విజయనగర సామ్రాజ్యం జీకే ప్రశ్నలు - జవాబులు
Vijayanagar Dynasty Gk Questions and Answers Part - 2
☛ Question No.11
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో వంశం ఏది ?
ఎ) అరవీటి
బి) తులువ
సి) సాలువ
డి) సంగమ
జవాబు : సి) సాలువ
☛ Question No.12
కందుకూరి రుద్రకవి ఎవరి ఆస్థానానికి చెందనవారు ?
ఎ) అబ్దుల్లా కుతుబ్ షా
బి) ఇబ్రహీం కుతుబ్ షా
సి) మహ్మద్ కులీ కుతుబ్ షా
డి) హసన్ గంగూ
జవాబు : సి) మహ్మద్ కులీ కుతుబ్ షా
☛ Question No.13
అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడు ఎవరు ?
ఎ) నంది తిమ్మన్న
బి) తెనాలి రామకృష్ణుడు
సి) అల్లసాని పెద్దన
డి) కాళిదాసు
జవాబు : సి) అల్లసాని పెద్దన
☛ Question No.14
అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు ఏరాజు కాలంలో విజయ నగరం సామ్రాజ్యాన్ని సందర్శించారు ?
ఎ) రెండో దేవరాయలు
బి) అచ్యుతరాయలు
సి) శ్రీ కృష్ణదేవరాయలు
డి) హరిహరరాయలు
జవాబు : ఎ) రెండో దేవరాయలు
☛ Question No.15
విజయనగర రాజుల్లో ప్రసిద్ది చెందిన రాజు ఎవరు ?
ఎ) రెండో వెంకపతిరాయలు
బి) అళియరామరాయలు
సి) శ్రీ కృష్ణదేవరాయలు
డి) రెండో దేవరాయలు
జవాబు : సి) శ్రీ కృష్ణదేవరాయలు
Also Read :
☛ Question No.16
విజయనగర రాజుల కాలంలోని అమరనాయంకర విధానానికి సంబంధించి సరికానిది ఏది ?
ఎ) వీరు కోటలను, సాయుధ దళాలను నియంత్రిస్తారు.
బి) అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు
సి) అమర నాయకులను తరచుగా బదిలీలు చేస్తుంటారు.
డి) పైవన్నీ
జవాబు : సి) అమర నాయకులను తరచుగా బదిలీలు చేస్తుంటారు.
☛ Question No.17
విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు ?
ఎ) హరిహర రాయలు
బి) బుక్కరాయలు
సి) రెండో దేవరాయలు
డి) ఎ మరియు బి
జవాబు : డి) ఎ మరియు బి
☛ Question No.18
ఈ క్రింది వారిలో ఎవరిని ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అంటారు ?
ఎ) అన్నమాచార్యులు
బి) తెనాలి రామకృష్ణ
సి) పింగళి సూరన
డి) అల్లసాని పెద్దన
జవాబు : డి) అల్లసాని పెద్దన
☛ Question No.19
దేశభాషలందు తెలుగు లెస్స అని తెలిపిన వ్యక్తి ఎవరు ?
ఎ) గణపతి దేవుడు
బి) శ్రీకృష్ణదేవరాయలు
సి) రెండో ప్రతాపరుద్రుడు
డి) రెండో చంద్రగుప్త
జవాబు : బి) శ్రీకృష్ణదేవరాయలు
☛ Question No.20
ఈ క్రింది ఏ రాజ్యం ఫిరంగి దళాన్ని తమ సైన్యంలో కల్గి ఉంది ?
ఎ) పశ్చిమ చాళుక్య రాజ్యం
బి) రాష్ట్రకుట రాజ్యం
సి) కాకతీయ రాజ్యం
డి) విజయనగర సామ్రాజ్యం
జవాబు : డి) విజయనగర సామ్రాజ్యం
0 Comments