
భూమి - సహజ ఆవరణములు Indian Geography in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భూమిపై నాలుగు రకాల ఆవరణాలు ఆవరించి ఉన్నాయి. అవి..
- శిలావరణం
- జలావరణం
- వాతావరణం
- జీవావరణం
1) శిలావరణం / లితోస్పియర్ :
భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పైపొరే శిలావరణం అంటారు. ఈ శిలావరణం రాళ్లు, ఖనిజ లవణాలతో కూడి ఉంటుంది. ఈ ఆవరణం చదునుగా ఉండదు. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాథాలతో మిళితమై ఉంటుంది. సూర్యకిరణాలు పడి ఈ శిలావరణం వేడెక్కుతుంది. చల్లబడిన తర్వాత గాలినీ, నీటినీ ప్రభావితం చేస్తుంది. ఈ గట్టిపొరలో ఉండే రాళ్లనీ, మట్టినీ, ఇతర వస్తువులను మన నిత్య జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించుకుంటాము.
2) జలావరణం / హైడ్రోస్పియర్ :
నీటితో కూడుకున్న ప్రాంతాన్ని జలావరణం అంటారు. వివిధ రకాలుగా వచ్చిన నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి జలావరణంలో ఉంటాయి. నీటిలో కొంతభాగం భూమి లోపలిపొరల్లో రాళ్లమధ్య ఉంటుంది.
3) వాతావరణం / అట్మాస్పియర్ :
భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఈ వాతావరణంలో ప్రాణవాయువు, నత్రజని, బొగ్గుపులుసు వాయువు, నీటి ఆవిరి, ధూళి కణాలు వంటి అనేక వాయువులు మిళితమై ఉంటుంది.
4) జీవావరణం / బయోస్పియర్ :
గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. జీవం మనుగడకు శిలావరణం, జలావరణం, వాతావరణం మూడు అవసరము. అంటే మూడు సహజ ఆవరణాలు కలిసిన చోట జీవం ఉంటుంది. జీవం తిరిగి ఈ మూడు మండలాలను ప్రభావితం చేస్తుంది. ఈ నాలుగు ఆవరణాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
0 Comments