
ఆధునిక భారతదేశ చరిత్ర (జాతీయోద్యమం - వివిధ సంస్థలు జీకే ప్రశ్నలు - జవాబులు
Modern Indian History Gk Questions in Telugu with Answers
☛ Question No.1
ఏసియాటిక్ సోసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఈ సంస్థను 1784లో విలియమ్స్ జోన్స్ కలకత్తా కేంద్రంగా స్థాపించాడు.
2) దేశంలోని ప్రాచీన విషయాలపై అధ్యయనం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
3) ఈ సంస్థలోని సభుడైన చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ఇంగ్లీషులోకి అనువదించాడు.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.2
భారతదేశంలో మొదటి రాజకీయపరమైన సంస్థగా పేర్కొనే ల్యాండ్ హోల్డర్స్ సోసైటీని (భూస్వామ్య సంఘం) ఎవరు ఏర్పాటు చేశారు ?
1) ద్వారకానాథ్ ఠాగూర్
2) ప్రసన్న కుమార్ ఠాగూర్
3) రాధాకాంత్ దేవ్
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.3
ఇండియన్ అసోసియేషన్ / ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే సంస్థకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందు ఏర్పాటైన రాజకీయ సంస్థలలో అతి ప్రధానమైనది
2) 26 జూలై 1876న కలకత్తాలోని ఆల్భర్డ్ హాలులో సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద్‌మోహన్‌బోస్‌లు కలిసి దీనిని స్థాపించారు.
3) ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం అయింది
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.4
ఇండియన్ అసోసియేషన్ సంస్థ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను గుర్తించండి ?
1) 1877లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల వయోపరిమితిన 19 నుండి 21 సంవత్సరాలకు పెంచాలని ఉద్యమించి సఫలం అయింది
2) జమీందారులకు వ్యతిరేకంగా కౌలుదారుల హక్కుల రక్షణ మరియు తేయాకు తోట కార్మికుల హక్కుల రక్షణకు పోరాటం చేసింది
3) ఆప్గాన్ యుద్ద ఖర్చులు నూలు వస్త్రాలపై సుంక విదాన అంశాలపై ప్రజాసభలు నిర్వహించింది.
4) ప్రాంతీయ భాష పత్రికల చట్టవివాదంపై మరియు ఇల్బర్ట్ బిల్లు వివాధంపై ఈ సంస్థ ఉద్యమించింది.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
☛ Question No.5
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను స్థాపించింది ఎవరు ?
ఎ) విలియం వెడర్ బర్న్
బి) చార్లెస్ బ్రాడ్ లా
సి) జార్జీ యుల్
డి) ఆల్బర్ట్ హాల్ హ్యూమ్
జవాబు : డి) ఆల్బర్ట్ హాల్ హ్యూమ్
☛ Question No.6
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INS) కు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) 19వ శతాబ్దంలో అప్పటికి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రాజకీయ చైతన్యంతో ప్రాంతీయంగా అనేక సంఘాలు స్థాపించినప్పటికి అఖిల భారత స్థాయిలో ఏర్పడిన సంఘం భారత జాతీయ కాంగ్రెస్
2) ఏ.వో హ్యూమ్ 28 డిసెంబర్ 1885న బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాలలో ఈ సంస్థను స్థాపించాడు.
3) ఏ.వో హ్యూమ్ ఈ సంస్థను తొలుత ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుని ప్రతిపాదించగా దీని మొదటి సమావేశంలో దాదాబాయి నౌరోజీగారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుని ఖరారు చేశారు.
4) ఏ.వో హ్యూమ్, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జి, డబ్ల్యూ.సి బెనర్జీ ఈ సంస్థ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
☛ Question No.7
ఏ.వో హ్యూమ్‌కు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఇతను దివ్యజ్ఞాన సమాజంలో ఒక సభ్యుడు మరియు ఇతను ఒక సివిల్ సర్వేంట్‌గా ఉంటూ ఎటావా జిల్లాకు పాలన అధికారిగా పనిచేశాడు.
2) ఇండియన్ కాంగ్రెస్ ముఖ్య కార్యనిర్వహకునిగా వ్యవహరించాడు.
3) పక్షుల అధ్యయనంలో చేసిన కృషికిగాను ఇతనిని ది పోప్ ఆఫ్ ది ఆర్నిథాలాజీ అని అంటారు.
4) ఇతనికి సిమ్లా ఋషి అనే బిరుదు కలదు
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
Also Read :
☛ Question No.8
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INS) స్థాపించిన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ / వైస్రాయ్ ఎవరు ?
ఎ) లార్డ్ రిప్పన్
బి) లార్డ్ ఢఫ్రిన్
సి) లార్డ్ క్రాస్
డి) లార్డ్ లాన్స్ డౌన్
జవాబు : బి) లార్డ్ ఢఫ్రిన్
☛ Question No.9
ఈ వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 1888లో లండన్‌లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటీష్ కమిటీ ఏర్పడినది
2) బ్రిటీష్ ప్రజలకు అక్కడి శాసనసభలకు భారతీయుల బాదలను తెలియజేయాలి అనే ఉద్దేశ్యంతో 1889లో INS బ్రిటీష్ కమిటీ ప్రారంభించిన వారపత్రిక పేరు - ఇండియన్
3) ఇండియన్ అసోసియేషన్ 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం అయింది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 1 మరియు 2 రెండూ కావు
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.10
1885లో జరిగిన మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఈ సమావేశం బాంబేలో డబ్ల్యూ.సి బెనర్జీ అధ్యక్షతన జరిగింది.
2) ఈ సమావేశంలో మొత్తం 72 మంది పాల్గొనగా అందులో ఆంధ్రప్రాంతం నుండి నలుగురు హజరయ్యారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.11
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INS) సంస్థగా గుర్తింపు, బ్రిటిష్ సార్వభౌమత్వ అంగీకారం లభించిన సమావేశం ఏది ?
ఎ) 1885-బాంబే
బి) 1886-కలకత్తా
సి) 1887- మద్రాసు
డి) 1888 - అలహాబాద్
జవాబు : సి) 1887- మద్రాసు
☛ Question No.12
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు ?
ఎ) జార్జ్‌యూల్
బి) సర్ విలియమ్ వెడర్ బర్న్
సి) ఆల్‌ఫ్రెడ్ వెబ్
డి) అనీబిసెంట్
జవాబు : బి) సర్ విలియమ్ వెడర్ బర్న్
☛ Question No.13
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) 1917 కలకత్తాలో జరిగిన సమావేశానికి అనిబిసెంట్ మొదటి మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది.
2) 1925 కాన్పూర్‌లో జరిగిన సమావేశానికి సరోజినీ నాయుడు మొదటి భారత మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది.
3) 1933 కలకత్తాలో జరిగిన సమావేశానికి నళిని సేన్ గుప్తా మూడవ మరియు చివరి మహిళా అధ్యక్షురాలిగా బాద్యతలు నిర్వహించింది.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.14
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మరియు దేశ విభజన జరిగిన సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు ?
ఎ) మౌలానా అబ్దుల్ కలాం అజాద్
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) జే.బి కృపలానీ
డి) పట్టాభి సీతారామయ్య
జవాబు : సి) జే.బి కృపలానీ
Also Read
Modern Indian History (National Movement) Questions in Telugu Part - 3Modern Indian History (National Movement) Questions in Telugu Part - 2
0 Comments