Professor Jayashankar in Telugu || ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ || Telangana Gk in Telugu || General Knowledge in Telugu

Professor Jayashankar in Telugu

 ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ (తెలంగాణ సిద్దాంతకర్త)

About Jayashankar Biography in Telugu || Telangana General Knowledge in Telugu

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ తన యొక్క జీవితాన్ని తెలంగాణ సాధన కోసం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. కొత్తపల్లి జయశంకర్‌ తన విద్యార్థి దశ నుండే (1952) ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించినారు. ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ వరంగల్‌ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో 06 అగస్టు 1934 న మహాలక్ష్మి - లక్ష్మికాంతారావు దంపతులకు జన్మించారు. 

ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ పాఠశాల విద్యను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి హైస్కూల్‌లో చదివారు. తన యొక్క ఇంటర్మిడియట్‌ మరియు డిగ్రీలను వరంగల్‌లో పూర్తి చేశారు. ఎం.ఎ ఎకనామిక్స్‌  లో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు. హైద్రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి పూర్తి చేశారు. 

ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ ఉపాధ్యాయ వృత్తితో జీవనం ప్రారంభించిన తర్వాత చందా కాంతయ్య మెమోరియల్‌ డిగ్రీ కళాశాల, వరంగల్‌కు ప్రధాన ఆచార్యులుగా, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారేన్‌ లాంగ్వేజేస్‌ రిజిస్ట్రార్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రర్‌గా, ఉపకులపతిగా పనిచేశారు. 


Also Read :

తెలంగాణవాది అయిన ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1952లో ఫజల్‌ అలీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రాల పునవ్యవస్థీకరణ కమీషన్‌ ప్రజల అభిప్రాయ సేకరణకు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ హైద్రాబాద్‌కు వచ్చినప్పుడు కమీషన్‌కు నివేదిక సమర్పించిన విద్యార్థి బృందంలో కీలకవ్యక్తిగా వ్యవహరించారు. 

ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ తెలంగాణ సాధన కోసం ఎంతో పోరాటం సాగించారు. 1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తెలంగాణ విద్య, ఉద్యోగ, సాంస్కృతిక పరంగా ఎదుర్కుంటున్న సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. తెలంగాణ వెనుకబడడానికి ఆంధ్రా వారి ఆధిపత్య ధోరణి కారణమని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. 

1996 సంవత్సరంలో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్దాంతకర్తగా వ్యవహరించారు. ప్రామాణికమైన, నమ్మకమైన తన గణాంకాలతో తెలంగాణ ఎదుర్కొంటున్న వివక్షతలను వివిధ ప్రసాదమాద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 

తెలంగాణ ఉద్యమం ‘భావజాల వ్యాప్తి’ ‘ వివిధ రూపాలలో కొనసాగే ఉద్యమాలు, ఆందోళనలు’, ‘రాజకీయ ప్రక్రియ’ వంటి మూడు రూపాలలో కొనసాగాలని జయశంకర్‌ భావించారు. తెలంగాణ సాకరమయ్యే వరకు భావజాల వ్యాప్తికి ఆచార్య జయశంకర్‌గారు అద్వితీయమైన కృషి చేశారు. వీరి భావాలతో ప్రభావితమైన విద్యార్థి సంఘాలు, వృత్తి సంఘాలు, రాజకీయ పార్టీలు, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆందోళనలు చేపట్టడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆశించిన విధంగానే 02 జూన్‌ 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. దురదృష్టవశాత్తు తన కల సాకారం కాకుండానే అనారోగ్య కారణంగా 21 జూన్‌ 2011 రోజున మరణించాడు. 

ప్రొఫెసర్‌ అచార్య జయశంకర్‌ జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయమని పేరు పెట్టడం జరిగింది. మరియు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒకదానికి జయశంకర్‌ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. 


Also Read :

Post a Comment

0 Comments