AFCAT in Telugu || ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ || Latest Jobs in Telugu

 రక్షణ రంగంలో అత్యున్నత హోదాను అందించే ఉద్యోగాల్లో ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ఒకటి. ఈ పరిక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు వాయుసేనలో ఉద్యోగాలు పొందవచ్చు. ప్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో రాణించవచ్చు. 

ఏఎఫ్‌ క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి శిక్షణను ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎంపికైన ఉద్యోగార్థులకు లక్షకు పైగా వేతనం ఉంటుంది. 

➺ పోస్టుల వివరాలు :

మొత్తం  పోస్టులు 317 ఉన్నాయి. 

➺ ప్లయింగ్‌ బ్రాంచ్‌, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ :

అర్హత 

  • డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి 
  • ఇంటర్‌లో  మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి 
  • ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికేట్‌ ఉండాలి 

వయస్సు 

  • 01 జనవరి 2025 నాటికి 20 నుండి 24 సంవత్సరాల లోపు ఉండాలి 


➺ గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌ :

  • ఇందులో ఏరోనాటికల్‌ (ఎలక్ట్రానిక్స్‌ / మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. 

అర్హత 

  • సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీలలో 60 శాతం మార్కులతో బీటెక్‌ / బీఈలో ఉత్తీర్ణత సాధించాలి 
  • ఇంటర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లో 60 శాతం మార్కులు సాధించాలి 

➺ గ్రౌండ్‌ డ్యూటీ  - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌ :

  • ఇందులో వెపన్‌ సిస్టం, అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌, అకౌంట్స్‌, ఎడ్యూకేషన్‌, మెటియోరాలజీ పోస్టులున్నాయి. 
  • వెపన్‌ సిస్టమ్‌కు ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లతో 50 శాతం మార్కులతో  పాటు డిగ్రీలో 60 శాతం ఉండాలి 
  • అడ్మినిస్ట్రేటీవ్‌, లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ  ఉండాలి. 
  • అకౌంట్స్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం / బీబీఏ / సీఏ/ సీఎంఏ / సీఎస్‌ / సీఎప్‌సీ/ బీఎస్సీ (ఫైనాన్స్‌) పూర్తి చేయాలి 
  • ఎడ్యూకేషన్‌ పోస్టులకు ఏదైనా పీజీలో 50, యూజీలో 60 శాతం మార్కులు ఉండాలి. 
  • మెటియోరాలజీ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లతో 60 శాతం మార్కులు లేదా నిర్ధేశిత బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌ / బీఈ ఉండాలి 

వయస్సు 

  • గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు 01 జనవరి 2025 నాటికి 20 నుండి 26 సంవత్సరాలుండాలి.

➺ ధరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌ 

➺ సబ్జెక్టులు :

  • జనరల్‌ అవేర్‌నేస్‌ 
  • ఇంగ్లీష్‌ 
  • న్యూమరికల్‌ ఎబిలిటీ 
  • రిజనింగ్‌, మిలటరీ అప్టిట్యూడ్‌ 
  • ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్టు 

➺ ఫీజు :

  • రూ॥550/- తోపాటు gst అదనం 

➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది :

  • 30 డిసెంబర్‌ 2023

➺ పరీక్షలు తేదీలు :

  • 16, 17, 18 ఫిబ్రవరి 2024 


Also Read :

Post a Comment

0 Comments