
సిపాయిల తిరుగుబాటు జీకే ప్రశ్నలు - జవాబులు
Indian History (Indian Rebellion of 1857) MCQ Quiz Part - 2
☛ Question No.1
సిపాయిల తిరుగుబాటు సమయంలో చివరిగా పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ?
ఎ) ఔరంగజేబు
బి) బహదూర్ షా - 2
సి) అక్బర్ - 2
డి) షాజహాన్ - 2
జవాబు : బి) బహదూర్ షా - 2
☛ Question No.2
ఝాన్సీలో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన భారతీయ సైనికుల నాయకుడు ఎవరు ?
ఎ) రాణి పద్మిని
బి) రాణి లక్ష్మీబాయి
సి) రాణి దుర్గావతి
డి) రాణి అహల్యబాయి
జవాబు : బి) రాణి లక్ష్మీబాయి
☛ Question No.3
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్ర ఏమిటీ ?
ఎ) ఆమె బ్రిటీషు మిత్రురాలు
బి) ఆమె ఝాన్సీ అనే ప్రాంతంలో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది
సి) ఆమె బ్రిటిష్ మరియు భారతీయ తిరుగుబాటుదారుల మధ్య మధ్యవర్తిగా పనిచేసింది
డి) ఆమె బ్రిటిషు గూఢచారి
జవాబు : బి) ఆమె ఝాన్సీ అనే ప్రాంతంలో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది
☛ Question No.4
1857 తిరుగుబాటు ప్రారంభ సమయంలో భారతదేశానికి చెందిన బ్రిటిషు గవర్నర్ జనరల్ ఎవరు ?
ఎ) లార్డ్ కానింగ్
బి) లార్డ్ కర్జన్
సి) లార్డ్ డల్హౌసీ
డి) లార్డ్ కార్న్‌వాలిస్
జవాబు : ఎ) లార్డ్ కానింగ్
☛ Question No.5
లక్నో ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?
ఎ) అవంతీ బాయి
బి) హజరత్ మహల్
సి) లక్ష్మీబాయి
డి) పైవారంతా
జవాబు : బి) హజరత్ మహల్
☛ Question No.6
ఈ క్రిందివాటిలో సిపాయిల తిరుగుబాటు జరిగిన ప్రాంతం, ఆ ప్రాంత నాయకుడికి సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి ?
ఎ) పైజాబాద్ - మౌల్వీ అహ్మదుల్లా
బి) బరేలి - భక్త్ ఖాన్
సి) హైదరాబాద్ - తుర్రేబాజ్ ఖాన్
డి) కాన్పూర్ - తాంతియా తోపే
జవాబు : డి) కాన్పూర్ - తాంతియా తోపే
☛ Question No.7
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో అరెస్టు కాబడి 1859లో ఉరిశిక్షకు గురై మరణించిన వ్యక్తి ఎవరు ?
ఎ) నానాసాహేబ్
బి) తుర్రెబాజ్‌ఖాన్
సి) కున్వర్ సింగ్
డి) తాంతియా తోపే
జవాబు : డి) తాంతియా తోపే
Also Read :
☛ Question No.8
సిపాయిల తిరుగుబాటు సమయంలో ప్రజా తిరుగుబాటు అనడానికి ముఖ్య కారణం దేనిని చెప్పవచ్చు ?
ఎ) సిపాయిల తిరుగుబాటులో భారతీయులు ఐక్యంగా పోరాడటం
బి) సిపాయిల తిరుగుబాటులో భారతీయులు విజయం సాధించడం
సి) సిపాయిలు ప్రధాన పాత్ర పోషించడం
డి) భారతీయ రాజులు, రాణులు ప్రత్యక్షంగా పాల్గొనడం
జవాబు : ఎ) సిపాయిల తిరుగుబాటులో భారతీయులు ఐక్యంగా పోరాడటం
☛ Question No.9
సిపాయిల తిరుబాటు సమయంలో నానాసాహెబ్ ఏ ప్రాంతానికి పారిపోయాడు ?
ఎ) పర్షియా
బి) అప్ఘాన్
సి) నేపాల్
డి) బర్మా
జవాబు : సి) నేపాల్
☛ Question No.10
బ్రిటిషు పాలను అంతం చేసి ఎవరి పాలనను తిరిగి తేవాలని సిపాయిలు నినాదాలు చేసారు ?
ఎ) నిజాం
బి) అవధ్
సి) మొఘల్
డి) పీష్వా
జవాబు : సి) మొఘల్
☛ Question No.11
‘భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం’ అనే గ్రంథాన్ని రాసినవారు ?
ఎ) సుఖ్‌దేవ్
బి) బిపిన్ చంద్రపాల్
సి) సావర్కర్
డి) భగత్‌సింగ్
జవాబు : బి) బిపిన్ చంద్రపాల్
☛ Question No.12
ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) సిపాయిల్లో అసంతృప్తి ఈ తిరుగుబాటు కారణం
బి) రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రభువులకు అసంతృప్తిని కల్గించింది
సి) సామాజిక సంస్కరణలు ఈ తిరుగుబాటుకు మరొక కారణం
డి) ప్రాంతీయ భాషా పత్రికలను నిషేదించడం కూడా ఈ తిరుగుబాటు కారణం
జవాబు : డి) ప్రాంతీయ భాషా పత్రికలను నిషేదించడం కూడా ఈ తిరుగుబాటు కారణం
☛ Question No.13
సిపాయిల తిరుగుబాటులో ప్రభు వర్గం పాల్గొనేందుకు ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) భూమిశిస్తు విధానలు
బి) సామాజిక సంస్కరణలు
సి) రాజ్య సంక్రమణ సిద్దాంతం
డి) సైన్య సహకార పద్దతి
జవాబు : సి) రాజ్య సంక్రమణ సిద్దాంతం
☛ Question No.14
బ్రిటిషు ప్రభుత్వం ఈస్ట్‌ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసినట్లు ప్రకటించిన సంవత్సరం ఏది ?
ఎ) 1857
బి) 1858
సి) 1861
డి) 1862
జవాబు : బి) 1858
☛ Question No.15
మంగళ్‌పాండేను కాల్చి చంపిన బ్రిటిషు అధికారి ఎవరు ?
ఎ) లారెన్స్
బి) బాగ్
సి) కాంప్‌బెల్
డి) హడ్సల్
జవాబు : డి) పైవన్నీ
0 Comments