Indian History Gk Questions in Telugu Part - 1 || ఇండియన్‌ హిస్టరీ జీకే ప్రశ్నలు - జవాబులు Part - 1

Indian History Gk Questions in Telugu  Part - 1

ఇండియన్‌ హిస్టరీ జీకే ప్రశ్నలు - జవాబులు

Indian History MCQ quiz in Telugu || Indian History Gk Questions with Answers Part - 1

    Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది

☛ Question No.1
మౌర్య సామ్రాజ్యం గురించి తెలిపే ప్రధాన ఆధారాలు ఏవి ?
ఎ) అశోకుడి శాసనాలు
బి) మొగస్తనీస్‌ ఇండికా
సి) కౌటిల్యుడి అర్థశాస్త్రం
డి) పైవన్నీ ‌

జవాబు : డి) పైవన్నీ

☛ Question No.2
మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చవ్రర్తి ఎవరు ?
ఎ) రెండో చంద్రగుప్తుడు
బి) అశోకుడు
సి) బిందుసారుడు
డి) చంద్రగుప్త మౌర్యుడు ‌

జవాబు : డి) చంద్రగుప్త మౌర్యుడు

☛ Question No.3
అశోకుడిని ధర్మం వైపు పయనించేలా చేసిన యుద్దం ?
ఎ) జీలం నది యుద్దం
బి) కళింగ యుద్దం
సి) పానిపట్టు యుద్దం
డి) ఉజ్జయిని యుద్దం

జవాబు : బి) కళింగ యుద్దం

☛ Question No.4
అశోకుడు నియమించిన ధర్మమహామాత్రుల విధి ?
ఎ) ప్రజా సమస్యలను పరిష్కరించడం
బి) ధర్మాన్ని ప్రచారం చేయడం
సి) ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం
డి) బౌద్ధమతాన్ని ప్రచారం చేయడం ‌

జవాబు : బి) ధర్మాన్ని ప్రచారం చేయడం

☛ Question No.5
కిందివారిలో శకయుగ ప్రారంభకులు ?
ఎ) పులోమావి
బి) బిందుసారుడు
సి) కనిష్కుడు
డి) అశోకుడు

జవాబు : సి) కనిష్కుడు

☛ Question No.6
మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనానికి సంబంధించి కిందివాటిలో సరికానిది ?
ఎ) ఇది ఇప్పటివరకు తుప్పు పట్టలేదు
బి) దీని ఎత్తు 2 మీటర్లు మాత్రమే
సి) ఇది ఢల్లీిలోని కుతుబ్‌మినార్‌ ప్రాంతంలో ఉంది
డి) దీన్ని రెండో చంద్రగుప్తుడు వేయించాడు

జవాబు : బి) దీని ఎత్తు 2 మీటర్లు మాత్రమే

☛ Question No.7
గుప్తులు ఏ ప్రాంతంలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు ?
ఎ) ఎరాన్‌
బి) బిటర్‌గాం
సి) దియోగర్‌
డి) అన్నీ

జవాబు : డి) అన్నీ


Also Read :

☛ Question No.8
ఇండియన్‌ నెపోలియన్‌ అని ఎవరిని పిలుస్తారు ?
ఎ) గౌతమిపుత్ర శాతకర్ణి
బి) బింబిసారుడు
సి) రెండో చంద్రగుప్త
డి) సముద్రగుప్తుడు ‌ ‌

జవాబు : డి) సముద్రగుప్తుడు

☛ Question No.9
ఈ క్రిందివాటిల్లో కుషాణుల్లో గొప్పవాడు ఎవరు ?
ఎ) డెమిట్రియన్‌
బి) మినాండర్‌
సి) కనిష్కుడు
డి) కుజుల్‌కాడ్‌ పైసిస్‌

జవాబు : సి) కనిష్కుడు

☛ Question No.10
గుప్తుల కాలంలో ప్రసిద్ది చెందిన రాజకీయ విధానం ?
ఎ) బ్రాహ్మణులకు పూర్తి పరిపాలన అధికారాలతో గ్రామాలను ఇవ్వడం
బి) గుప్తులు తమతో ఓడిన రాజులను తిరిగి కొనసాగించడం
సి) ఎ మరియు బి మాత్రమే
డి) ఏదీకాదు

జవాబు : సి) ఎ మరియు బి మాత్రమే

☛ Question No.11
నవరత్నాలు అని పిలిచే గొప్ప పండితులు ఎవరి ఆస్థానానికి చెందినవారు ?
ఎ) కుమార గుప్త
బి) చంద్రగుప్త
సి) సముద్రగుప్తుడు
డి) రెండో చంద్రగుప్తుడు

జవాబు : డి) రెండో చంద్రగుప్తుడు

☛ Question No.12
మ్యాకదోని శాసనం ఏ శాతవాహన రాజు పరిపాలన కాలంలో వేశారు ?
ఎ) హాలుడు
బి) యజ్ఞశ్రీ శాతకర్ణి
సి) గౌతమీపుత్ర శాతకర్ణి
డి) మూడో పులోమావి

జవాబు : డి) మూడో పులోమావి

☛ Question No.13
శకయుగం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ?
ఎ) క్రీ.పూ.78
బి) క్రీ.శ 320
సి) క్రీ.శ.610
డి) క్రీ.శ 78

జవాబు : ఎ) క్రీ.పూ.78

☛ Question No.14
ఇక్ష్వాకుల రాజధాని ఏది ?
ఎ) అమరావతి
బి) కోటిలింగాల
సి) విజయపురి
డి) నాగార్జున కొండ

జవాబు : సి) విజయపురి

☛ Question No.15
శాతవాహనుల కాలంలో వ్యాపారం ఏ దేశంతో అధికంగా జరిగేది ?
ఎ) సుమిత్ర
బి) మలయా
సి) శ్రీలంక
డి) రోమ్‌

జవాబు : డి) రోమ్‌



Related Posts :


Also Read :

Post a Comment

0 Comments