
ఆధునిక భారతదేశ చరిత్ర (గాంధీయుగం) జీకే ప్రశ్నలు - జవాబులు Part - 1
Modern Indian History Gk Questions in Telugu (Gandhi Era) | Gk Quiz Test in Telugu | Gk MCQ Questions in Telugu
1) గుజరాత్‌లోని కతియవార్ స్వదేశీ సంస్థానంలోని పోర్‌బందర్‌లో జన్మించాడు
2) తల్లి పుత్లిబాయి మరియు తండ్రి కరమ్ చంద్ గాంధీలకు 02 అక్టోబర్ 1869న జన్మించాడు.
3) 1883 సంవత్సరంలో తన 13వ ఏటా కస్తూర్భా గాంధీతో వివాహం జరిగింది
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 3
డి) 2 మరియు 3 సరైనవి
జవాబు : సి) 1, 2 మరియు 3
☛ Question No.2
గాంధీ యొక్క పూర్తి పేరుఏమిటీ ?
ఎ) మహాత్మా గాంధీ
బి) కరమ్ చంద్‌గాంధీ
సి) మోహన్‌దాస్ కమర్‌చంద్ గాంధీ
డి) మోహన్‌దాస్ గాంధీ
జవాబు : సి) మోహన్‌దాస్ కమర్‌చంద్ గాంధీ
☛ Question No.3
గాంధీజీ బార్-ఎల్-లా ఎక్కడ అభ్యసించారు ?
ఎ) దర్బన్
బి) లండన్
సి) జొహెన్స్‌బర్గ్
డి) నూయార్క్
జవాబు : బి) లండన్
☛ Question No.4
గాంధీజీ లండన్‌లో బార్-ఎట్-లా పట్టా పొందిన తర్వాత 1891లో భారతదేశానికి తిరిగి వచ్చి ఏ నగరంలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు ?
ఎ) కలకత్తా
బి) బొంబాయి
సి) మద్రాసు
డి) అహ్మదబాద్
జవాబు : బి) బొంబాయి
☛ Question No.5
ప్రముఖులు గాంధీజీకి ఇచ్చిన బిరుదులను జతపరచండి ?
1) మహాత్మ
2) జాతిపిత
3) బాపూజీ
4) కైజర్ - ఎ - హింద్
ఎ) జవహర్‌లాల్ నెహ్రూ
బి) రవీంద్రనాథ్ ఠాకూర్
సి) బ్రిటిష్ ప్రభుత్వం
డి) సుభాష్ చంద్రబోస్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు :సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
☛ Question No.6
ఈ క్రిందివాటిలో సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ స్థాపించిన పత్రిక ఏది ?
1) 1893 గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థిరపడిన పోరుబందరుకు చెందిన దాదా అబ్దుల్లా తరపున వాదించుటకు లీగల్ అడ్వైజర్‌గా అక్కడికి వెళ్లాడు
2) దక్షిణాఫ్రికాలో భారతీయ ఓటు హక్కు గురించి పోరాటం జరిపి నటాల్ రాష్ట్రంలో విజయం సాధించి అక్కడే 1894 నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు.
3) 1913లో క్రైస్తవేతర వివాహాలు చెల్లవంటూ దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆ తీర్పుకు వ్యతిరేకంగా హిందూ సాంప్రదాయ బద్ద వివాహాలు గుర్తించాలని మొదటిసారిగా సత్యాగ్రహం చేశాడు.
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 3
డి) 3 మాత్రమే
జవాబు : బి) 1 మరియు 2
☛ Question No.7
గాంధీజీ బాల్యవివాహంపై చర్చిన పుస్తకం ఏది ?
ఎ) సత్యాగ్రహా
బి) ఇండియన్ స్ట్రగుల్
సి) ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పరీమెంట్ విత్ ట్రూత్
డి) కాన్సెప్ట్ ఆఫ్ సెల్ప్ రూల్
జవాబు : సి) ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పరీమెంట్ విత్ ట్రూత్
Also Read :
☛ Question No.8
గాంధీజీ స్థాపించిన ఆశ్రమాలు ఆయా ప్రదేశాలతో జతపరచండి ?
1) ఫినిక్స్
2) టాల్‌స్టాయ్
3) వార్ధా
4) సబర్మతి
ఎ) గుజరాత్
బి) మహారాష్ట్ర
సి) జోహెన్స్‌బర్గ్
డి) డర్భన్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
జవాబు : డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
☛ Question No.9
గాంధీజీ ఈ క్రింది పత్రికలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులపై అనేక వ్యాసాలు ప్రచురించాడు ?
ఎ) యంగ్ ఇండియా
బి) హర్జాన్
సి) నవజీవన్
డి) ఇండియన్ ఒపినియన్
జవాబు : డి) ఇండియన్ ఒపినియన్
☛ Question No.10
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే
2) గాంధీజీని తన రాజకీయ గురువుగా చెప్పుకున్న వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
3) గాంధీని అర్ధనగ్న ఫకీర్ గా విమర్శించినది లార్డ్ మౌంట్ బాటన్
4) గాంధీజీ తన జీవితంలో ప్రతి దశలోనూ పాటించిన సిద్దాంతాలు సత్యం, అహింస
ఎ) 1, 2 మరియు 4
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 4
డి) 1, 2, 3 మరియు 4
జవాబు :సి) 1, 2 మరియు 4
☛ Question No.11
1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన గాంధీజీ దాదాపు 22 సంవత్సరాల తర్వాత 1915లో తిరిగి భారతదేశానికి వచ్చిన తేది ఏమిటీ ?
ఎ) 09 జనవరి
బి) 09 ఫిబ్రవరి
సి) 09 మార్చి
డి) 09 ఏప్రిల్
జవాబు : ఎ) 09 జనవరి
☛ Question No.12
భారతదేశంలో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏది ?
ఎ) ఖేదా సత్యాగ్రహం
బి) చంపారన్ సత్యాగ్రహం
సి) అహ్మదబాద్ సత్యాగ్రహం
డి) సహాయ నిరాకరణ ఉద్యమం
జవాబు : బి) చంపారన్ సత్యాగ్రహం
☛ Question No.13
ఈ క్రింది వారిలో ఎవరి యొక్క ఆహ్వానం మేరకు గాంధీజీ చంపారన్‌లో నీలిమందు సాగు చేసిన రైతు స్థితిగతుల విచారణ కొరకు ఉద్యమం చేపట్టారు ?
ఎ) బాబు రాజేంద్రప్రసాద్
బి) మహాదేవ్ దేశాయి
సి) రాజ్ కుమార్ శుక్ల
డి) జేపి కృపలాని
జవాబు : సి) రాజ్ కుమార్ శుక్ల
☛ Question No.14
చంపారన్ ఉద్యమానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) నీలిమందు రైతుల సమస్యలు పరిష్కారం కోసం 10 ఏప్రిల్ 1917న గాంధీజీ నేతృత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది.
2) 29 మే 1917 గాంధీని బీహార్ గవర్నర్ ఆహ్వానించి నీలిమందు సమస్యల పరిష్కారం కోసం ప్రాక్స్ రాయి కమిటీని ఏర్పరచి ఆ కమిటీకి గాంధీని కార్యదర్శిగా నియమించాడు.
3) ప్రాక్స్ రాయి కమిటీ నివేదిక ఆధారంగా తీన్ కతియా విధానంలో కొన్ని మార్పులు మాత్రమే చేయబడ్డాయి
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.15
గాంధీజీ తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఉద్యమం ఏది ?
ఎ) ఖేదా సత్యాగ్రహం
బి) చంపారన్ సత్యాగ్రహం
సి) అహ్మదబాద్ సత్యాగ్రహం
డి) సహాయ నిరాకరణ ఉద్యమం
జవాబు : సి) అహ్మదబాద్ సత్యాగ్రహం
Also Read
1) Gandhi Biographi in Telugu
0 Comments