
ఆధునిక భారతదేశ చరిత్ర (బెంగాల్ విభజన, వందేమాతరం ఉద్యమం) జీకే ప్రశ్నలు - జవాబులు
Modern Indian Gk Questions in Telugu with Answers
☛ Question No.1
బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ ఎవరు ?
ఎ) లార్డ్ ఎల్జిన్ - 2
బి) లార్డ్ కర్జన్
సి) లార్డ్ మింటోల - 2
డి) లార్డ్ హార్జింగ్
జవాబు : బి) లార్డ్ కర్జన్
☛ Question No.2
బెంగాల్ విభజనకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన ప్రాతిపాదనను 1903లో చేశాడు.
2) వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజన చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
3) 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమం ప్రారంభం అయ్యింది.
4) 16 అక్టోబర్ 1905న లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను అమలులోకి తీసుకువచ్చాడు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
☛ Question No.3
బెంగాల్ విభజన తర్వాత కలకత్తా రాజధానిగా ఏర్పడిన పశ్చిమబెంగాల్‌కు మొదటి లెప్టినెంట్ గవర్నర్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) హెచ్.హెచ్ రిస్లే
బి) ఆండ్రూ ప్రెసర్
సి) విలియమ్ వార్డ్
డి) సర్‌పుల్లర్
జవాబు : డి) సర్‌పుల్లర్
☛ Question No.4
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) కృష్ణకుమార్ మిత్ర స్థాపించిన సంజీవని పత్రిక 06 జూలై 1905న బెంగాల్ విభజన వార్తను మొదటిసారిగా ప్రకటించింది
2) శశికుమార్ హోష్ సంపాదకత్వం వహించిన అమృత బజార్ పత్రిక బెంగాల్ విభజనను అధికారికంగా ప్రకటించింది
3) ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం అయింది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కావు
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.5
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1905లో వారణాసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో బెంగాల్ విభజనను ఖందించడానికి మరియు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి వందేమాతరంను నినాదంగా స్వీకరించడానికి తీర్మాణం జరిగింది.
2) బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన రోజును కాంగ్రెస్ సంతాపదినంగా / బ్లాక్ డే గా ప్రకటించారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కావు
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.6
భారత జాతీయ ఉద్యమ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన తొలి ప్రజా ఉద్యమం ఏది ?
ఎ) వందేమాతరం / స్వదేశీ ఉద్యమం
బి) శాసన ఉల్లంగణ ఉద్యమం
సి) క్విట్ ఇండియా ఉద్యమం
డి) సహాయ నిరాకరణ ఉద్యమం
జవాబు : ఎ) వందేమాతరం / స్వదేశీ ఉద్యమం
☛ Question No.7
బెంగాల్ విభజన సందర్భంగా వచ్చిన ఉద్యమానికి వందేమాతర ఉద్యమం అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరు ?
ఎ) లాలా లజపతిరాయ్
బి) అరబిందో ఘోష్
సి) అశ్విని కుమార్ దత్త
డి) బాలగంగాధర తిలక్
జవాబు : సి) అశ్విని కుమార్ దత్త
☛ Question No.8
వందేమాతరం / స్వదేశీ ఉద్యమంకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమం ఆవిర్భవించడానికి ప్రధాన మరియు తక్షణ కారణం అయింది.
2) విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ఉద్యమానికి స్వదేశీ ఉద్యమం అని కూడా అనేవారు
3) ఈ ఉద్యమంలో ప్రజలు వందేమాతరం గీతాన్ని ఆలపించడం, ఒకరినొకరు పలకరించుకోనుటకు వందేమాతరం అనే పదాన్ని ఉపయోగించడం లాంటి చేశారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 2 మరియు 3
డి) 2 మాత్రమే
జవాబు : సి) 1 మరియు 2, 3
☛ Question No.9
వందేమాతరం ఉద్యమంలో భాగంగా బారిసాల్ జిల్లాలో స్వదేశీ బందబ్ సమితిని ఏర్పాటు చేసింది ఎవరు ?
ఎ) లాలా లజపతిరాయ్
బి) అరబిందో హోష్
సి) బాలగంగాధర్ తిలక్
డి) అశ్విని కుమార్ దత్త
జవాబు : డి) అశ్విని కుమార్ దత్త
Also Read :
☛ Question No.10
వందేమాతరం గీతాన్ని ఇంగ్లీషులోకి అనువధించింది ఎవరు ?
ఎ) లాలా లజపతిరాయ్
బి) అరబిందో హోష్
సి) బాలగంగాధర్ తిలక్
డి) అశ్విని కుమార్ దత్త
జవాబు : బి) అరబిందో హోష్
☛ Question No.11
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు ?
ఎ) జార్జ్‌యూల్
బి) సర్ విలియమ్ వెడర్ బర్న్
సి) ఆల్‌ఫ్రెడ్ వెబ్
డి) అనీబిసెంట్
జవాబు : బి) సర్ విలియమ్ వెడర్ బర్న్
☛ Question No.12
స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తువుల ప్రోత్సాహకం కోసం ప్రముఖ నాయకులు స్థాపించిన వాటికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ?
1) ప్రపుల్ల చంద్ర రే బెంగాల్‌లో కెమికల్ కంపెనీ స్థాపించాడు
2) చిందంబరం పిళ్లై మద్రాసు రాష్ట్రంలోని ట్యూటీ కొరిన్ లో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీ ప్రారంభించాడు.
3) బాలగంగాధర్ తిలక్ పూనాలో స్వదేశీ నేత కంపెనీనీ స్థాపించాడు.
4) రవీంద్రనాథ్ ఠాకూర్ స్వదేశీ స్టోర్ ను ప్రారంభించారు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
☛ Question No.13
స్వదేశీ ఉద్యమం కారణంగా బ్రిటీష్ వారి చేత నిషేదించిన పత్రికలు ఏవి ?
1) వందేమాతరం
2) సంధ్య
3) యుగాంతర్
ఎ) 1 మరియు 2
బి) 3 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.14
స్వదేశీ ఉద్యమంలో భాగంగా లాలా లజపతి రాయ్‌తో పాటు దేశ బహిష్కరణకు గురైన వ్యక్తి ఎవరు ?
ఎ) బాలగంగాధర తిలక్
బి) బిపిన్ చంద్రపాల్
సి) అరబిందో గౌస్
డి) సర్దార్ అజిత్ సింగ్
జవాబు : డి) సర్దార్ అజిత్ సింగ్
☛ Question No.15
రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన సందర్భంగా జరిగిన సంబరాలలో ఏ రోజున వైస్రాయ్ లార్డ్ హర్జింజ్ పై హత్యాయత్న కుట్ర జరిగింది ?
ఎ) 20 డిసెంబర్ 1912
బి) 21 డిసెంబర్ 1912
సి) 22 డిసెంబర్ 1912
డి) 23 డిసెంబర్ 1912
జవాబు : డి) 23 డిసెంబర్ 1912
☛ Question No.16
బాలగంగాధర్ తిలక్ స్థాపించిన ఇండియన్ హోంరూల్ లీగ్ సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) పూణే కేంద్రంగా 1916 ఏప్రిల్ 28న స్థాపించారు.
2) దీని మొదటి సమావేశం బెల్గాంలో జరిగింది
3) ఈ ఉద్యమాన్ని విసృతం చేసిన పత్రికలు కేసరి మరియు మారాట
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు :డి) 1, 2 మరియు 3
☛ Question No.17
అనిబిసెంట్ స్థాపించిన అఖిల భారత హోంరూల్ లీగ్ సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) అడయార్ ఉద్యమ కేంద్రంగా 03 సెప్టెంబర్ 1916న స్థాపించడం జరిగింది
2) దీని మొదటి సమావేశం మద్రాస్‌లో జరిగింది
3) ఈ ఉద్యమాన్ని విసృతం చేసిన పత్రికలు కామన్‌వీల్, న్యూఇండియా
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.18
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1907లో విడిపోయిన మితవాదులు, అతివాదులు 1916 లక్నో సమావేశంలో కలవడంలో అనిబీసెంట్ మరియు తిలక్‌లు ప్రముఖ పాత్ర పోషించారు.
2) 1916 లక్నో సమావేశంలో కాంగ్రెస్ ముస్లీం లీగ్‌లు ఒప్పందం చేసుకొని అంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడాలి అని నిర్ణయించుకున్నాయి
3) ఈ ఉద్యమాన్ని విసృతం చేసిన పత్రికలు కామన్‌వీల్, న్యూఇండియా
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు
జవాబు : సి) 1 మరియు 2
0 Comments