
ఇండియన్ పాలిటీ (న్యాయవ్యవస్థ) జీకే ప్రశ్నలు - జవాబులు
Indian Polity Gk Questions and Answers in Telugu
☛ Question No.1
వరకట్నం తీసుకోవడం అనే అంశం కిందివాటిలో ఏ నేర పరిధిలోకి వస్తుంది ?
ఎ) పౌర శిక్షాస్మృతి
బి) సివిల్
సి) క్రిమినల్
డి) బి మరియు సి
జవాబు : సి) క్రిమినల్
☛ Question No.2
ఈ క్రిందివాటిలో దేనిలో నష్టం జరిగితే న్యాయస్థానంలో దావావేసే అవకాశం ఉంటుంది ?
ఎ) నేరశిక్షాస్మృతి
బి) పౌరచట్టం
సి) నేరచట్టం
డి) బి మరియు సి
జవాబు : బి) పౌరచట్టం
☛ Question No.3
ఈ కిందివాటిలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో సరికానిది ఏది ?
ఎ) డిఎస్పీని సంభోదిస్తు ఫిర్యాదు చేయాలి
బి) సాక్షుల పేర్లు
సి) నేరం జరిగిన తేది, స్థలం
డి) ఫిర్యాదు వివరాలు
జవాబు : ఎ) డిఎస్పీని సంభోదిస్తు ఫిర్యాదు చేయాలి
☛ Question No.4
పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్‌వల్ అఫెన్‌సెస్) కేసులను విచారించే అధికారం ఎవరికి ఉంటంది ?
ఎ) హైకోర్టు
బి) జిల్లా కోర్టు
సి) బాలల కోర్టు
డి) సెషన్స్ కోర్టు
జవాబు : సి) బాలల కోర్టు
☛ Question No.5
భారతదేశంలో మద్రాసు, బాంబే, కలకత్తా హైకోర్టులు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి ?
ఎ) 1793
బి) 1726
సి) 1862
డి) 1861
జవాబు : సి) 1862
☛ Question No.6
తెలంగాణలో హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 01 జనవరి 2019
బి) 01 జనవరి 2015
సి) 01 జనవరి 2018
డి) 01 జనవరి 2017
జవాబు : ఎ) 01 జనవరి 2019
☛ Question No.7
భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 30 జనవరి 1955
బి) 28 జనవరి 1950
సి) 01 ఫిబ్రవరి 1961
డి) 01 ఫిబ్రవరి 1962
జవాబు : బి) 28 జనవరి 1950
Also Read :
☛ Question No.8
భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన హైకోర్టు ఏది ?
ఎ) ఢిల్లీ
బి) బాంబే
సి) అలహాబాద్
డి) కలకత్తా
జవాబు : డి) కలకత్తా
☛ Question No.9
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మొట్టమొదటగా పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
ఎ) జాన్‌హైడ్
బి) మారిస్ గ్వేయర్
సి) సర్ ఎలిజాఇంఫే
డి) హెచ్.జె. కానియా
జవాబు : డి) హెచ్.జె. కానియా
☛ Question No.10
ఎఫ్.ఐ.ఆర్ (తొలి సమాచార నివేదిక)ను ఎవరు రూపొందిస్తారు ?
ఎ) పబ్లిక్ ప్రాసిక్యూటర్
బి) డిఎస్పీ
సి) రైటర్
డి) ఎస్.హెచ్.వో
జవాబు : సి) రైటర్
☛ Question No.11
ఒకవేళ కేసును తీసుకోవడానికి ఎస్‌హెచ్‌వో తిరస్కరిస్తే ఎవరికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది ?
ఎ) సీఐ
బి) మెజిస్ట్రేట్
సి) డిఎస్పీ
డి) బి మరియు డి
జవాబు : డి) బి మరియు డి
☛ Question No.12
ఈ క్రిందవాటిలో క్రిమినల్ నేరాలకు సంబంధించని అంశం ఏమిటీ ?
ఎ) అద్దె కట్టకపోవడం
బి) వరకట్నం తీసుకోవడం
సి) దోపిడి
డి) దొంతనం
జవాబు : ఎ) అద్దె కట్టకపోవడం
☛ Question No.13
హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత ?
ఎ) 70 సంవత్సరాలు
బి) 62 సంవత్సరాలు
సి) 65 సంవత్సరాలు
డి) 60 సంవత్సరాలు
జవాబు : బి) 62 సంవత్సరాలు
☛ Question No.14
సూప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత ?
ఎ) 70 సంవత్సరాలు
బి) 62 సంవత్సరాలు
సి) 65 సంవత్సరాలు
డి) 60 సంవత్సరాలు
జవాబు : సి) 65 సంవత్సరాలు
☛ Question No.15
నేరతీవ్రత, సాక్షులను బెదిరంచడానికి ఉన్న అవకాశం ఆధారంగా బెయిల్ మంజూరు చేస్తారు. కింది వారిలో బెయిల్ ఎవరి హక్కుగా ఉంటుంది ?
ఎ) సాక్షులు
బి) నిందితుడు
సి) ఫిర్యాదుదారుడు
డి) పైవారందరూ
జవాబు : బి) నిందితుడు
Related Posts :
Indian Polity (Judiciary) Gk Questions Part - 2
0 Comments