
బంగ్లాదేశ్ వార్ - భారతదేశం పాత్ర
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
1970లో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ పాకిస్తాన్ తమపై సవతితల్లి ప్రేమ కనపచటంపై నిరసనలు చెలరేగాయి. తమ బెంగాలీ ఆస్థిత్వాన్ని చాటుకోవడానికి ఉద్యమాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలలో షేక్ ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది. కానీ అతడిని అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్‌కి తీసుకెళ్లారు. తూర్పు పాకిస్తాన్‌లో సైనిక అణచివేత కాలం మొదలైంది. అక్కడ నుండి తరలివచ్చిన లక్షలాది కాందిశీకులకు భారతదేశం వసతి కల్పించి ఆహారాన్ని అందించాల్సి వచ్చింది. ఈలోగా బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం మొదలైంది. దీంట్లో భారతదేశ సహాయాన్ని కోరారు. 1971లో భారతదేశం - పాకిస్తాన్‌ల మధ్య యుద్దం మొదలైంది. భారతదేశం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకొని బంగ్లాదేశ్‌కు విముక్తి సాధించి, స్వతంత్ర దేశంగా ఏర్పడేలా చర్యలు తీసుకుంది. భారతదేశం తన సైనిక బలాన్ని పెంచుకోవడం వల్లనే కాకుండా అలీన దేశంగా తన స్థితిని నైపుణ్యంతో ఉపయోగించుకొని రెండు అగ్రరాజ్యాలు యుద్దంలో జోక్యం చేసుకోకుండా వ్యూహం రచించింది.
0 Comments