SBI Junior Associate recruitment notification Telugu || ఎస్‌బీఐలో మరో భారీ నోటిఫికేషన్‌, 8283 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీ || Latest Jobs in Telugu

 ఎస్‌బిఐలో ఉద్యోగాల వెల్లువ

  • 8283 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ 
  • డిగ్రీతో బ్యాంక్‌ కొలువు 
  • 07 డిసెంబర్‌ 2023 లోగా ధరఖాస్తు చేసుకోవాలి

భారతదేశంలో ప్రధాన బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్‌ అసోసియేట్‌ ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8283 జూనియర్‌ అసోసియేట్‌ ( కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) ఉద్యోగాల భర్తీకి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ధరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో 575 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 525, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదేని డిగ్రీ పూర్తి చేసిన / చివరి సంవత్సరం విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,900 జీతం అందిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 07 డిసెంబర్‌ 2023 లోగా ధరఖాస్తులు చేసుకోవాలి. జూనియర్‌ అసోసియేట్‌ ప్రిలిమినరీ పరీక్షను జనవరి 2024 లో, మెయిన్‌ ఎగ్జామ్‌ను ఫిబ్రవరి 2024లో నిర్వహించనున్నారు. 

➺ పోస్టు పేరు :

జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) 



Also Read :


➺ మొత్తం పోస్టులు 8,283 ఉన్నాయి. ఇందులో 

  • తెలంగాణ (525)
  • ఆంధ్రప్రదేశ్‌ (50) 


➺ అర్హత :

  • ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
  • డిగ్రీ ఫైనల్‌ / చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు 


➺ వయస్సు :

01 ఏప్రిల్‌ 2023 నాటికి 20 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. 


➺ ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్‌ పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌) 
  • స్థానిక భాష పరీక్ష ప్రావీణ్యం 


➺ పరీక్ష విధానం :

  • ఆన్‌లైన్‌ 


➺ ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ 


➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది 07 డిసెంబర్‌ 2023
  • ప్రిలిమినరీ పరీక్ష తేది.జనవరి 2024
  • మెయిన్స్‌ పరీక్ష తేది.ఫిబ్రవరి 2024

For Online Apply

https://sbi.co.in/



Post a Comment

0 Comments