Savitribai Phule Biography in Telugu || సావిత్రిబాయి పూలే || || Gk in Telugu

 సావిత్రిబాయి పూలే 
Savitribai Phule Biography in Telugu 

Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

సావిత్రిబాయి పూలే 1831 సంవత్సరంలో మహారాష్ట్రంలోని సతారా జిల్లా, నయాగావ్‌ గ్రామంలో జన్మించింది. సావిత్రిబాయి పూలే భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు మహిళలు మరియు అట్టడుగు కులాల కోసం పనిచేసిన సంఘ సంస్కర్త. మహారాష్ట్రలోని మహిళల హక్కులను సాధించడంలో భర్త జ్యోతిబా పూలేతో పాటు సావిత్రిబాయి పూలే ముఖ్యమైన పాత్ర పోషించింది. 1848 సంవత్సరంలో పూణేలో ‘‘అంటరాని’’ కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించాడు. సావిత్రిబాయికి శిక్షణ ఇచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయినిగా చేశాడు. తక్కువ స్థాయి కులాల బాలికలకు చదువు చెప్పడం వల్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ సావిత్రిబాయి దానిని కొనసాగించింది. జ్యోతిరావు పూలే మరణించిన తర్వాత ‘‘సత్య శోధక్‌ సమాజ్‌’’ బాద్యతలను సావిత్రిబాయి చేపట్టింది. ఆమె సమావేశాలకు అధ్యక్షత వహించి కార్యకర్తలకు మార్గదర్శకం చేసింది. ప్లేగు మహమ్మారి బారిన పడిన ప్రజల కోసం సావిత్రిబాయి అహర్నిశలు పనిచేసింది. పేద పిల్లలకోసం శిబిరాలు నిర్వహించింది. ఈ మహమ్మారి కాలంలో ఆమె ప్రతి రోజు రెండు వేల మంది పిల్లలకు అన్నం వండి పెట్టింది. సావిత్రిబాయి పూలే 1897లో మరణించింది. 


Also Read :

Post a Comment

0 Comments