History in Telugu | Inscriptions in Telugu | శాసనాలు | Indian History in Telugu

History in Telugu | Inscriptions in Telugu | శాసనాలు

శాసనాలు 
Indian History in Telugu | Telangana History in Telugu 

History in Telugu : 


     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

రాజులు, రాజకుటుంబాలు, మంత్రులు, సైన్యాధ్యక్షులు తమ కాలంలో జరిగిన విషయాలను తెలియజేయడానికి వివిధ శాసనాలు వేయించడం జరిగింది. 


1) నాసిక్‌ శాసనం :

గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ ఈ శాసనాన్ని లిఖించింది. ఈ శాసనంలో గౌతమీ పుత్ర శాతకర్ణీ యొక్క విజయాలు, బిరుదుల గురించి వేయడం జరిగింది. ఈ శాసనంలో శాతకర్ణి త్రి సముద్ర తోయ పీతవాహన, ఏక బ్రహ్మణునిగా సంబోదించడం జరిగింది. 


2) నానాఘాట్‌ శాసనం :

మొదటి శాతకర్ణి విజయాలను నానాఘాట్‌ శాసనం వివరించడం జరిగింది. అతని భార్య నాగానిక నానాఘాట్‌ శాసనాన్ని వేయించింది. మొదటి శాతకర్ణి యొక్క రెండు అశ్వమేధాలు, ఒక రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనంలో వెల్లడించండం  జరిగింది. 


3) ఐహోల్‌ శాసనం :

2వ పులకేశి విజయాల గురించి ఐహోల్‌ శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని రవికీర్తి లిఖించాడు. హర్షుని 2వ పులకేశి ఓడించినట్లు ఈ శాసనంలో పేర్కొనబడిరది. 


4) హాథిగుంపాశాసనం :

ప్రాకృతిక భాషలో రచించబడిన హాథిగుంపా శాసనం కళింగ చక్రవర్తి ఖారవేలుడు వేయించాడు. ఈ శాసనంలో కళింగ చక్రవర్తి ఖారవేలుని విజయాల గురించి తెలిజేస్తుంది. ఖారవేలుడు దిగ్విజయ సూచకంగా రాజసూయ యాగం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. 


5) భట్టిప్రోలు శాసనం : 

భట్టిప్రోలు శాసనాన్ని కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి తెలుపుతుంది. 


6) కలమళ్ల శాసనం : 

కలమళ్ల శాసనాన్ని ధనంజయుడు వేయించాడు. 


7) సారనాథ్‌ శాసనం (స్తంభ శాసనం) :

అశోకుడు వేయించాడు. ఈ స్తంభ శాసనంలో ఉన్నటువంటి సింహతలాటాన్ని జాతీయ చిహ్నం గా భారత ప్రభుత్వం స్వీకరించింది. 


8) కొల్లేరు శాసనం :

కొల్లేరు శాసనాన్ని శాలంకాయనుల పరిపాలనా విధానాన్ని తెలియజేస్తుంది. 


9) కన్హేరి, కార్లే శాసనాలు : 

ఈ శాసనం శాతవాహన సామ్రాజ్యం యొక్క వాస్తు, కళానైపుణ్యం గురించి వివరిస్తుంది. 


10) వేల్పూరు శాసనం : 

వేల్పూరు శాసనాన్ని మాదవశర్మ వేయించాడు. ఇది విష్ణుకుండినుల సామ్రాజ్యం గురించి తెలియజేస్తుంది. 


11) మైదవోలు శాసనం : 

ఇందులో పల్లవ రాజు అయిన శివస్కందవర్మ వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. 


12) మ్యాకధోని శాసనం : 

శాతవాహనుల యొక్క రాజ్య పతనం గురించి వివరిస్తు 3వ పులోమావి మ్యాకధోని శాసనాన్ని వేయించాడు. 



Also Read :


13) అలహాబాద్‌ ప్రశస్తి (స్తంభ శాసనం) : 

ఈ శాసనాన్ని హరిసేనుడు రచించాడు. ఇది సముద్ర గుప్తుని సైనిక విజయాల గురించి వివరిస్తుంది. 


14) మంచికల్లు శాసనం : 

పల్లవ రాజు సింహవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం. ఇది సింహవర్మ గురించి తెలియజేస్తుంది. 


15) జూనాఘడ్‌ శాసనం : 

దీనిని రుద్రదమనుడు వేయించాడు. 


16) ఉత్తర్‌ మేరూర్‌ శాసనం : 

దీనిని చోళరాజైన మొదటి పరాంతకుడు వేయించాడు. చోళుల గ్రామీణ పరిపాలనా వ్యవస్థ గురించి ఈ శాసనం వివరిస్తుంది. 


17) ఖాజీపేట శాసనం : 

ఖాజీపేట శాసనాన్ని మొదటి బేతరాజు లిఖించాడు. కాకతీయ సామ్రాజ్య రాజ్యస్థాపన, విజయాలు గురించి తెలుపుతుంది. 


18) బయ్యారం చెరువు శాసనం : 

గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది. కాకతీయుల తొలి చరిత్రను తెలుపుతుంది. 


19) విప్పర్ల శాసనం : 

జయసింహ వల్లభుడు వేయించాడు. చాళుక్య వంశ వివరాలు కలవు. 


20) సందంపూడి శాసనం : 

సంస్కృత ఆంధ్రభాషలో నన్నయ భట్టు రచించిన ఈ శాసనాన్ని రాజరాజనరేంద్రుడు వేయించాడు. 


21) చేజేర్ల శాసనం : 

కందరుడు వేయించాడు. ఇందులో కందరుని విజయాలు గురించి తెలుపుతుంది. 


22) శనిగరం శాసనం : 

ప్రోలరాజు గురించి శనిగరం శాసనం ఇందులో లిఖించడం జరిగింది. 


Also Read :

Post a Comment

0 Comments