
జ్యోతిబా పూలే Jyotiba Phule Biography in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
జ్యోతిబా పూలే 1827 లో మహారాష్ట్రలో జన్మించాడు. క్రైస్తవ మత బోధకులు ప్రారంభించిన పాఠశాలలో తన చదువు కొనసాగించాడు. జ్యోతిబా పూలే తన బ్రాహ్మణ మిత్రడు పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు చేసిన అవమానంతో అతని జీవితం మలుపు తిరిగింది. పెద్దయిన తర్వాత అతడు సమాజంలోని కుల వివక్షతపై తనదైన అభిప్రాయాలు ఏర్పరచుకొని ముందుకు సాగాడు. తాము మిగిలిన వాళ్లకంటే ఉన్నతులమన్న బ్రాహ్మణుల అభిప్రాయాలను వ్యతిరేకించాడు. శూద్రులు (శ్రామిక కులాలు), అతి శూద్రులు (అంటరాని వాళ్లు) కలిసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ‘సత్య శోధక్ సమాజ్’ అన్న సంస్థను జ్యోతిబాపూలే స్థాపించాడు. అంటరాని వాళ్లుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన బాలికల కోసం అతడు, అతని భార్య సావిత్రిబాయి పూలే ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. తన బందువుల నుండి సైతం వాళ్లు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దానికి వ్యతిరేకంగా ‘గులాంగిరి ’ వంటి ఎన్నో పుస్తకాలు రచించాడు. నిమ్నకులాల పిల్లల కోసం, నిమ్న కులాల టీచర్లే పాఠాలు చెప్పే ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు కోసం సత్య శోధక్ సమాజ్, పూలే ఉద్యమించారు. వ్యాసరచన, చర్చ, వక్తృత్వం వంటి అంశాలలో పోటీలు పెట్టి నిమ్నకులాల వాళ్లలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందేలా చేశారు. బ్రాహ్మణులు లేకుండా వివాహాలు, కర్మకాండలను నిర్వహించమని నిమ్న కులాలకు అతడు పిలుపునిచ్చాడు.
0 Comments