
ప్రపంచంలోని 7 వింతలు (2023)
Gk in Telugu || General Knowledge in Telugu
Gk ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ప్రపంచంలో అందరిని ఆశ్చరపరిచే 7 వింతలు
- గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (చైనా)
- చిచెన్ ఇట్జా (మెక్సికో)
- పెట్రా (జోర్డాన్)
- మచుపిచ్చు (పెరూ)
- క్రైస్ట్ ది రిడీమర్ (బ్రెజిల్)
- కొలోసియం (ఇటలీ)
- తాజ్‌మహాల్ (ఇండియా)
1) గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (చైనా)
ఇది ఉత్తర చైనా నుండి పడమర వరకు విస్తరించి ఉంది. ఇది సుమారు 7వ శతాబ్దం బిసిలో క్విన్, మింగ్ రాజవంశానికి చెందిన వారు నిర్మించారు.
2) చిచెన్ ఇట్జా (మెక్సికో)
ఇది మెక్సికో దేశంలో నిర్మించబడిరది. ఇది ఒక మాయన్ నగరం. ప్రధాన ప్లాజా నుండి 79 అడుగుల ఎత్తులో పిరమిడ్ ఆకారంలో సౌర సంవత్సరాన్ని సూచించే 365 మెట్లతో నిర్మించబడిరది.
3) పెట్రా (జోర్డాన్)
పెట్రాను క్రీ.పూ 5వ శతాబ్దంలో నబాటియన్లు నిర్మించారు. ఇది జోర్డాన్ యొక్క దక్షిణ భాగంలో ఉంది. పెట్రా రాతిరంగులో ఉండడం వల్ల దీనిని రోజ్‌సిటీ అని కూడా పిలుస్తారు.
4) మచుపిచ్చు (పెరూ)
ఇది దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో కలదు. దీనిని ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శిస్తున్నారు. దీనిని 1450లో చక్రవర్తి పచాకుటి నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. దీనిని అమెరికన్ అయిన హిరామ్ బింగ్‌హామ్ చేత కనుగొనబడిరదని ప్రజల విశ్వాసం.
5) క్రైస్ట్ ది రిడీమర్ (క్రీస్తు విమోచకుడు)
దీనిని బ్రెజిల్ దేశంలోని రియోడి జనీరోలో నిర్మించారు. ఇది 98 అడుగుల పొడవు, 26 అడుగు పొడవై పీఠంతో నిర్మించారు. ఇది ఆర్ట్ డెకో శైలిలో తీర్చిదిద్దిన అతిపెద్ద శిల్పంగా పేరుగాంచింది.
6) కొలోసియం
ఇది ఇటలీలోని రోమ్‌లో ఉంది. దీనిని ప్లావియన్ యాంఫీతియేటర్ అని కూడా పిలుస్తారు. దీనిని ఇసుక మరియు కాంక్రిటుతో నిర్మించారు.
7) తాజ్‌మహాల్
ఇది ఇండియాలో చక్రవర్తి షాజహన్ నిర్మించాడు. దీనిని 1632-1653 మద్య నిర్మించారు. మొఘల్ చక్రవర్తి షాజహన్ తన భార్య ముంతాజ్‌మహాల్‌కు దీనిని అంకితం చేశాడు.
Related Posts :
2) Australia Continent in Telugu
0 Comments