
గౌతమీపుత్ర శాతకర్ణి
Gautamiputra Satakarni Biography in Telugu
Telangana History in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల రాజ్యాన్ని పరిపాలించిన 23వ రాజు. శివస్వాతి - గౌతమి బాలశ్రీ ఇతని తల్లిదండ్రులు. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని లిఖించడం జరిగింది. ఈ శాసనంలో గౌతమి బాలశ్రీ యొక్క బిరుదు రాజర్షివధు అని పేర్కొనడం జరిగింది. ఇతను 24 సంవత్సరాలు పరిపాలన కొనసాగించినాడు. గౌతమీపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్పమాన వర్ధన, వర్ణసౌంకర్య నిరోధక, ఆగమనిలయ, విధివర్తిత, ధనుర్ధాయ, త్రిసముద్రత్రోయ సీతవాహన, శకయవన పహ్లావంశ నిరవశేషకర, చేనాటకస్వామి, క్షాత్రప / క్షహరాట వంశ నిర్మూలక, ద్విజకులవర్ధన, ఏకశూర, ఏకబ్రహ్మణ అనే బిరుదుల ఉన్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క సేనాని శివసేనుడు. ఇతని సమకాలీనుడుగా విదేశీ యాత్రికుడు టాలమి గుర్తింపు పొందాడు. క్రీ.శ 78 సంవత్సరంలో శకయుగమును ప్రారంభించినాడు. దీనినే శాలివాహన యుగంగా పేర్కొంటారు. దీనిని 1957 సంవత్సరంలో భారతదేశం గుర్తించింది. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఉత్తరాన రాజస్థాన్‌లోని పుష్కర్ వరకు, దక్షిణాన తమిళనాడులోని బనవాసి, పశ్చిమాన ఆరేబియా/వైజయంతి, తూర్పున కళింగ / బంగాళఖాతం వరకు విస్తరించింది.
గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో జోగల్‌తంబి / గోవర్దనహర యుద్దం జరిగింది. ఇది గౌతమీపుత్ర శాతకర్ణి మరియు నహపాణుడు మద్య జరిగింది. ఇట్టి యుద్దంలో నహపాణుడు ఓడిపోవడం జరిగింది. యుద్దం తర్వాత నహపాణుడు వద్ద నుండి 13,200 జోగల్ తండి నాణేలు అనే పేరు గల వెండి నాణేలు పొంది శాతకర్ణి పేరుమీద పునర్‌ముద్రితం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జునాఘడ్ శాసనంలో పేర్కొనడం జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణి అశ్రుక, నీలగిరి, అపరాంతం, బనరాసి, సౌరాష్ట్ర, ములక, అనూప, విదర్భ అనే ప్రాంతాలను జయించాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి కుమారుడు 2వ పులోమావి.
0 Comments