్వారా లేదా పార్లమెంట్‌ సాధారణ తీర్మాణం ద్వారా అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు.

➺ రాష్ట్రపతి పాలన (ఆర్టికల్‌ 356)

ఏదేని రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పడిపోవడం వల్ల ఉత్పన్నమైన అత్యవసర పరిస్థితే రాష్ట్రపతి పాలన. రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం రాష్ట్రప్రభుత్వం కొనసాగే వీలులేని పరిస్థితి ఏర్పడిరదన్న గవర్నర్‌ నివేదిక ఆధారంగా లేదా కేంద్రమంత్రి మండలి సిఫార్సు ఆధారంగా కూడా రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన విధిస్తాడు. 

➺ ఆర్థిక అత్యవసర పరిస్థితి 

దేశంలో ఆర్థిక స్థిరత్వం లేదా పరపతికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని  రాష్ట్రపతి భావించినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఇప్పటివరకు భారతదేశంలో ఇలాంటి పరిస్థితి రాలేదు. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఒక్క రాష్ట్రపతికి తప్ప సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అందరి ఉద్యోగుల జీతభత్యాలను రాష్ట్రపతి తగ్గించవచ్చు. 

➺ భారతదేశంలో ఇప్పటివరకు పనిచేసిన రాష్ట్రపతులు 

  • బాబూ రాజేంద్రప్రసాద్‌ 
  • సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 
  • జాకీర్‌ హుస్సెన్‌ 
  • (తాత్కాలిక రాష్ట్రపతులు - వరాహగిరి వెంకటగిరి, మహమ్మద్‌ హిదయతుల్లా) 
  • వరాహగిరి వెంకటగిరి 
  • ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ 
  • (తాత్కాలికం - బి.డి జెట్టి) 
  • నీలం సంజీవరెడ్డి 
  • జ్ఞానీ జైల్‌ సింగ్‌ 
  • ఆర్‌.వెంకట్రామన్‌ 
  • శంకరదయాళ్‌ శర్మ
  • కె.ఆర్‌ నారాయణన్‌ 
  • అబ్దుల్‌ కలాం 
  • ప్రతిభాపాటిల్‌ 
  • ప్రణబ్‌ముఖర్జీ 
  • రామ్‌నాథ్‌ కోవింద్‌ 
  • దౌపది ముర్ము


Post a Comment

0 Comments